
📌 Key Points
- ‘ధురంధర్ 2’ సినిమాలో డిమానిటైజేషన్ వెనుక ఉన్న కుట్రలను ఆవిష్కరించారు.
- పాకిస్తాన్ నుండి రూ. 11 వేల కోట్ల నకిలీ కరెన్సీ భారత్‌కు చేరిందని సినిమాలో చూపించారు.
- రూ. 60 వేల కోట్ల నకిలీ కరెన్సీతో రాజకీయాల్లో చిచ్చు పెట్టాలని పాక్ కుట్ర పన్నింది.
- దేశ భద్రత కోసం మోదీ తీసుకున్న నిర్ణయాలను సినిమాలో హైలైట్ చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ డిమానిటైజేషన్ ప్రకటన వెనుక ఉన్న అసలు కథను ‘ధురంధర్ 2’ మూవీ ద్వారా తెలుసుకోవచ్చు. పాకిస్తాన్ కుట్రలను అరికట్టేందుకు మోదీ తీసుకున్న నిర్ణయాలను ఈ సినిమాలో చూపించారు.
డిమానిటైజేషన్ వెనుక కుట్ర కోణం
Dhurandhar 2: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) డిమానిటైజేషన్ ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సడెన్‌గా రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లు ఇకపై చెల్లవని ఆయన ప్రకటించిన తర్వాత, అసలు అలా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అని అంతా చర్చలు నడిపారు. టీవీలలో డిబెట్స్ నడిచాయి. జనాలు ఆ నోట్లను మార్చుకునేందుకు రోడ్లపైకి వచ్చారు. బ్యాంకులన్నీ కిక్కిరిపోయాయి. చాలా మంది మోదీని తిట్టుకున్నారు కూడా. ఏం పని లేక ఇలాంటివన్నీ పుట్టిస్తుంటారు? అంటూ మోదీ అండ్ ప్రభుత్వంపై కొంతమంది విరుచుకుపడ్డారు. కానీ, మోదీ ఈ ప్రకటన వెనుక చాలా పెద్ద కథ ఉందనే విషయం ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) మూవీ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో మోదీ డిమానిటైజేషన్ (Demonetization) ప్రకటన సీన్ చూస్తే.. ఓయమ్మ.. ఇంత కథ ఉందా? అని అంతా ఆశ్చర్యపోతారు.
పాకిస్తాన్ నకిలీ కరెన్సీ ప్లాన్
‘ధురంధర్ 2’లో పాకిస్తాన్ వంటి దేశాల నుండి వస్తున్న నకిలీ భారత కరెన్సీని అరికట్టడం కోసం, అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా ఇందులో చూపించారు. అప్పటికే పాకిస్తాన్ నుంచి 11 వేల కోట్ల నకిలీ కరెన్సీ భారత్‌కు చేరిందని, ఇంకా రూ. 60 వేల కోట్ల కరెన్సీని పంపించి, ఇక్కడ రాజకీయాల్లో చిచ్చు పెట్టాలని పాకిస్తాన్ వేసిన కుట్రను దెబ్బకొట్టే క్రమంలో సైన్యం హెచ్చరికతో మోదీ ఈ డిమానిటైజేషన్ ప్రకటన చేసినట్లుగా చూపించారు. మోదీ అలా ప్రకటించగానే పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు ఎంతగా తలలు బాదుకున్నారనేది తెరపై చూపిస్తుంటే.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రతి ఒక్క భారతీయుడికి అనిపిస్తుంది. అంతగా ఆ సన్నివేశాలను దర్శకుడు ఆదిత్య ధర్ రక్తి కట్టించాడు. ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియడం మంచిదే కానీ, అదే సమయంలో శత్రు దేశం కూడా మన ప్లాన్స్‌ని గమనిస్తుందని.. ఇలాంటి సినిమాలు తీసేవాళ్లు జాగ్రత్తలు వహించాలి.
‘ధురంధర్ 2’లో ఆసక్తికర విషయాలు
డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ సినిమాలో డిమానిటైజేషన్ వెనుక ఉన్న ఎకనామిక్ వార్‌ఫేర్ కోణాన్ని చాలా పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించారు. సాధారణంగా మనం నోట్ల రద్దు అంటే సామాన్యులు పడ్డ ఇబ్బందులనే చూశాం కానీ, దేశ భద్రత దృష్ట్యా తెర వెనుక జరిగిన హై-స్టేక్స్ డ్రామాను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించింది. శత్రు దేశం మన ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడానికి సిద్ధం చేసిన రూ. 60 వేల కోట్ల నకిలీ కరెన్సీ ప్లాన్‌ను, ఒకే ఒక్క ప్రకటనతో మోదీ ఎలా చెక్ పెట్టారో చూపించిన తీరు ప్రేక్షకుల్లో దేశభక్తిని ఉరకలెత్తిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాద నెట్‌వర్క్ ఒక్కసారిగా నిర్వీర్యం అయిపోయి, వాళ్లు తలలు బాదుకునే సీన్స్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉన్నాయి. వాస్తవానికి అప్పట్లో నకిలీ నోట్ల నియంత్రణకు చాలా కారణాలు వినిపించాయి కానీ, ఇది అసలు కథ అని ‘ధురంధర్ 2’ ఒక స్పై థ్రిల్లర్ రేంజ్‌లో ప్రెజెంట్ చేయడం విశేషం.
‘ధురంధర్ 2’ సినిమా డిమానిటైజేషన్ వెనుక దాగి ఉన్న దేశ భద్రతాపరమైన కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఆర్థిక యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.


