
‘కుబేర’ సినిమా ఈ వారం విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తొలిరోజు మంచి వసూళ్లు రాగా, రెండో రోజు వసూళ్లు మరింత పెరిగాయి. ఇంతకీ రెండు రోజులలో ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
Key Points
కుబేర సినిమా రెండో రోజు వసూళ్లు రూ.16 కోట్లు!
రెండు రోజుల్లో మొత్తం వసూళ్లు రూ.31.25 కోట్లు (నెట్)!
ధనుష్, నాగార్జున, రష్మిక నటనకు ప్రశంసలు!
రెండో రోజు వసూళ్ల వివరాలు
ఈ వారం ఓ మాదిరి అంచనాలతో రిలీజైంది ‘కుబేర’. రిలీజ్‌కి ముందు బుకింగ్స్ కూడా అలా అలా అన్నట్లే ఉన్నాయి. ఎప్పుడైతే మార్నింగ్ షో పూర్తయి పాజిటివ్ టాక్ వచ్చిందో మిగతా షోలన్నీ హౌస్‌ఫుల్స్ కావడం మొదలుపెట్టాయి. అలా తొలిరోజు యావరేజ్ వసూళ్లు రాగా.. రెండో రోజు వచ్చేసరికి ఆ నంబర్స్ కాస్త పెరిగాయి. ఇంతకీ రెండు రోజుల కలెక్షన్స్ ఎంత? ఓవర్సీస్‌లో ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
ధనుష్ నటించిన ‘కుబేర’.. ఓ బిచ్చగాడు ఓ మల్టీ మిలియనీర్ మధ్య సాగే థ్రిల్లింగ్ డ్రామా కథతో తీశారు. బిచ్చగాడిగా ధనుష్ విశ్వరూపం చూపిస్తే.. సీబీఐ అధికారిగా నాగ్ ఆకట్టుకున్నాడు. రష్మిక కూడా తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది. దేవిశ్రీ ప్రసాద్ కూడా తనదైన మ్యూజిక్‌తో మార్కులు కొట్టేశాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా తన రూట్ మార్చి హిట్ కొట్టేశాడు.
మొత్తం కలెక్షన్స్ ఎంత?
ఇలా అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘కుబేర’కు తొలిరోజు మన దేశంలో రూ.14 కోట్ల మేర నెట్ వసూళ్లు రాగా.. రెండో రోజు రూ.16 కోట్ల మేర వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా రెండు రోజులకు రూ.31.25 నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. గ్రాస్ రూ.36 కోట్ల మేర ఉండొచ్చని తెలుస్తోంది. ఓవర్సీస్‌లోనూ ప్రస్తుతం 1.4 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటేశాయి. అంటే రూ.15 కోట్ల మేర వచ్చేసినట్లే. మొత్తంగా చూస్తే రూ.50 కోట్ల మార్క్ అయితే దాటేసిందని చెప్పొచ్చు. మరి లాంగ్ రన్‌లో ఈ సినిమాకు ఎంత డబ్బులు వస్తాయో చూడాలి?
ఓవర్సీస్ రెస్పాన్స్
‘కుబేర’ విషయానికొస్తే.. ఆయిల్ రిగ్‌ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.
మొత్తంగా ‘కుబేర’ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ట్రెండ్ కొనసాగితే భవిష్యత్తులో మరింత మంచి వసూళ్లు రావచ్చు.


