|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ధనుష్ మూవీకి ఊహించని షాక్! రూ. 84 కోట్ల ఫైన్.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవుతారు!

Published: 18-01-2026, 6:30 AM
ధనుష్ మూవీకి ఊహించని షాక్! రూ. 84 కోట్ల ఫైన్.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవుతారు!
  • ధనుష్ కొత్త చిత్రం ‘తేరే ఇష్క్ మే’ పై కాపీ ఆరోపణలు, రూ. 84 కోట్ల నష్టపరిహారం డిమాండ్.
  • ఈరోస్ ఇంటర్నేషనల్, రాంఝణా సినిమా సీక్వెల్ విషయంలో కోర్టును ఆశ్రయించింది.
  • ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన రాంఝణా చిత్రం 2013లో విడుదలై భారీ విజయం సాధించింది.
  • తేరే ఇష్క్ మే చిత్రం రాంఝణా సీక్వెల్ అని ప్రచారం చేయడంపై ఈరోస్ అభ్యంతరం.

ప్రముఖ నటుడు ధనుష్ నటించిన తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాపై ఈరోస్ ఇంటర్నేషనల్ కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా రూ. 84 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.

ధనుష్ సినిమాపై కాపీ ఆరోపణలు

Dhanush: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ధనుష్ (Dhanush ) ఒకవైపు హీరోగా.. మరొకవైపు దర్శకుడిగా.. ఇంకొకవైపు నిర్మాతగా ఇలా పలు విభాగాలలో పని చేస్తూ సత్తా చాటుతున్నారు. ఇక తెలుగు, తమిళ్ భాషలలో సినిమాలు చేయడమే కాకుండా ఇప్పుడు హిందీలో కూడా నేరుగా సినిమాలు చేస్తూ అక్కడే నార్త్ ఆడియన్స్ కి కూడా దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన చిత్రం తేరే ఇష్క్ మే. ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మరి కొన్ని రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి కూడా సిద్ధమయ్యింది.

అలాంటి ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే ధనుష్, కృతి సనన్ జంటగా వచ్చిన ఈ చిత్రం గత ఏడాది నవంబర్ 28న తేరే ఇష్క్ మే పేరుతో హిందీ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో అమర కావ్యం అని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ చిత్రంపై ఈరోస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ముంబై కోర్ట్ ను ఆశ్రయించింది. ఈ మూవీ దర్శకుడు, నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ పై నష్టపరిహారం కోసం కోర్టుమెట్లు ఎక్కినట్లు సమాచారం.

ఈరోస్ ఫిర్యాదుకు కారణం ఏమిటి?

విషయంలోకి వెళితే.. తేరే ఇష్క్ మే సినిమా విడుదల సమయంలో ధనుష్ హీరోగా, ఈరోస్ నిర్మాణంలో దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రాంఝణా. ఈ సినిమాకు సీక్వెల్ తేరే ఇష్క్ మే అని ప్రచారం చేశారు. 2013లో 35 కోట్లతో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా.. బాక్స్ ఆఫీస్ వద్ద 105 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. దీంతో ఈ చిత్ర యూనిట్ కి మంచి ఇమేజ్ కూడా లభించింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ అని పబ్లిసిటీ చేసుకున్నారు. కానీ దీనిని ఈరోస్ సంస్థ తప్పు పట్టింది. తమ ప్రమేయం లేకుండా సీక్వెల్ ఎలా ప్రకటిస్తారు? అంటూ ముంబై కోర్టును ఆశ్రయించింది.పైగా రాంఝణా సినిమాకు సీక్వెల్ అని చెప్పుకొని భారీ లాభపడ్డారని ఆ సంస్థ తెలిపింది. ఇక ఆనంద్ చర్యల వల్లే తమ సినిమా ఇమేజ్ దెబ్బతినిందని, అందుకు నష్టపరిహారంగా 84 కోట్లు ఇవ్వాలి అని ఈరోస్ సంస్థ కోరింది..

ఇకపోతే ఈ సినిమా హక్కులు పూర్తిగా తమవేనని, ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ కేవలం దర్శకుడు మాత్రమేనని ఈరోస్ సంస్థ ఆరోపించింది. మొత్తానికైతే ధనుష్ కొత్త సినిమాకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మరి దీనిపై తేరే ఇష్క్ మే నిర్మాతలు ఇప్పటివరకు స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే వారు ఈ నష్టపరిహారాన్ని చెల్లిస్తారా లేక ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన దర్శకుడు ఆనంద్ ఈ భారాన్ని మోస్తారా అన్న విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది..

రాంఝణా సినిమా వివరాలు

మొత్తానికి ధనుష్ కొత్త సినిమా విడుదల కాకుండానే వివాదాల్లో చిక్కుకుంది. ఈరోస్ సంస్థ ఆరోపణలపై ధనుష్ ఎలా స్పందిస్తారో చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.