
📌 Key Points
- ధనుష్ నటనకు మృణాల్ ఠాకూర్ ఫిదా, ఆసురన్ సినిమాను చాలాసార్లు చూశానని వెల్లడి.
- తేరే ఇష్క్ మెయిన్ షూటింగ్ లో ధనుష్ ను కలిసి సన్నాఫ్ సర్దార్ 2 స్పెషల్ స్క్రీనింగ్ కు ఆహ్వానించిన మృణాల్.
- ధనుష్ bất ngờగా స్పెషల్ స్క్రీనింగ్ కు వచ్చి మృణాల్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.
- మృణాల్ ప్రస్తుతం అడివి శేష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఫిబ్రవరి 20న విడుదల కానున్న ధో దీవానే సెహర్ మే చిత్రంలోనూ నటిస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, ధనుష్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ధనుష్ నటించిన సినిమాలపై ప్రశంసలు కురిపించడమే కాకుండా, తన సినిమా స్క్రీనింగ్‌కు ఆహ్వానించగా ఆయన సర్ ప్రైజ్ చేశారు.
ధనుష్ నటనపై మృణాల్ ప్రశంసలు
Dhanush: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఇటు తెలుగు అటు హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈమె.. అటు సినిమాల కంటే కూడా ఇటు వ్యక్తిగతంగా మరింత వార్తల్లో నిలుస్తోంది. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు వస్తున్నా.. దీనిపై ఆమె స్పందించి కొట్టి పారేసింది. ముఖ్యంగా తాను పెళ్లి చేసుకునే సమయం వస్తే ముందుగా ఆ విషయాన్ని మీతో చేరవేసే వ్యక్తిని నేనే అవుతాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇలాంటి సమయంలో తాజాగా మృణాల్ ధనుష్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్.. ధనుష్ గురించి మాట్లాడుతూ.. “ధనుష్ లాంటి నటుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. ఆయన హీరోగా చేసిన అసురన్, రాయన్, రంజానా, కెప్టెన్ మిల్లర్, మారి వంటి చిత్రాలను చూశాను. అప్పటి నుంచి ఆయనకు నేను పెద్ద అభిమానిని అయిపోయాను. అసురన్ సినిమా ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. ఆయనలో కేవలం నటుడు మాత్రమే కాదు గీతా రచయిత, రచయిత, దర్శకుడు, సింగర్ కూడా ఉన్నారు. ఒక మనిషిలో ఇన్ని టాలెంట్స్ ఉండడం అనేది చాలా అరుదు.
స్పెషల్ స్క్రీనింగ్ కు ధనుష్ సర్ ప్రైజ్
అయితే ఇటీవల నేను ఆయన నటించిన హిందీ మూవీ తేరే ఇష్క్ మెయిన్ షూటింగ్ కి వెళ్లాను. అక్కడ ధనుష్ ని కలిసి ఒక కోరిక కోరాను. నా సినిమా సన్నాఫ్ సర్దార్ 2 మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కి రావాలని అడిగాను. అయితే ఆయన సడన్గా వచ్చి మాకు సర్ప్రైజ్ ఇచ్చారు” అంటూ మృణాల్ చెప్పుకొచ్చింది. దీంతో మృణాల్ చేసిన కామెంట్లు ఇటు కోలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఏదేమైనా అసలే రూమర్స్ వస్తున్న వేళ ఇప్పుడు మళ్లీ ధనుష్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.
మృణాల్ ఠాకూర్ సినిమాల వివరాలు
మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే.. తెలుగులో సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్న ఈమె ప్రస్తుతం అడివి శేష్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే హిందీలో కూడా ఒక సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సిద్ధాంత చతుర్వేదితో కలిసి ధో దీవానే సెహర్ మే అనే సినిమాలో నటిస్తోంది. ఫిబ్రవరి 20న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఇలా కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
మొత్తానికి మృణాల్, ధనుష్ ల మధ్య స్నేహం గురించి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిద్దరూ కలిసి పనిచేసే అవకాశం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


