|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ధనుష్, నాగార్జున ‘కుబేర’ టీజర్ వచ్చేసింది.. ఇంట్రెస్టింగ్‍గా పాటతో..

Published: 25-05-2025, 7:43 AM
ధనుష్, నాగార్జున ‘కుబేర’ టీజర్ వచ్చేసింది.. ఇంట్రెస్టింగ్‍గా పాటతో..

తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే ధనుష్, నాగార్జునల కొత్త సినిమా కుబేర టీజర్ విడుదలైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషల్ థ్రిల్లర్ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.

Key Points

కుబేర టీజర్ విడుదల

తమిళ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కలిసి నటిస్తున్న కుబేర సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సోషల్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ హీరోయన్ రష్మిక మందన్నా కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. ఈ తరుణంలో కుబేర సినిమా టీజర్ నేడు (మే 25) వచ్చేసింది.

ట్రాన్స్ ఆఫ్ కుబేర పేరుతో టీజర్ వచ్చింది. నాది.. నాది అంటూ టీజర్ అంతా ఓ మాంటేజ్ సాంగ్ వస్తుంటుంది. ఈ చిత్రంలో క్యారెక్టర్ల స్వభావం తెలిపేలా పాటలో లిరిక్స్ సాగుతుంటాయి. జిమ్ సరభ్ ఈ చిత్రంలో బడా వ్యాపారవేత్తగా ఉంటారు. ఈ లోకంలోని నీరు, భూమి సహా వనరులన్నీ నావే అనుకునేలా జిమ్ క్యారెక్టర్ ఉంటుందని పాట ద్వారా అర్థమవుతోంది. నాగార్జున జైలులో ఉన్నట్టుగా.. ఆ తర్వాత భారీగా డబ్బు ముందు నిల్చున్నట్టు షాట్స్ ఉన్నాయి. ఏదో సమస్యతో సతమతమవుతున్నట్టుగా అర్థమవుతుంది.

ఆకర్షణీయమైన మాంటేజ్ పాట

ధనుష్ పాత్రలో చాలా వేరియేషన్లు కనిపిస్తున్నాయి. ఆకలితో అలమటించడం, కుటుంబంతో సంతోషంగా ఉండడం, నాగార్జున సూట్ తొడగడం, తగాదాలు ఇలా చాలా వైవిధ్యాలు ఉన్నాయి. ధనుష్ పాత్ర గురించి తెలిపే లిరిక్స్ కూడా లోతైన భావంతో ఉన్నాయి. ధనుష్‍‌ది చాలా బరువైన క్యారెక్టర్‌లా అనిపిస్తోంది. ట్రైలర్ చివర్లో నాగార్జున గన్ పేల్చడం సహా యాక్షన్ కూడా ఉంది.

మాంటేజ్ పాటతో కుబేర టీజర్‌ను స్పెషల్‍గా తీసుకొచ్చారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. సాధారణంగా కాకుండా సాంగ్‍తో క్యారెక్టర్ల గురించి తెలిపేలా టీజర్ డిజైన్ చేశారు. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా, థ్రిల్లింగ్‍గా సాగింది. ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున, జిమ్, రష్మిక.. నలుగురి పాత్రలకు బాగా ప్రాధాన్యం ఉన్నట్టు అర్థమవుతోంది.

నటీనటుల ప్రదర్శన

కుబేర సినిమాకు దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టీజర్‌కు తగ్గట్టుగా పాటకు సరిపడా మ్యూజిక్ ఉంది. ఈ మూవీకి నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. టీజర్లో విజువల్స్ కూడా మెప్పించేలా ఉన్నాయి. ఈ మూవీని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‍పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, రామ్ మనోహర్ రావు, డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రొడ్యూజ్ చేస్తున్నారు.

కుబేర చిత్రం తెలుగు, తమిళం, హిందీలో త్రిభాషా చిత్రంగా రూపొందింది. కన్నడలోనూ విడుదల కానుంది. పస్తుతం ఈ టీజర్ తెలుగు, తమిళ భాషల్లో వచ్చింది. అతిత్వరలో హిందీలో రానుంది. ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది.

కుబేర టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ధనుష్, నాగార్జునల నటన, సంగీతం, విజువల్స్ అన్నీ ఆకర్షణీయంగా ఉన్నాయి. జూన్ 20 వరకు వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.