|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ గురించి జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు! అసలు విషయం ఏమిటంటే…

Published: 13-02-2026, 10:35 AM
ప్రభాస్ గురించి జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు! అసలు విషయం ఏమిటంటే...
  • ప్రభాస్ మంచితనం గురించి జగపతి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు.
  • ప్రభాస్ వ్యక్తిత్వం చాలా గొప్పదని కొనియాడిన జగపతి బాబు.
  • వివాదాలకు దూరంగా ఉండే ప్రభాస్ గురించి ప్రత్యేక ప్రస్తావన.
  • సలార్ సినిమాలో జగపతి బాబు, ప్రభాస్ కలిసి నటించారు.

జగపతి బాబు ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఒక వ్యక్తిగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదని, అతని వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుందని జగపతి బాబు అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ గురించి జగపతి బాబు ఏమన్నారంటే?

Jagapathi Babu: జగపతిబాబు ఒకానొక సమయంలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హీరోగా ఎన్నో ఫ్యామిలీ సినిమాలలో నటించి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సొంతం చేసుకున్న జగపతిబాబు (Jagapathi Babu)ఊహించిన విధంగా తన సెకండ్ ఇన్నింగ్స్ విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లెజెండ్ సినిమాలో విలన్ గా తన అద్భుతమైన నటనను కనబరిచిన జగపతిబాబు తదుపరి సినిమాలన్నీ కూడా విలన్ పాత్రలోనే నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే పెద్ది సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు సినిమాల గురించి అలాగే ఆయన పని చేసిన హీరోల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ (Prabhas)గురించి జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ప్రభాస్ మంచితనం గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఆయన మంచితనాన్ని బయటపెట్టారు. ఇక జగపతిబాబు కూడా ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ సినిమాల పరంగా సక్సెస్ సాధించారా? లేదా అనేది పక్కన పెడితే ఒక మనిషిగా ఆయన ఎప్పుడూ సక్సెస్ అంటూ మాట్లాడారు. ప్రభాస్ మనిషిగా ఫెయిల్యూర్ అవ్వడని జగపతిబాబు తెలియజేశారు. ప్రభాస్ వ్యవహారి శైలి చాలా పెద్దమనిషి లాగా ఉంటుందని తెలిపారు.

ప్రభాస్ మంచితనం గురించి సెలబ్రిటీల ప్రశంసలు

ఇలా మనుషులుగా సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వారిలో ప్రభాస్ ఒకరు అలాగే రామ్ గోపాల్ వర్మ కూడా ఈ కోవకే చెందిన వారిని తెలిపారు .వీరితోపాటు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా మనిషిగా ఫెయిల్యూర్ అవ్వడని జగపతిబాబు ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు పెద్ద ఎత్తున పలు వివాదాలలో నిలుస్తుంటారు కానీ ప్రభాస్ మాత్రమే ఇప్పటివరకు ఎలాంటి వివాదాలలో నిలవలేదు ఆయన గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వచ్చిన కూడా పెద్దగా పట్టించుకోరు. సోషల్ మీడియాకి కూడా ప్రభాస్ ఎంతో దూరంగా ఉంటారు.

ఇలా వివాదాలకు దూరంగా తన సినిమా పనులను చేసుకుంటూ కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ప్రభాస్ జగపతి బాబు కాంబినేషన్లో సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగంలో వీరిద్దరి మధ్య పెద్దగా సన్నివేశాలు లేకపోయినా సీక్వెల్ సినిమాలో ప్రభాస్ జగపతిబాబు మధ్య భారీ స్థాయిలో సీన్లు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇక జగపతిబాబు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమాల్లో కూడా అప్పలసూరి అనే పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వివాదాలకు దూరంగా ప్రభాస్ కెరీర్

జగపతి బాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.