|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dhanush – Mrunal Thakur : నిజంగానే ధనుష్ – మృణాల్ డేటింగ్ చేస్తున్నారా? ముంబైలో మీటింగ్..

Published: 05-08-2025, 9:46 AM
Dhanush – Mrunal Thakur : నిజంగానే ధనుష్ – మృణాల్ డేటింగ్ చేస్తున్నారా? ముంబైలో మీటింగ్..

తాజాగా విడాకులు తీసుకున్న ధనుష్ మరియు బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముంబైలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలు వెలువడ్డాయి.

Key Points

1

ధనుష్, మృణాల్ ఠాకూర్ ఒకే పార్టీలో కనిపించారు.

2

వారిద్దరూ చాలా క్లోజ్ గా ఉండి, హగ్స్ ఇచ్చుకున్నట్టు వార్తలు.

4

ధనుష్, మృణాల్ ఇద్దరూ ఈ వార్తలపై స్పందించలేదు.

ముంబైలో ధనుష్ మరియు మృణాల్ కలిసి

Dhanush – Mrunal Thakur : తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవలే కొన్నాళ్ల క్రితం ఐశ్వర్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ధనుష్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మృణాల్ ఠాకూర్ తో డేటింగ్ లో ఉన్నట్టు బాలీవుడ్ లో తెగ వార్తలు వస్తున్నాయి.

ఇటీవల మృణాల్ ఠాకూర్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాకు చెందిన ఓ పార్టీలో ధనుష్ కూడా కనిపించాడు. అదే పార్టీలో మృణాల్ పుట్టిన రోజు వేడుకలను కూడా సెలబ్రేట్ చేసారు. ఈ వేడుకలకు ధనుష్ హాజరయ్యాడని టాక్. పార్టీలో ధనుష్, మృణాల్ చాలా క్లోజ్ గా ఉండటం,హగ్స్ ఇచ్చుకోవడం, సెల్ఫీలు దిగడం.. ఇవన్నీ చూసి మృణాల్ -ధనుష్ డేటింగ్ లో ఉన్నారని అంతా భావిస్తున్నారు. ధనుష్ – మృణాల్ క్లోజ్ గా ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

వైరల్ అవుతున్న ఫోటోలు మరియు వీడియోలు

బాలీవుడ్ లో అయితే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నది నిజమే అంటున్నారు. అయితే ఈ వార్తలు అన్ని చూసి అసలు వాళ్లిద్దరూ కలిసే నటించలేదు, వాళ్లిద్దరూ గతంలో ఎప్పుడూ కలవలేదు, ముంబైలో ఇప్పుడు ఎందుకు కలిశారు? వీరిద్దరూ ఎలా రిలేషన్ లో ఉన్నారు అని పలువురు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ రూమర్స్ పై మృణాల్ కానీ, ధనుష్ కానీ ఇంకా స్పందించలేదు.

నటుల స్పందన

ఇక ధనుష్ త్వరలో ఇడ్లీ కడై సినిమాతో రానున్నాడు. మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ త్వరలో అడివిశేష్ డెకాయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మృణాల్ చేతిలో దాదాపు 5 సినిమాలు ఉన్నాయి.

ప్రస్తుతం ధనుష్ మరియు మృణాల్ ఇద్దరూ వారి వారి సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ డేటింగ్ రూమర్స్ పై వారి నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.