|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దుమ్మురేపిన ‘ధురంధర్ 2’ మూవీ.. ఫస్ట్ రోజే రికార్డుల మోత.. బాక్సాఫీస్ బద్దలు!

Published: 19-03-2026, 8:35 AM
దుమ్మురేపిన 'ధురంధర్ 2' మూవీ.. ఫస్ట్ రోజే రికార్డుల మోత.. బాక్సాఫీస్ బద్దలు!
  • ధురంధర్ 2 మూవీ సాయంత్రం 4 గంటలకే రూ. 45.14 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది – సంచలన రికార్డు!
  • రణ్‌వీర్ సింగ్ మూవీ ప్రీమియర్ల ద్వారా రూ.43 కోట్లు రాబట్టింది – బాక్సాఫీస్ షేకింగ్!
  • మొదటి రోజు 17,000 షోలకు గాను 9.50 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి – ట్రేడ్ వర్గాల అంచనా!
  • ప్రపంచవ్యాప్తంగా ప్రీ-సేల్స్ ద్వారా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు – అన్ని రికార్డులు బద్దలు!

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ మూవీ విడుదలైన రోజునే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాలు చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. అభిమానులకి పండగే పండగ!

ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ

ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ sacnilk.com ప్రకారం, ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన  ధురంధర్‌ 2 మూవీ మొదటి రోజు సాయంత్రం 4 గంటలకే రూ.45.14 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 2026లో వచ్చిన హిందీ సినిమాల్లో ఇదే అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. సన్నీ డియోల్ ‘బార్డర్ 2’ రికార్డును ఇది బ్రేక్ చేసింది.

సన్నీ డియోల్ నటించిన ‘బార్డర్ 2’ సినిమా 2026 జనవరి 23న రిలీజైంది. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి రోజు సుమారు రూ.30 కోట్లు సంపాదించింది. కానీ ‘దురంధర్‌ 2` సినిమా మధ్యాహ్నం 3 గంటలకే ఈ మార్క్‌ను దాటేసింది. ఫైనల్ లెక్కలు వచ్చేసరికి ‘బార్డర్ 2’ కంటే రెట్టింపు వసూళ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రీమియర్ల ద్వారా భారీ వసూళ్లు

ఈ స్పై యాక్షన్ డ్రామా `ధురంధర్‌ 2` మార్చి 19 సాయంత్రం 4 గంటల వరకు భారతదేశంలో రూ.88.14 కోట్లు వసూలు చేసింది. ఓపెనింగ్ డేకి ముందు, మార్చి 18న పెయిడ్ ప్రీమియర్లు వేశారు. ఈ ప్రీమియర్ల కోసం 12,292 షోలు కేటాయించగా, వాటి ద్వారా సినిమాకు దాదాపు రూ.43 కోట్లు వచ్చాయి.

అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికొస్తే, ‘ధురంధర్‌ : ది రివెంజ్’ బ్లాక్ సీట్లతో కలిపి దాదాపు రూ.40.30 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు కోసం 17,000 కంటే ఎక్కువ షోలకు గాను 9.50 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత

ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్ వంటి స్టార్లు నటించిన ధురంధర్‌ః ది రివెంజ్’ సినిమా ప్రీ-సేల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది మొదటి వారాంతానికి సంబంధించిన లెక్క. ఇందులో ఒక్క ఓవర్సీస్ మార్కెట్ నుంచే రూ.80 కోట్లు రావడం విశేషం. మొత్తంగా ఈ మూవీ మొదటి రోజు వసూళ్లలో అన్ని ఇండియన్‌ మూవీస్‌ రికార్డులను బ్రేక్‌ చేయబోతుందని అంటున్నారు. మరి ఎంత వరకు రాబడుతుందో చూడాలి.

దురంధర్ 2 మూవీ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి రోజు రికార్డులు బద్దలు కొట్టి సంచలనం రేపింది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.