
📌 Key Points
- బొమ్మల కొలువులో బాలు, మీనాకు సుగుణ అవమానం, మాటలతో దాడి!
- చింటును దత్తత తీసుకోవాలనే ఆలోచనను వ్యతిరేకించిన సుగుణ, సంచలన వ్యాఖ్యలు
- రోహిణి పతనం ఖాయం చేసిన తల్లి శాపం, గుండెలు అదిరేలా పరిణామాలు
- బాలు, మీనా దంపతులపై సుగుణ మాటల దాడి, దిమ్మతిరిగే షాక్!
గుండె నిండా గుడి గంటలు సీరియల్‌లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలు, మీనా దంపతులకు ఊహించని షాక్ తగిలింది. సుగుణ ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి!
బొమ్మల కొలువులో సుగుణ సంచలన వ్యాఖ్యలు!
Gunde Ninda Gudi Gantalu Serial March 3rd Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 3 ఎపిసోడ్‌లో బొమ్మల కొలువుకు వచ్చిన సుగుణను చింటును దత్తత తీసుకుంటామని బాలు, మీనా అడుగుతారు. దానికి నానా మాటలు అంటుంది సుగుణ. అందరిముందు అవమానిస్తుంది. బాలు, మీనాకు బాగా బుద్ధి చెప్పారంటూ కామాక్షి, రవి అంటారు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బొమ్మల కొలువుకు బాలు రమ్మంటున్నాడని రోహిణికి సుగుణ చెబుతుంది. సరే వచ్చేసేయ్, కాకపోతే నేను చెప్పినట్లు చేయి అని రోహిణి ఓ ప్లాన్ చెబుతుంది. సరేనని సుగుణ అంటుంది. మరోవైపు ఎగ్జామ్స్ గురించి, అటెండెన్స్ గురించి ఫ్రెండ్‌తో శివ మాట్లాడుతుంటాడు.
మరోవైపు బొమ్మల కొలువులో బాలు నుంచి ఫోన్ ఎలా తీసుకోవడం గురించి ఆలోచిస్తుంటారు రోహిణి, విద్య. ఇవాళ అందరిముందు బాలు, మీనాకు అవమానం జరుగుతుంది అని రోహిణి అంటుంది. ఇంటికి పెద్ద గెస్ట్ వచ్చారని, బాలకృష్ణ వచ్చాడని బాలు చెబుతాడు. అంతూ చూస్తుంటే చింటు కృష్ణుడి గెటప్‌లో వస్తాడు. రారా బాలకృష్ణ అని బాలు పిలుస్తాడు.
చింటూని చూసి రోహిణి మురిసిపోతుంది. తర్వాత సుగుణ వస్తుంది. చింటూను దగ్గరికి తీసుకోలేనందుకు రోహిణి ఫీల్ అవుతుంది. నీ ఫేస్‌కు అమ్మతనం సూట్ కాదని విద్య అంటుంది. చింటును దత్తత తీసుకుందామని మీనా అంటే.. టైమ్ చూసి అడుగుదామని బాలు అంటాడు. తర్వాత చింటును బాలు పిలిస్తే రోహిణి వెళ్లి ముద్దు చేస్తుంది. హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతుంది.
మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని మీనా అంటుంది. నాకున్నది వీడు ఒక్కడే. వీడికి అమ్మమ్మను ఉన్నాను. కన్నతల్లి బతికే ఉంది అని సుగుణ అంటే.. కొడుకును పారేసి తన సుఖం చూసుకుంటుందా అని సుశీల అంటుంది.
రోహిణి పతనానికి కారణం అదేనా?
మనవాళ్లకు బుద్ధి లేదు. దారిన పోయేవాళ్లను బాగా చూసుకుందామనుకుంటే ఇలాగే అంటారు. మీకేమంతా వయసు అయిపోయిందనిరా ఇంత పెద్ద బాధ్యత తీసుకుందామనుకుంటున్నారు. పెద్దోడు మనోజ్ గాడు ఉన్నాడుగా. వాడు తినడం ఆపి బిడ్డను కనమను అని తిడుతుంది కామాక్షి.
