|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి ఆగస్ట్ 9 ఎపిసోడ్: డివోర్స్ పేపర్స్ చించేసిన క్రాంతి- శాలినితో కలిసి భోజనం- నిజం కనిపెట్టిన శ్రుతి, కామాక్షి

Published: 09-08-2025, 12:17 AM
నిన్ను కోరి ఆగస్ట్ 9 ఎపిసోడ్: డివోర్స్ పేపర్స్ చించేసిన క్రాంతి- శాలినితో కలిసి భోజనం- నిజం కనిపెట్టిన శ్రుతి, కామాక్షి

నిన్ను కోరి సీరియల్ యొక్క ఆగస్ట్ 9వ ఎపిసోడ్ లో అనేక ఉత్కంఠభరిత సంఘటనలు చోటుచేసుకున్నాయి. క్రాంతి తన డివోర్స్ పేపర్స్ చించేయడం, శాలినితో కలిసి భోజనం చేయడం, శ్రుతి మరియు కామాక్షి ఒక ముఖ్యమైన నిజాన్ని కనుగొనడం వంటివి ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు.

Key Points

1

క్రాంతి డివోర్స్ పేపర్స్ చించేసి శాలినితో కలిసి భోజనం చేశాడు.

2

శ్రుతి మరియు కామాక్షి శాలిని దాచి ఉన్న నిజాన్ని కనిపెట్టారు.

4

విరాట్ తన తండ్రితో ఉన్న సమస్యలను ఎదుర్కొంటున్నాడు.

క్రాంతి మరియు శాలిని మధ్య సంఘర్షణ

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బిజినెస్ అంటూ తిరిగితే మా అన్నయ్యను ఎవరు చూసుకుంటారు అని చంద్రకళను అంటుంది కామాక్షి. నువ్ బిజినెస్ చేయడం వీళ్లేదు. ఇంటి కోడలు బయటకు వెళ్లి పరాయి మగాడితో బిజినెస్ చేయడం ఇంటి పరువు తీసినట్లు అవుతుంది అని శ్యామల అంటుంది. నన్ను ఇంటి కోడలిగా ఒప్పుకున్నట్లేనా. అయితే స్టోర్ రూమ్‌లో ఉండక్కర్లేదు అని చంద్రకళ అంటుంది.

బయటి వాళ్ల దృష్టిలో నువ్ ఈ ఇంటి కోడలివి. అలా అన్నాను. నువ్ బయటకెళ్లాక నీకు నచ్చినట్లు ఆడు అని శ్యామల అంటుంది. మీ బ్రెయిన్ పాత డబ్బా ఫోన్ దగ్గరే ఆగిపోయింది. అబ్బాయి, అమ్మాయి స్పేస్‌కు వెళ్తున్న రోజులు. అలాంటిది ఆడది గడప దాటితే పరువు పోతుందని మీరు ఆలోచించడం ఏంటీ. నా భర్త, అత్త ఒప్పుకున్నారు. ఇంకెవరి పర్మిషన్ అవసరం లేదని చంద్రకళ అంటుంది.

తన భవిష్యత్తును అడ్డుకోడానికి మనం ఎవరం అని విరాట్ అంటాడు. పరాయి వాళ్లను ఆశీర్వదించాల్సిన అవసరం లేదని శ్యామల అంటుంది. అక్షింతలు వేస్తేనే దీవించినట్ల కాదు. మనసులో కోరుకున్న చాలు అని చంద్రకళ వెళ్లిపోతుంది. అత్త నీకు చంద్రపై ద్వేషం ఉంది. దానికి కారణం ఉంది. కానీ, ఇలాంటి పనుల వల్ల నిన్ను తక్కువ చేసుకోవద్దు. నీకు ఓ వాల్యూ ఉందని విరాట్ అంటాడు.

తులసి కోటలో అక్షింతలను పై నుంచి వేస్తాడు విరాట్ . కానీ, తులసి కోట దగ్గరికి వెళ్తున్న చంద్రకళపై అక్షింతలు పడతాయి. అది చూసి థ్యాంక్యూ శ్రీవారు అని గాల్లో ముద్దు పెడుతుంది చంద్రకళ. దానికి మురిసిపోతాడు విరాట్. అప్పుడే శ్యామల రావడంతో ఎవరికి వారు వెళ్లిపోతారు. మరోవైపు క్రాంతి గురించి ఆలోచిస్తుంది శాలిని. ఇంతలో కామాక్షి, శ్రుతి వచ్చి చంద్రకళ గురించి చెబుతారు.

