
📌 Key Points
- రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు – ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.
- ఇదివరకే ఒక కుమార్తె ఉండగా, ఇప్పుడు కవలలు పుట్టడంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
- రామ్ చరణ్ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
- మహిళలే తమ బలమని చరణ్ పేర్కొనడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి జన్మించడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. రామ్ చరణ్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
మెగా ఇంట కవల పిల్లల సందడి
Ramcharan: మెగా ఇంట్లో రెట్టింపు ఆనందం నెలకొన్న సంగతి తెలిసిందే. 2026వ సంవత్సరంలో మెగా వారసుడు అడుగుపెట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు గత రాత్రి కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఇదివరకే ఒక కుమార్తె ఉన్నారు అయితే రెండోసారి ఈమెకు మరొక కుమార్తె కొడుకు జన్మించడంతో అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఎంతో మంది సినీ సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు అభినందనలు తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి సైతం తన సంతోషాన్ని వ్యక్త పరుస్తూ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా మీడియా ముందుకు వచ్చి ఉపాసన పిల్లలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని, ఆ హనుమాన్ ఆశీస్సులతో మా ఇంట శుభం జరిగింది అంటూ తన సంతోషాన్ని తెలియజేశారు. గత కొంతకాలంగా మీరు కోరుకుంటున్న ఆ శుభ ఘడియలు వచ్చాయని ఈయన వారసుడి రాకపై సంతోషాన్ని వ్యక్తపరిచారు. కవల పిల్లలు ముందుగా అబ్బాయి జన్మించాడని కొన్ని నిమిషాలకు అమ్మాయి జన్మించిందని చిరంజీవి తెలిపారు.
సంతోషం వ్యక్తం చేసిన రామ్ చరణ్
ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం కవల పిల్లలు జన్మించడం గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఉపాసన బేబీ బంప్ తో ఉన్న ఫోటోని రామచరణ్(Ramcharan) షేర్ చేస్తూ.. “మాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించిన విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మాకు ఇప్పుడు ఇద్దరు కూతుర్లతో పాటు ఒక మగ బిడ్డ పుట్టడం సంతోషంగా ఉందని మా జీవితంలో మహిళలే మాకు బలం. ఈ ప్రయాణంలో ప్రతిక్షణం మాకు అండగా నిలిచి మాకు మద్దతు తెలిపిన అభిమానులందరికీ అలాగే కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంటూ చరణ్ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.
వైరల్ అవుతున్న చరణ్ పోస్ట్
ప్రస్తుతం చరణ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్టులో భాగంగా మహిళలే మాకు బలం అంటూ చరణ్ చెప్పడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక చరణ్ రామ్ చరణ్ దంపతులకు 2023వ సంవత్సరంలో క్లీన్ కారా జన్మించిన సంగతి తెలిసిందే. మొదటి సంతానంలో కూతురు కావడంతో రెండో సంతానంలో కొడుకు పుట్టాలని అభిమానులు అందరూ భావించారు కానీ ఈసారి ఏకంగా మరొక కూతురు కొడుకు జన్మించడంతో మెగా అభిమానుల ఆనందం కూడా రెట్టింపు అయింది. ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్ లో ఉన్న నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని సంబరాలు చేసుకుంటుంటారు.
మొత్తానికి రామ్ చరణ్ దంపతులకు కవలలు జన్మించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. చరణ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


