|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నోలన్ ‘ది ఒడిస్సీ’లో ధనుష్ మిస్సింగ్: అసలు కారణం ఇదే!

Published: 22-07-2026, 10:05 AM

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఒడిస్సీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాలో నటించే అవకాశం ధనుష్‌కు వచ్చిందని, అయితే ఆయన కొన్ని కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు ధనుష్ ‘ది ఒడిస్సీ’లో ఎందుకు నటించలేదో ఇప్పుడు తెలుసుకుందాం.

Key Points

1

ధనుష్ నటనకు ఫిదా అయిన క్రిస్టోఫర్ నోలన్, 'ది ఒడిస్సీ'లో అవకాశం ఇచ్చాడు.

2

ధనుష్ 'కుబేర', 'రాయన్', 'కెప్టెన్ మిల్లర్' వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు.

4

ఈ గొప్ప అవకాశం మిస్ అవ్వడంపై ధనుష్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

నోలన్ దృష్టిలో ధనుష్ ఎలా పడ్డాడు?

Dhanush Odyssey: ఒడిస్సీ…ఒడిస్సీ…ఒడిస్సీ…ఇపుడు ఎక్కడ చూసినా ఈ సినిమా నామ స్మరణే.క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఈ యాక్షన్-ఫాంటసీ వండర్ ఆ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది మరి.అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్ డేట్ ఇపుడు సౌత్ ఇండియాని షేక్ చేస్తుంది.ఏంటి అంటారా …అదే ఈ సినిమాలో ధనుష్ ని నటించమని అడిగితే నో చెప్పేశాడని.

నటించే మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్న ధనుష్

అవును ..విషయంలోకి వెళ్తే గతంలో రస్సో బ్రదర్స్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ది గ్రే మ్యాన్’ (The Gray Man) సినిమాలో ధనుష్ నటించిన సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమాలో ధనుష్ నటనని చూసి ఫిదా అయిన క్రిస్టోఫర్ నోలన్ తన ఒడిస్సీ సినిమాలో నటించమని అడగమని తన క్యాస్టింగ్ డైరెక్టర్ కి చెప్పాడట. దానితో ఆ క్యాస్టింగ్ డైరెక్టర్ ధనుష్ ని అప్రోచ్ కాగా అప్పటికే తను శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వస్తున్న ‘కుబేర’ (Kubera)తో పాటు, ధనుష్ స్వయంగా డైరెక్ట్ చేసిన ‘రాయన్’ (Raayan), అరుణ్ మాథేశ్వరన్ ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller) వంటి సినిమాలతో తెగ బిజీగా ఉండటం మూలానా నోలన్ టీమ్ అడిగినన్ని రోజుల కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని ఒడిస్సీ సినిమాలో నటించే మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడట.

‘ది ఒడిస్సీ’ని ధనుష్ ఎందుకు వదులుకున్నాడు?

‘ది ఎక్స్‌ట్రాఆర్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ (The Extraordinary Journey of the Fakir) సినిమాతో హాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి,ఆ తర్వాత ‘ది గ్రే మ్యాన్’తో ఇంటర్నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్.. ఒకవేళ ఈ నోలన్ మాస్టర్‌పీస్‌లో కనిపిస్తే ఆయన ఇమేజ్ మరింత రేంజ్ కి వెళ్ళేదని, ఆ సినిమా అవకాశం అలా మిస్ అవడంతో తెగ బాధ పడిపోతున్నారు ధనుష్ ఫ్యాన్స్.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత ఇథాకా రాజు ఒడిస్సియస్ (మాట్ డామన్) తన సొంత ఊరికి తిరిగి వెళ్లడానికి పదేళ్ల పాటు చేసిన ఒక డేంజరస్ జర్నీయే ఈ ‘ది ఒడిస్సీ’.సముద్ర దేవుడు పోసిడాన్ శాపం వల్ల దారి తప్పిన హీరో, ఒంటికన్ను రాక్షసుడు సైక్లోప్స్, విచిత్రమైన మంత్రగత్తె సిర్సీ, నావికులను తమ మాయ పాటలతో లొంగదీసుకునే సైరన్ల వంటి ఎన్నో ఆటంకాలను దాటుకుంటూ వస్తాడు.

ధనుష్ అభిమానుల నిరాశ

చివరికి కాలిప్సో అనే దేవత ఐలాండ్‌లో ఏడేళ్ల పాటు బంధీగా ఉండి, ఒలింపియన్ దేవతల హెల్ప్‌తో పోరాడి తన భార్య పెనెలోప్ (ఆన్ హ్యాథవే), కొడుకు టెలిమాకస్ (టామ్ హాలండ్) దగ్గరకు చేరుకుంటాడు. అలా నోలన్ తన మార్కు ట్విస్టులు, విజువల్స్‌తో క్లైమాక్స్‌ను మైండ్ బ్లోయింగ్‌గా ప్రెజెంట్ చేశారు.సరిగ్గా ఇలాంటి ఒక గ్లోబల్ సినిమాలో ధనుష్ కూడా ఉండి ఉంటే సినిమా ఇండియాలో మరింత వసూల్లని కొల్లగొట్టేదని కామెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్

సినిమా విషయానికి వస్తే హోమర్ రాసిన గ్రీకు ఇతిహాసం ఆధారంగా తీసిన ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 270 మిలియన్ డాలర్లు వసూలు చేయగా ఇండియాలో కూడా రూ. 100 కోట్ల మార్కు వైపు దూసుకెళ్ళడం విశేషం.ఏది ఏమైనా మన ధనుష్ ఈ సినిమాని మిస్ అవడం నిజంగా మన బ్యాడ్ లక్ అనే చెప్పాలి !

ధనుష్ బిజీ షెడ్యూల్ కారణంగా ‘ది ఒడిస్సీ’ వంటి గొప్ప అవకాశాన్ని కోల్పోవడం ఆయన అభిమానులను నిరాశపరిచింది. అయితే, ఆయన ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు కూడా భారీ అంచనాలతో ఉండటం గమనార్హం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.