
📌 Key Points
- ధనుష్‌కు రూ. 20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని లీగల్ నోటీసులు పంపిన నిర్మాణ సంస్థ.
- 2016లో ‘నాన్ రుద్రన్’ సినిమా చేయడానికి ధనుష్, నిర్మాణ సంస్థ మధ్య ఒప్పందం జరిగింది.
- స్క్రిప్ట్ ఇవ్వకపోవడంతో షూటింగ్ ఆలస్యమైందని నిర్మాణ సంస్థ ఆరోపణ.
- ధనుష్ ప్రస్తుతం తన 55వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ప్రముఖ నటుడు ధనుష్‌కు లీగల్ నోటీసులు అందాయి. తమిళ నిర్మాణ సంస్థ ఆయనకు రూ.20 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని నోటీసులు పంపింది. సినిమా కమిట్‌మెంట్ పూర్తి చేయకపోవడం వల్ల నష్టం వాటిల్లిందని సంస్థ ఆరోపిస్తోంది.
ధనుష్‌కు లీగల్ నోటీసులు ఎందుకు?
Hero Dhanush:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)తన అద్భుతమైన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు నటుడు గానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా మంచి ఇమేజ్ దక్కించుకున్న ఈయన ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఈయనకు లీగల్ నోటీసులు పంపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ధనుష్ కి లీగల్ నోటీసులు ఎవరు పంపించారు? అలా పంపించడం వెనుక అసలు కారణం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం
విషయంలోకి వెళ్తే.. తమిళ నిర్మాణ సంస్థ ‘తేనాండాళ్ ఫిలిమ్స్’ తో ధనుష్ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. కమిట్మెంట్ పూర్తి చేయకపోవడం వల్ల సినిమా ఆలస్యం అవుతోందని, ఇప్పటికే రూ.20 కోట్లు నష్టం వాటిల్లిందని ఫలితంగా రూ.20 కోట్లు నష్టపరిహారం చెల్లించాలి అని లీగల్ నోటీసులను నిర్మాణ సంస్థ ధనుష్ కి పంపింది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది..
నిర్మాణ సంస్థ ఆరోపణలు ఏంటి?
పూర్తి వివరాలలోకి వెళితే ” 2016లో ఈ నిర్మాణ సంస్థపై ‘నాన్ రుద్రన్’ సినిమా చేయడానికి ధనుష్ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలని ధనుష్ భావించారు. కానీ ఆ తర్వాత దర్శకుడిగా తన నిర్ణయం విరమించుకోవడంతో వేరొక దర్శకుడిని సంప్రదించారు నిర్మాతలు. అయితే ధనుష్ వారికి పూర్తిగా స్క్రిప్ట్ ఇవ్వలేదని ఇప్పుడు నిర్మాణ సంస్థ ఆరోపణలు చేస్తోంది. దీని కారణంగానే షూటింగ్ ఆలస్యం అవుతుందని.. అందుకే 20 కోట్లు నష్టం వచ్చిందని సంస్థ తెలిపింది. ఇప్పటివరకు ధనుష్ ఈ చిత్రాన్ని ప్రారంభించలేదని దీన్ని పక్కన పెట్టి ఇతర చిత్రాలను అంగీకరిస్తున్నారు అంటూ లీగల్ నోటీసులు పంపించింది. ఇక దీనిపై హీరో టీం ఇంకా స్పందించలేదు. మొత్తానికైతే సినిమా చేస్తానని ఒప్పుకున్న ధనుష్ 10 ఏళ్లు గడిచినా.. పట్టించుకోకపోవడం వల్లే.. సినిమా నిర్మాణం ఆలస్యం అవుతుందని భావించిన నిర్మాణ సంస్థ ధనుష్ కి లీగల్ నోటీసులు పంపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ధనుష్ తదుపరి చిత్రాలు
ప్రస్తుతం ధనుష్ తన 55వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. డీ55 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల తో పాటు ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే చివరిగా తెలుగు, తమిళ్ భాషల్లో బైలింగ్వల్ గా వచ్చిన కుబేర సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించగా.. నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్న తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కారా లో ధనుష్ నటిస్తున్నారు. ఈ ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది. అలాగే ఇళయరాజా బయోపిక్ లో ధనుష్ నటిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అలాగే దర్శకుడు వెట్రిమారన్ తో ఒక సినిమా చేస్తున్నారు.
మొత్తానికి ధనుష్‌కు లీగల్ నోటీసులు రావడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ధనుష్ ఎలా స్పందిస్తారో చూడాలి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.


