|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నైజాం పంపిణీపై ధీరజ్ సంచలన ప్రకటన! చిన్న సినిమాలకూ భారీ లాభాలు సాధ్యమేనా?

Published: 10-02-2026, 5:05 AM
నైజాం పంపిణీపై ధీరజ్ సంచలన ప్రకటన! చిన్న సినిమాలకూ భారీ లాభాలు సాధ్యమేనా?
  • నైజాం ఏరియాలో చిన్న సినిమాలకు కూడా పెద్ద లాభాలు వస్తాయని ధీరజ్ మొగిలినేని అన్నారు.
  • జాతి రత్నాలు సినిమా నైజాం నుంచే 18 కోట్లు వసూలు చేసిందని ఆయన గుర్తు చేశారు.
  • సంతోష్ శోభన్, మానస వారణాసిల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాను ధీరజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
  • నైజాం డిస్ట్రిబ్యూషన్ లైఫ్ టైం సెటిల్మెంట్ అని ధీరజ్ అభిప్రాయపడ్డారు.

పంపిణీదారుడిగా తన కెరీర్ ప్రారంభించి నిర్మాతగా మారిన ధీరజ్ మొగిలినేని, నైజాం డిస్ట్రిబ్యూషన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నైజాంలో చిన్న సినిమాలకు కూడా మంచి లాభాలు వస్తాయని ఆయన అన్నారు. ఆయన ప్రస్తుతం ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాను పంపిణీ చేస్తున్నారు.

నైజాం డిస్ట్రిబ్యూషన్ పై ధీరజ్ మొగిలినేని కామెంట్స్

Dheeraj Mogilineni:ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni).. పంపిణీదారుడిగా కెరియర్ మొదలుపెట్టి నిర్మాతగా మారిన ఈయన ఇటీవల రాహుల్ రవీంద్రనాథ్ దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నిర్మించారు. అలాంటి ఈయన తాజాగా నైజాం ఏరియాలో ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. పైగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాను ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా తొలి సినిమాగా పంపిణీ చేయనున్నారు ధీరజ్. ఈ సందర్భంగా నైజాం డిస్ట్రిబ్యూషన్ పై ఊహించని కామెంట్లు చేసి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ చిన్న సినిమాలకు కూడా పెద్ద లాభం వస్తుందని, అందుకే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మొదలు పెట్టానని చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా ఒక సినిమా విడుదలవుతోంది అంటే ఆ సినిమాపై ఉన్న బజ్ , ప్రమోషన్ కార్యక్రమాలు, కంటెంట్, సినిమాపై అంచనాలను పెంచేస్తాయి. అంతేకాదు ఒక్కొక్కసారి ఇవేవీ లేకపోయినా కేవలం మౌత్ టాక్ తో సంచలనాలు సృష్టించిన చిత్రాలు కూడా లేకపోలేదు. ఇకపోతే మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే నైజాం ఏరియాలో సినిమా లవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ కంటెంట్ బాగుంది అంటే ఆ ప్రాంతంలో కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అక్కడ లాభపడిన డిస్ట్రిబ్యూటర్స్ కి తెలియాలి. ఇప్పటికే బడా నిర్మాతలందరూ కూడా నైజాం ఏరియాలో సినిమాలను పంపిణీ చేస్తూ బాగా లాభపడుతున్నారు. ఈ నేపథ్యంలోని నైజాం డిస్ట్రిబ్యూషన్ పై ధీరజ్ మొగిలినేని కూడా కామెంట్లు చేశారు.

చిన్న సినిమాలతో భారీ వసూళ్లు సాధ్యమా?

తాజాగా ధీరజ్ మొగిలినేని.. సంతోష్ శోభన్, మానస వారణాసి కాంబినేషన్స్ లో వస్తున్న కపుల్ ఫ్రెండ్లీ సినిమాను నైజాం ఏరియాలో తన సొంత డిస్ట్రిబ్యూషన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా ధీరజ్ మాట్లాడుతూ.. నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ అంటే లైఫ్ టైం సెటిల్మెంట్. ఉదాహరణకు ఇక్కడ విడుదలైన జాతి రత్నాలు సినిమా 18 కోట్లు ఒక్క నైజాం నుంచే వసూలు చేసింది. అదే సమయంలో వచ్చిన బేబీ సినిమా కూడా 15 కోట్లు రాబట్టింది. ఇక కోర్టు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా 10 కోట్లు రాబడితే, లిటిల్ హార్ట్స్ ఏకంగా ఏడు కోట్లు వసూలు చేసింది. ఇలా చిన్న సినిమాలే ఇక్కడ ఊహించని కలెక్షన్స్ను రాబడతాయి. ముఖ్యంగా వైజాగ్ , నైజాం ఏరియాలు నాకు తెలిసినంతవరకు సింగిల్ లైఫ్ టైం సెటిల్మెంట్ సత్తా ఉన్న ప్రాంతాలు.. గత పదేళ్లుగా గీత ఆర్ట్స్ వాళ్లు నన్ను ప్రోత్సహిస్తూ అక్కడ సినిమాలు విడుదల చేస్తున్నాము పైగా నా కొత్త డిస్ట్రిబ్యూషన్ సంస్థ పేరు మారిందంటే కానీ ప్రోత్సాహం అక్కడ థియేటర్ లాక్ చేయడం అంత వాళ్లే చూసుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాను విడుదల చేస్తున్న ధీరజ్

కాలం మారుతున్న కొద్ది సమయాన్ని కుదుర్చుకొని మరి ప్రేక్షకులు వినోదం కోసం థియేటర్ కి పరుగులు పెడుతున్నారు. అక్కడ థియేటర్ యాజమాన్యం కూడా ప్రేక్షకుడి సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక అంగులతో ముస్తాబు చేస్తున్నారు. ఇక అందుకే ఈ మార్పు కారణంగానే ప్రజలు సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. అందుకే అక్కడ చిన్న సినిమాలు కూడా కోట్ల రూపాయలు వసూలు చేస్తూ అటు నిర్మాతలకు ఇటు పంపిణీదారులకు భారీ ఆదాయాన్ని అందించి పెడుతున్నాయి.

ఇకపోతే నైజాం ఏరియాలో ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ తో పాటు దిల్ రాజు, ఏషియన్ సునీల్ , అన్నపూర్ణ స్టూడియోస్, ధీరజ్ ఇలా ఎంతోమంది సొంత డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులను ఓపెన్ చేసి సినిమాలను విడుదల చేస్తూ మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు.

నైజాం ఏరియాలో సినిమా పంపిణీ చేయడం ఒక లైఫ్ టైం సెటిల్మెంట్ అని, ఇక్కడ చిన్న సినిమాలకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని ధీరజ్ మొగిలినేని నమ్మకంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఎలాంటి విజయాలు సాధిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.