
📌 Key Points
- ‘ధురంధర్ 2’ సినిమాను స్క్రిప్ట్ లేకుండానే షూటింగ్ స్పాట్‌లోనే డైలాగ్స్ రాసుకొని తెరకెక్కించారు.
- ఈ సినిమాకు రూ.255 కోట్లు బడ్జెట్ కాగా, ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది.
- దర్శకుడు ఆదిత్య ధర్ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను స్వయంగా చిత్రీకరించారు.
- సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది.
బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘ధురంధర్ 2’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమాను స్క్రిప్ట్ లేకుండానే తెరకెక్కించారట. షూటింగ్ సమయంలోనే డైలాగులు రాశారని దర్శకుడు తెలిపారు.
స్క్రిప్ట్ లేకుండానే సినిమా షూటింగ్
Dhurandhar 2: బాలీవుడ్‌లో అలానే మొత్తం సినిమా అయిందా ప్రస్తుతం టాక్ అఫ్ ది టౌన్ అయిన సినిమా ధురంధర్: ది రివెంజ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తాజాగా వెల్లడించారు.
ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే..ముందుగా పూర్తి స్క్రిప్ట్ లేకుండానే ఎక్కువ భాగం తెరకెక్కించబడిందంట. స్వయంగా దర్శకుడు ఈ మాటలు చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. షూటింగ్ సమయంలోనే సన్నివేశాలు అభివృద్ధి చెందుతూ, చిన్న చిన్న మాంటేజ్‌లు పెద్ద సీన్లుగా మారిపోయాయి. అందువల్ల సినిమా లెంగ్త్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువైంది అని తెలిపారు దర్శకుడు.
ఆదిత్య ధర్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము..” ధురంధర్ 1.. ధురంధర్ 2 కలిపి మొత్తం బడ్జెట్ సుమారు రూ.255 కోట్లు మాత్రమే అయింది. ఈ భారీ ఖర్చుతో సినిమా విజువల్స్, కథనం ఆకట్టుకునేలా తీశాము. ఈ సినిమా ఎక్కువగా భారీ VFX లేదా విదేశీ లొకేషన్లపై ఆధారపడకుండా తెరకెక్కించబడింది,” అని చెప్పుకొచ్చారు
‘ధురంధర్ 2’ వసూళ్ల రికార్డు
సినిమాలో మరో ముఖ్యమైన అంశం డైలాగ్స్. చాలావరకు డైలాగ్స్ షూటింగ్ సమయంలోనే ఇంప్రోవైజ్ చేయబడ్డాయి అని తెలిపారు డైరెక్టర్. “అదే రోజు ఫైనల్ చేసిన డైలాగ్స్ సినిమాలో సహజత్వాన్ని పెంచాయి. ఇది ప్రేక్షకులకు మరింత నిజమైన అనుభూతిని ఇచ్చింది,”అని చెప్పకొచ్చారు
ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, సినిమాలోని కొన్ని ముఖ్యమైన సీన్స్‌ను దర్శకుడు స్వయంగా షూట్ చేశారంట. ఆయన తీసుకున్న కష్టం.. పాటించిన పట్టుదల సినిమా నాణ్యతలో స్పష్టంగా కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
దర్శకుడి ఆసక్తికర విషయాలు
సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. చాలా మంది ప్రేక్షకులు కథనం, నటన, డైరెక్షన్‌ను ప్రశంసిస్తున్నారు. ట్రేడ్ వర్గాల ప్రకారం, ధురంధర్ 2 ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు అందరి దృష్టి ఆదిత్య ధర్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఉంది. కొంతమంది సినీ విశేషకులు.. ఆయన కొంత విరామం తీసుకుని తదుపరి సినిమాను ప్లాన్ చేసేలా ఉన్నారు అని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ దర్శకుడు తన తదుపరి సినిమా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి అంతే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.
‘ధురంధర్ 2’ సక్సెస్ టాక్ నడుస్తోంది. ఆదిత్య ధర్ తదుపరి ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆయన త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.


