|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ ట్విస్ట్: ధనుష్, మృణాళ్ పెళ్లిపై అసలు నిజం చెప్పిన టీమ్! ఇక ఫ్యాన్స్ ఆగ్రహం!

Published: 17-01-2026, 10:15 PM
షాకింగ్ ట్విస్ట్: ధనుష్, మృణాళ్ పెళ్లిపై అసలు నిజం చెప్పిన టీమ్! ఇక ఫ్యాన్స్ ఆగ్రహం!
  • ధనుష్, మృణాళ్ ఠాకూర్ల పెళ్లి వార్తల్లో నిజం లేదని మృణాళ్ టీమ్ స్పష్టీకరణ.
  • ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన లేదని మృణాళ్ ఠాకూర్ టీమ్ వెల్లడి.
  • ధనుష్ గతంలో ఐశ్వర్య రజనీకాంత్‌కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.
  • గతంలో మీనాతో ధనుష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని వచ్చిన వార్తలను మీనా ఖండించారు.

ధనుష్, మృణాళ్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలపై మృణాళ్ టీమ్ స్పందించింది. ఇందులో ఎంత నిజం ఉంది? అసలు విషయం ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వారి రిలేషన్ గురించి వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు.

మృణాళ్, ధనుష్‌ల పెళ్లి వార్తల్లో నిజమెంత?

Danush -Mrunal Thakur: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తూ ఉంటాయి. ఒక హీరో హీరోయిన్ కలిసి చనువుగా కనిపించిన , వరుసగా రెండు మూడు సినిమాలలో నటించిన వారిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే నటి మృణాళ్ ఠాకూర్(Mrunal Thakur), నటుడు ధనుష్(Danush) జంట గురించి కూడా ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వడమే కాకుండా ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మరోసారి వీరికి సంబంధించిన ఈ వార్తలు తెరపైకి వచ్చాయి.

ఇన్ని రోజులు రిలేషన్ లో ఉన్న ఈ జంట వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వార్తల పై మృణాళ్ ఠాకూర్ టీమ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. నటి మృణాళ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తనకసలు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఈ రూమర్లను ఉద్దేశపూర్వకంగానే సృష్టించారని వెల్లడించడంతో ఈ పుకార్లకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది.

పెళ్లిపై మృణాళ్ ఠాకూర్ టీమ్ క్లారిటీ!

ఇప్పటికైనా వీరిద్దరి డేటింగ్, పెళ్లి రూమర్లకు చెక్ పడుతుందా.. లేదంటే ఇలాగే కొనసాగుతుందా అనేది తెలియాల్సి ఉంది.. అయితే ధనుష్ పెళ్లి గురించి ఇదివరకు ఎన్నో రకాల వార్తలు వచ్చాయి ఈయన సీనియర్ నటి మీనాను రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా గతంలో వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలను కూడా నటి మీనా పూర్తిగా ఖండించారు. ధనుష్ ఇదివరకే పెళ్లి చేసుకుని తన భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 18 సంవత్సరాల వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపిన ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ వ్యక్తిగత భేదాభిప్రాయాల వల్ల విడాకులతో విడిపోయారు.

విడుదలకు సిద్ధమవుతున్న డెకాయిట్…

గతంలో ధనుష్ పెళ్లి రూమర్స్!

ఇలా తన భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి ధనుష్ రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ధనుష్ తన పెళ్లి రూమర్ల గురించి ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. ఇక గత కొంతకాలంగా మృణాళ్ ఠాకూర్ తో ఈయన డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం తెరపైకి రావడంతో ఈ వార్తలకు కూడా చెక్ పెట్టారు. ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు త్వరలోనే ఈమె హీరో అడివి శేష్ తో కలిసి నటించిన డెకాయిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మార్చ్ 19 వ తేదీ విడుదల కాబోతున్న విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు.

మొత్తానికి ధనుష్, మృణాళ్ పెళ్లి రూమర్లకు ప్రస్తుతానికి తెరపడింది. అయితే, భవిష్యత్తులో వీరిద్దరి గురించి ఎలాంటి వార్తలు వస్తాయో చూడాలి. ప్రస్తుతం వీరిద్దరూ తమ కెరీర్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.