|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

D-55: ధనుష్ సినిమాలో శ్రీలీల.. బ్లాక్ బస్టర్ కాంబో! ఫ్యాన్స్ కి పూనకాలే!!

Published: 31-01-2026, 11:35 PM
D-55: ధనుష్ సినిమాలో శ్రీలీల.. బ్లాక్ బస్టర్ కాంబో! ఫ్యాన్స్ కి పూనకాలే!!
  • ధనుష్ D55లో హీరోయిన్‌గా శ్రీలీల ఎంట్రీ – పోస్టర్‌తో అఫీషియల్ ప్రకటన!
  • రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం D55!
  • గోపురం ఫిల్మ్స్ నిర్మాణంలో, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ!
  • ధనుష్, శ్రీలీల కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు!

టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి మరో క్రేజీ కాంబో రెడీ అయింది. ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న D55 సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

D55లో శ్రీలీల.. అధికారిక ప్రకటన!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.ఇందులో భాగంగా ప్రజెంట్ ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘D55’ ఒకటి. ఈ మూవీకు అమరన్ సినిమాతో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ సినిమాను గోపురం ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.

ధనుష్, శ్రీలీల జోడీ ఎలా ఉండబోతుంది?

ఈ క్రమంలో తాజాగా మూవీ టీమ్ ఓ క్రేజీ అప్డేట్ షేర్ చేసుకుంది. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘ఇది వస్తుందని మీరు చూడలేదు.. D55 పై ఉన్న అద్భుతమైన అమ్మాయి శ్రీలీల(Sreeleela)ని స్వాగతిస్తున్నాను’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో ధనుష్ చేతులు కట్టుకొని నిలబడగా.. శ్రీలీల బొకే పట్టుకొని క్యూట్ స్మైల్ చేస్తుంది. ప్రజెంట్ వీరిద్దరు ఒకే ఫ్రేమ్‌లో ఇలా కనిపించడం చూట్టానికి ఎంతో బాగుంది. మరి ఈ సినిమా అయిన ఈ భామ మంచి విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాల్సి ఉంది.

రాజ్ కుమార్ దర్శకత్వంలో D55!

A post shared by Wunderbar Films (@wunderbarfilms)

ధనుష్, శ్రీలీల కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.