
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని పక్కనే కొడుకులు సన్నీ డియోల్, బాబీ డియోల్ కనిపించారు. ఈ వీడియోలో ఎవరో ఏడుస్తూ ఉండటం, సన్నీ వారిని ఓదార్చడం చూడవచ్చు. ధర్మేంద్ర ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Key Points
హాస్పిటల్లో ధర్మేంద్ర చికిత్స పొందుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ధర్మేంద్ర పక్కనే అతని కొడుకులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఉన్నారు.
వీడియోలో ఓ వ్యక్తి ఏడుస్తుండగా, సన్నీ డియోల్ ఆమెను ఓదార్చడం కనిపించింది.
ధర్మేంద్ర మరణంపై వస్తున్న పుకార్లపై సన్నీ డియోల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ధర్మేంద్ర హాస్పిటల్ వీడియో వైరల్
ధర్మేంద్ర హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంచంపై కదల్లేని స్థితిలో ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పక్కనే అతని కొడుకులు, నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్ కూడా ఉన్నారు. ఆ వీడియోలో ఎవరో ఏడుస్తుండటం కూడా చూడొచ్చు.
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో అతని కుటుంబ సభ్యులతోపాటు హాస్పిటల్ సిబ్బంది, ఇతరులు కూడా ఉన్నారు. అయితే అందులో ఎవరో ఏడుస్తుండటం, ఆమెను సన్నీ డియోల్ ఓదార్చడం కూడా చూడొచ్చు.
కుటుంబ సభ్యులతో ధర్మేంద్ర
హాస్పిటల్ బెడ్‌పై ధర్మేంద్ర
అతని చిన్న కొడుకు బాబీ డియోల్ బాధగా కనిపించగా.. పెద్ద సన్నీ డియోల్ ఎవరినో ఓదారుస్తూ కనిపించాడు. వాళ్లతోపాటు ఆ రూమ్ లో ఇంకొంత మంది కూడా ఉన్నారు. ఈ వీడియోను జాలీ క్రిస్టియన్ అనే ఎక్స్ అకౌంట్ షేర్ చేసింది.
ధర్మేంద్ర ఆరోగ్యంపై పుకార్లు, సన్నీ డియోల్ స్పందన
ధర్మేంద్ర చనిపోయాడన్న పుకార్లు
మీడియాపై సన్నీ డియోల్ ఆగ్రహం
ధర్మేంద్ర ఆరోగ్యంపై వైరల్ అయిన వీడియో అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే, మరణంపై వచ్చిన పుకార్లను సన్నీ డియోల్ ఖండించి, కుటుంబం అండగా ఉందని స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి ఆయన కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.


