|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు బాలుకు షాకింగ్ ట్విస్ట్! పెళ్లైన 15 రోజులకే దారుణ మోసం.. అసలు నిజం బయటపడింది!

Published: 08-06-2026, 6:15 AM
గుండె నిండా గుడి గంటలు బాలుకు షాకింగ్ ట్విస్ట్! పెళ్లైన 15 రోజులకే దారుణ మోసం.. అసలు నిజం బయటపడింది!
  • గుండె నిండా గుడి గంటలు బాలుకు రియల్ లైఫ్ లో తీవ్ర మోసం.
  • పెళ్లి చేసుకున్న భార్య కేవలం 15 రోజులకే వదిలి వెళ్లిపోయింది.
  • భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం బయటపడటంతో విడాకులు.
  • తీవ్ర డిప్రెషన్ తర్వాత “గుడి గంటలు” సీరియల్ తో కొత్త జీవితం.

టాలీవుడ్ ప్రేక్షకులను టీవీ సీరియల్స్ తో అలరిస్తున్న బాలు రియల్ లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాలు వింటే గుండె తరుక్కుపోతుంది. తెరపై నవ్వుతూ కనిపించే ఈ స్టార్ హీరో జీవితంలో జరిగిన షాకింగ్ నిజాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అతని జీవితాన్ని మార్చేసిన ఆ దారుణ సంఘటన ఏంటి?

బాలు రియల్ లైఫ్ లో ఘోర విషాదం!

సీరియల్ హీరో విష్ణు కాంత్ అంటే ఎవరూ పెద్దగా గుర్తించకపోవచ్చు. కానీ, గుండె నిండా గుడి గంటలు బాలు అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు. గుర్తు పట్టడమే కాదు… తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ మాలో ప్రసారమయ్యే అన్నీ సీరియల్స్ కంటే ఈ సీరియల్ ని ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సీరియల్ బాలు కోసమే చేసేవారు చాలా మంది ఉన్నారు. బాలు మాటలు, నటకు విపరీతమైన క్రేజ్ ఉంది. సీరియల్ లో ఎప్పుడూ నవ్వుతూ.. తమ చుట్టూ ఉన్నవారిందరి మీద కౌంటర్లు వేస్తూ… విలన్స్ ని ఏడిపించే బాలు… రియల్ లైఫ్ ట్రాజెడీ కంటే ఏమీ తక్కువ కాదు.

బాలు అలియాస్ విష్ణుకాంత్.. మొదట ఒక సాఫ్టవేర్ ఉద్యోగి. అయితే.. నటన మీద ఆసక్తితో.. ఆ ఉద్యోగాన్ని వదిలేసి.. టీవీ ఇండస్ట్రీ వైపు వచ్చాడు. వీరిది చాలా పేద కుటుంబం.ఇప్పటికీ వీళ్ల తండ్రి చీరలను నేస్తూ ఉంటాడు. నటన మీద ఆసక్తితో మొదట మోడలింగ్ వైపు వచ్చాడు. ఆ తర్వాత సీరియల్, సినిమాల్లో చిన్న చిన్న రూల్స్ చేయడం మొదలు పెట్టాడు. తర్వాత తమిళంలో రెండు, మూడు సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తమిళ సీరియల్ లో నటిస్తున్నప్పుడే.. తనతో నటించిన సంయుక్తతో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత 2023లో పెద్దల అంగీకారంతో చాలా ఘనంగా వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు అప్పట్లో ఫుల్ ట్రెండ్ అయ్యాయి. ఇద్దరి జోడీ చాలా బాగుందని కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే.. పెళ్లి జరిగిన రెండు నెలలకే పెటాకులు అయ్యింది. వీరు పెళ్లి తర్వాత కేవలం 15 రోజులే కలిసి ఉండటం విశేషం.

పెళ్లైన 15 రోజులకే దారుణ మోసం!

విష్ణుకాంత్ ఇంట్లో ఫ్రిజ్, ఏసీ లాంటి సౌఖర్యాలు ఏమీ లేవనే కారణంతో..పెళ్లైన 15 రోజులకే సంయుక్త తన పుట్టింటికి వెళ్లిపోయిందని సమాచారం. అంతేకాదు.. విష్ణుతో పెళ్లికి ముందు నుంచే సంయుక్తకు రవి అనే వ్యక్తితో లవ్ ఎఫైర్ ఉండేది.పెళ్లి తర్వాత కూడా ఆమె దానిని కంటిన్యూ చేశారని.. ఆ విషయం తెలిసి.. విష్ణు ప్రశ్నించడంతో ఇద్దరికీ తేడాలు వచ్చి విడిపోయినట్లు సమాచారం. విడాకుల తర్వాత ఇద్దరూ తమ పెళ్లి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. అయితే.. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో విష్ణు చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. చనిపోదాం అని కూడా అనుకున్నాడట. ఇక తనకు మంచి కెరీర్ కూడా లేదు అని బాధ పడుతున్న సమయంలో తెలుగులో గుండె నిండా గుడి గంటలు ఆఫర్ వచ్చింది.

డిప్రెషన్ నుండి స్టార్ గా ఎలా మారాడు?

ఈ సీరియల్ లో బాలు పాత్రకు విష్ణు సరిగా సూట్ అవ్వడం.. ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో బాలు కెరీర్ మలుపు తిరిగింది. దాదాపు మూడేళ్లుగా విష్ణు ఈ సీరియల్ చేస్తున్నాడు. ఈ సీరియల్ తో పాటు.. ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో యాంకర్ శ్రీముఖితో లవ్ ట్రాక్ కూడా బాగా వర్కౌట్ అవుతోంది. ఒక ఎపిసోడ్ లో శ్రీముఖి కోసం విష్ణు స్వయంగా చీర నేచి తీసుకురావడం విశేషం. వీరిద్దరి జోడిని ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు.

బాలు రియల్ లైఫ్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. కష్టాల తర్వాత కూడా తిరిగి నిలబడగలనని నిరూపించాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.