బాలు, మీనాను ఇంటికి రమ్మన్నానా, రాసుకుపూసుకుని తిరిగింది మీరు. ముమ్మాటికి తప్పు మీదే. మాకేమైనా మీది అయ్య చుట్టమా.. అమ్మ చుట్టమా. మీకు అంతలా బిడ్డను పెంచుకోవాలంటే అనాథ ఆశ్రమం నుంచి తెచ్చి పెంచుకోండి అని సుగుణ అంటుంది. ఇదేనా నువ్వు చూడమంది. నీలాగే మీ అమ్మని దిగజార్చావుగా అని రోహిణిని అంటుంది విద్య.
మీనా ఏడుస్తుంటుంది. కావాలంటే వాడి మనసులు ఏముందో అడగండి అని మీనా అంటుంది. దాంతో సుగుణ ఎవరితో ఉండాలని ఉందో చెప్పు అని చింటును అడుగుతుంది. అమ్మతో ఉండాలనిపిస్తుందని చింటు అంటాడు. దాంతో అంతా నోరెళ్లబెడతారు. ఇకనైనా అందరిని పట్టించుకోవడం మానండి అని కామాక్షి అంటుంది. సరే ఇదంతా వదిలేయండి. భోజనం చేసి వెళ్లండి. చింటు ఆకలికి ఆగలేడు కదా అని మీనా అంటుంది.
వాడి ఆకలి చూసుకునేందుకు నువ్వు ఎవరమ్మా అని సుగుణ కోపంగా అంటుంది. వాళ్లను వెళ్లనివ్వు మీనా అని బాలు అంటాడు. దాంతో మీనా ఏడుస్తుంది. బయటకు వచ్చిన సుగుణ తాను చేసినదానికి ఏడుస్తుంది. బాగుందా అంటూ మీనాను అంటుంది ప్రభావతి అంటుంది. చింటు తల్లిని కామాక్షి తిడుతుంది. ఇంకొకసారి ఆవిడ నా ఇంటి ముందు కనిపిస్తే ఊరుకోను అని ప్రభావతి అంటుంది.
చింటు విషయంలో బాలు, మీనా నిర్ణయం!
రోహిణి, సుగుణ ఇద్దరు వాదించుకుంటారు. వాడిని దత్తత ఇవ్వడానికి నీకేం హక్కుందని రోహిణి అంటే.. అసలు నీ కొడుకు అని చెప్పుకోడానికి నీకేం హక్కు ఉంది. కని పడేసి పోయావ్. నీకేం హక్కు ఉంది. చిన్నప్పుడు నీ పెళ్లి చేసి ఒక్క తప్పు చేశాను. నువ్వు వంద తప్పులు చేశావ్. అన్నింటికంటే దరిద్రం కన్నతల్లిని చంపేయడం, నీ పతనం ఎప్పుడో మొదలైంది. ఏదో ఒక రోజు నీ రంగు తెలిసి మళ్లీ మొదటికి వస్తావ్ అని సుగుణ అంటుంది.
శాపం పెడుతున్నావా అని రోహిణి అంటుంది. బాలు మీనాలను అనిపించినందుకు నీకు, అన్నందుకు నాకు ఉసురు తగలకుండా పోదు. ఈ పాపానికి శిక్ష అనుభవించే తీరుతాం అని కోపంగా వెళ్లిపోతుంది సుగుణ. మరోవైపు మీనా బాధపడుతుంటుంది. ఇలా కూడా మాటలు పడొచ్చని తెలిసిందని బాలుతో మీనా అంటుంది. అదంతా రోహిణి వింటుంది.
నాకు తెలిసి చాలా రోజుల వరకు కూతురు మాట వినదు. చూద్దాం అని బాలు అంటాడు. అదంతా విన్న రోహిణి ఏం చేసిన ఈ బాలు మారేలా లేడే అనుకుంటుంది. మరోవైపు గుడికి మౌనికకు ముడుపు కట్టేందుకు వెళ్తారు. మీనా లేదని తెలిసి ప్రభావతి తిడుతుంది. మౌనిక మీనాను మెచ్చుకుంటుంది. అలా గడ్డి పెట్టమని సత్యం అంటాడు.
ఇంతలో ఒకావిడ వచ్చి మీనా చెప్పిందని చెప్పి పూలు ఇచ్చి వెళ్లిపోతుంది. డబ్బు ఇస్తే వద్దని, మీనా తీసుకోవద్దని చెప్పిందని చెబుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాబోయే ఎపిసోడ్‌లలో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


