
📌 Key Points
- ధనుష్, మృణాల్ మధ్య ప్రేమాయణం నిజమేనా? ఫిబ్రవరి 14న పెళ్లి అంటూ వైరల్ న్యూస్!
- ఐశ్వర్యతో విడాకుల తర్వాత మృణాల్‌తో ధనుష్ కొత్త జీవితం ప్రారంభించనున్నాడా?
- మృణాల్ ఠాకూర్ వయసు 33, ధనుష్ వయసు 42.. వీరిద్దరి మధ్య 9 ఏళ్ల ఏజ్ గ్యాప్ హాట్ టాపిక్!
- ధనుష్, మృణాల్ పెళ్లిపై నెటిజన్ల విమర్శలు.. కొందరు సపోర్ట్, మరికొందరు ట్రోల్స్!
కోలీవుడ్ స్టార్ ధనుష్, మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ధనుష్, మృణాల్ మధ్య ప్రేమ నిజమేనా?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ సోషల్ మీడియాలో వరుస వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. గత కొద్ది కాలంగా ప్రైవేట్ పార్టీల్లో ఇద్దరూ క్లోజ్‌గా కనిపించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. అంతేకాదు, త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఫిబ్రవరి 14న వీరి వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సూపర్ స్టార్ కూతురు ఐశ్వర్యతో పెళ్లై ఇద్దరు పిల్లలున్న ధనుష్‌ను మృణాల్ పెళ్లి చేసుకోబోతుండటంతో.. ఈ విషయం కాస్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. గత వారం రోజుల నుంచి ఎక్కడ చూసిన వీరికి సంబంధించిన వార్తలే దర్శనమిస్తున్నాయి.
ఈక్రమంలో.. తాజాగా, మరో షాకింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదేంటంటే.. వీరిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మృణాల్ ఠాకూర్ 1992 ఆగస్టు 1, న జన్మించింది. ప్రస్తుతం ఆమెకు 33 సంవత్సరాలు. ఇక నటుడు ధనుష్ విషయానికి వస్తే.. 1983 జూలై 28, న జన్మించాడు. ఇప్పుడు ఆయనకు 42 సంవత్సరాలు. ఈ లెక్కన వీరిద్దరి మధ్య దాదాపు 9 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండటం గమనార్హం. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మృణాల్‌ను ఏకిపారేస్తున్నారు. పెళ్లై పిల్లలున్న వాడు తప్ప మరొకరు దొరకలేదా? అని దారుణంగా మాట్లాడుతున్నారు. మరికొందరు మాత్రం ప్రేమ ఎవరిపై ఎప్పుడు మొదలవుతుందో? తెలియదు అది వీరిద్దరి మధ్య కూడా జరగొచ్చుగా? అని సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
ఏజ్ గ్యాప్‌తో నెటిజన్ల షాకింగ్ కామెంట్స్!
ఫిబ్రవరి 14న పెళ్లి వార్తల్లో నిజమెంత?
ధనుష్, మృణాల్ పెళ్లి వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి చూడండి.


