
📌 Key Points
- బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ సునామీ: రూ. 1200 కోట్ల క్లబ్‌లో వేగంగా చేరిన చిత్రం!
- ‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్: కేవలం 9 రోజుల్లోనే 22.1 మిలియన్ డాలర్ల వసూళ్లు!!
- ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రభంజనం: ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్న వసూళ్లు
- ఫుల్ రన్‌లో మరిన్ని రికార్డులు: ‘ధురంధర్ 2’ సంచలనాలకు సిద్ధం!
‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ దగ్గర ఒక ఊచకోత కోస్తుంది! భారతీయ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంది. బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తొమ్మిది రోజుల్లోనే సంచలనం
Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ సృష్టిస్తున్న సునామీ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా రూ. 1200 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ఇప్పటికే సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ సినిమా, తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి 2’ నెలకొల్పిన ఆల్ టైమ్ రికార్డును ‘ధురంధర్ 2(Dhurandhar 2)’ బ్రేక్ చేసింది.
ఓవర్సీస్‌లో దుమ్మురేపిన ‘ధురంధర్ 2’
ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం చూపిస్తున్న ప్రతాపం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ తన లాంగ్ రన్‌లో 22 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి రికార్డ్స్ నిలిచింది. గడిచిన తొమ్మిదేళ్లలో ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలు విడుదలైనప్పటికీ ఈ రికార్డును చేరుకోవడం ఎవరికీ సాధ్యపడలేదు.
రికార్డుల వేట షురూ!
అయితే, ‘ధురంధర్ 2’ కేవలం 9 రోజుల్లోనే 22.1 మిలియన్ డాలర్ల మార్కును దాటేసి బాహుబలి రికార్డును బ్రేక్ చేసింది. ఒక సినిమా తన లాంగ్ రన్‌లో సాధించిన మైలురాయిని, ధురంధర్ 2 కేవలం పది రోజులు కూడా గడవకముందే అధిగమించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అద్భుతమైన స్పందన చూస్తుంటే, ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సమయానికి మరిన్ని అసాధ్యమైన రికార్డులను సుసాధ్యం చేసేలా కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ‘ధురంధర్ 2’కు వస్తున్న స్పందన చూస్తుంటే మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


