|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌ లవ్‌ ఎఫైర్స్‌పై ధర్మేంద్ర ట్రోల్‌.. వాళ్ల ముందే ఈ స్టేట్‌మెంట్‌

Published: 11-11-2025, 4:24 AM
సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌ లవ్‌ ఎఫైర్స్‌పై ధర్మేంద్ర ట్రోల్‌.. వాళ్ల ముందే ఈ స్టేట్‌మెంట్‌

బాలీవుడ్‌ దిగ్గజం ధర్మేంద్ర తన ఆరోగ్యంపై వచ్చిన రూమర్లతో వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన తన కుమారులు సన్నీ, బాబీ డియోల్‌ లవ్‌ ఎఫైర్స్‌ గురించి చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అనిల్ శర్మ వెల్లడించిన ఈ ఆసక్తికర విషయాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Key Points

1

ధర్మేంద్ర ఆరోగ్యంపై వచ్చిన పుకార్లను కుటుంబం స్పష్టం చేసింది.

2

సన్నీ, బాబీ డియోల్‌ లవ్‌ ఎఫైర్స్‌పై ధర్మేంద్ర సరదాగా ట్రోల్‌ చేశారు.

4

తన టైంలో హీరోయిన్లు తన వెంటే పడేవారని ధర్మేంద్ర గుర్తుచేసుకున్నారు.

ధర్మేంద్ర ఆరోగ్య రూమర్లు – నిజమెంత?

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు, ఒకప్పటి రొమాంటిక్‌ హీరో ధర్మేంద్ర అనారోగ్యానికి సంబంధించిన రూమర్లు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకి గురి చేశాయి.  ఆయన మరణించినట్టు బాలీవుడ్‌ మీడియా కోడై కూయడంతో అంతా షాక్‌ అయ్యారు. ధర్మేంద్ర ఆరోగ్యంగానే ఉన్నారు, నిలకడగానే ఆయన ఆరోగ్యం ఉందని కూతురు ఈషాతోపాటు కుమారులు సన్నీ, బాబీ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  లెజెండరీ నటుడికి దారుణమైన అవమానం జరిగిందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ధర్మేంద్రకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.  అందులో భాగంగా ధర్మేంద్ర తన కుమారులు సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌ ల ఎఫైర్స్ గురించి చేసిన కామెంట్స్  హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఫిల్మ్‌మేకర్ అనిల్ శర్మ, సిద్ధార్థ్ కనన్‌తో మాట్లాడుతూ, ధర్మేంద్ర గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. షూటింగ్ సమయంలో ధర్మేంద్ర తన కొడుకులను బాగా ఏడిపించేవారని శర్మ చెప్పారు. కొన్నిసార్లు సన్నీ, బాబీ అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చేదట.  ‘అప్నే’ సినిమా సెట్‌లో జరిగిన ఒక సంఘటనను అనిల్ శర్మ గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాలో ధర్మేంద్ర, సన్నీ, బాబీ కలిసి నటించారు. ధర్మేంద్ర తన కొడుకులు అమాయకులని, వారికి హీరోయిన్లు పడరని సరదాగా అన్నారట. కానీ, సన్నీ, బాబీ అక్కడే ఉన్నారని ఆయన గమనించలేదన్నారు.

సన్నీ, బాబీ ఎఫైర్స్‌పై ధర్మేంద్ర ట్రోల్

అనిల్ శర్మ చెప్పిన దాని ప్రకారం, “మేమంతా వ్యానిటీ వ్యాన్‌లో కూర్చున్నాం. ధర్మేంద్ర ‘నా కొడుకులు చాలా అమాయకులు` అని అన్నారు. వాళ్ళు అక్కడే ఉన్నారని ఆయన గమనించలేదు. `వీళ్ళకి ఏ హీరోయిన్‌తోనూ ఎఫైర్ లేదు. నా టైంలో హీరోయిన్లు నా వెంటే పడేవాళ్ళు` అన్నారు. ఇది విని సన్నీ, బాబీ సైలెంట్‌గా బయటకు వెళ్లిపోయారు“ అని తెలిపారు అనిల్‌ శర్మ.

అనిల్ శర్మ  మరో ఆసక్తికర విషయాన్ని షేర్‌ చేసుకున్నారు. “ధర్మేంద్ర మాట్లాడుతూ, ‘వీళ్ళకి అవి అర్థం కాదు. చాలా అమాయకులు. నేను కూడా చాలా అమాయకుడిని’ అని నవ్వారు“  అని చెప్పారు. ఆ  రోజుల్లో ధర్మేంద్ర చాలా  అందంగా ఉండేవారని, ప్రతి హీరోయిన్ ఆయనతో పనిచేయాలనుకునేదని శర్మ చెప్పారు.

అనిల్ శర్మ చెప్పిన ఆసక్తికర విషయాలు

సినిమాల్లోకి రాకముందే ప్రకాష్ కౌర్‌ను పెళ్లి చేసుకున్న ధర్మేంద్ర.. అనితా రాజ్, హేమ మాలిని వంటి హీరోయిన్లతో ఎఫైర్స్ నడిపినట్టు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత హేమ మాలినిని పెళ్లి చేసుకున్నారు. సన్నీ డియోల్ పేరు అమృతా సింగ్, డింపుల్ కపాడియాతో వినిపించింది. కానీ, అతను పూజను పెళ్లి చేసుకున్నాడు. బాబీ డియోల్ పేరు హీరోయిన్‌ నీలంతో వినిపించినా, తాన్యా అహూజాతో పెళ్లయింది. ప్రస్తుతం సన్నీ డియోల్‌ హీరోగా బిజీగా ఉన్నారు. మరోవైపు బాబీ డియోల్‌ విలన్‌గా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ధర్మేంద్ర, సన్నీ, బాబీ డియోల్‌ కుటుంబంపై వచ్చిన ఈ ఆసక్తికరమైన కబుర్లు వారి అభిమానులకు వినోదాన్ని పంచుతున్నాయి. తండ్రి, కొడుకుల మధ్య ఉన్న సరదా బంధాన్ని ఈ సంఘటన చక్కగా తెలియజేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.