చంద్రకళ స్వాతంత్ర్యం కోసం పోరాటం

అన్ని నాకు చెబుతారేంటీ అని శాలిని అరుస్తుంది. నువ్ మారిపోయావ్ అని శ్రుతి అంటే వేరు చేసి మాట్లాడుతున్నావు అని కామాక్షి అంటుంది. వేరే కదా. మీరు నేను ఒకటి కాదు కదా అని శాలిని అంటే.. నువ్వు ఏదో దాస్తున్నావ్ అని కామాక్షి అనుమానిస్తుంది. దాంతో ఏదోటి వాగి వెళ్లిపోతుంది శాలిని. మరోవైపు రఘురాం దగ్గరికి విరాట్ వెళ్తాడు. తండ్రిని చూసి బాధపడుతాడు.

అప్పుడే అక్కడికి వచ్చిన జగదీశ్వరి విరాట్ మాటలు వింటుంది. నువ్ ఇలా అయిపోవడం వల్ల నేను అమ్మ ప్రేమకు దూరమయ్యాను. నీ మాటే ఇంటికి కళ తీసుకొస్తుంది. అమ్మ మాములుగా మాట్లాడుతుంది. నేను అందరి ప్రేమకు దూరమయ్యాను. మన ఇద్దరి పరిస్థితి ఒక్కటే నాన్న. 30 రోజుల్లో నా భవిష్యత్తు తెలుస్తుంది. అమ్మ నన్ను క్షమించడం, చంద్ర ఉండటం, ఉండకపోవడం నీ మాటతోనే తేలుతుంది. త్వరగా కోలుకో నాన్న అని ఏడిపించేస్తాడు విరాట్.

ఆ మాటలు విన్న జగదీశ్వరి , చంద్రకళ ఎమోషనల్ అవుతారు. జగదీశ్వరిని చూసిన విరాట్ అమ్మ అంటే వెళ్లిపోతుంది. వెంటనే విరాట్ చేయి పట్టుకుని లాక్కెళ్లి నేను ఇంట్లోంచి వెళ్లకూడదనేగా ఇలా మావయ్యతో మాట్లాడావు అని విరాట్‌ను దగ్గరికి లాక్కుంటుంది చంద్రకళ. తర్వాత రాత్రి శాలినిపై కోప్పడుతాడు క్రాంతి. నువ్ చేసిన ఇన్సల్ట్ మర్చిపోలేనిది. నీతో కలిసి ఉండలేను. ఇది ఫిక్స్ అని క్రాంతి అంటాడు.

శ్రుతి మరియు కామాక్షి దర్యాప్తు

ఆ మాటలు చంద్రకళ విని షాక్ అవుతుంది. నేను కూడా నిన్ను వదిలి వెళ్లిపోను. నువ్వు కూడా ఫిక్స్ అయిపో అని వెళ్తూ చంద్రకళను చూస్తుంది శాలిని. తర్వాత క్రాంతితో మాట్లాడుతుంది చంద్రకళ. ఒక్క అవకాశం ఇవ్వాలిగా. నా మీద కోపంతో శాలిని చేసింది. ఓ అవకాశం ఇచ్చి చూడు అని చంద్రకళ అంటుంది. సరే నువ్ చెప్పావు కాబట్టి అవకాశం ఇస్తాను అని క్రాంతి అంటాడు.

ఆ డివోర్స్ పేపర్స్ చించేసి భోజనానికి రా అని చంద్రకళ అంటే.. శాలినికి ఇచ్చే డివోర్స్ పేపర్స్‌ను చింపేస్తాడు క్రాంతి. తర్వాత విరాట్‌కు చంద్రకళ భోజనం వడ్డిస్తుంది. క్రాంతి వస్తాడు. శాలినిని క్రాంతి భోజనం వడ్డించమంటాడు. దాంతో శాలిని సంతోషంగా వడ్డిస్తుంది. చూశావా అన్నట్లుగా చంద్రకళతకు సైగ చేస్తుంది శాలిని. ఇద్దరు అన్నదమ్ములు భార్యలతో కలిసి భోజనం చేస్తుంటారు.

ఇంతలో శ్యామల వచ్చి వీళ్లేంటి కలిసి తింటున్నారు అని అనుకుంటుంది. మరోవైపు కొత్త బిజినెస్‌లో చంద్రకు గ్రాండ్ వెల్కమ్ చెబుతాడు అర్జున్. క్రాంతి చింపేసిన డివోర్స్ పేపర్స్ ముక్కలు కలెక్ట్ చేసి అవి విడాకుల నోటీసు అని శ్రుతి, కామాక్షి కనిపెడతారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈ ఎపిసోడ్ లోని సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. క్రాంతి, శాలిని, చంద్రకళ మరియు ఇతరుల జీవితాలలో తదుపరి ఎపిసోడ్ ఏమి తెస్తుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.