|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ధురంధర్ 2’ సక్సెస్‌లో దీపికా సైలెన్స్ వెనుక అసలు కారణమిదేనా? రణ్‌వీర్‌తో గ్యాప్ నిజమేనా?

Published: 21-03-2026, 2:35 AM
‘ధురంధర్ 2’ సక్సెస్‌లో దీపికా సైలెన్స్ వెనుక అసలు కారణమిదేనా? రణ్‌వీర్‌తో గ్యాప్ నిజమేనా?
  • ‘ధురంధర్ 2’ మొదటి రోజు రూ. 200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
  • రణ్‌వీర్‌ను చాలా మంది మెచ్చుకుంటున్నా, దీపికా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
  • సినిమా పొలిటికల్ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉండటం వల్లే దీపికా సైలెన్స్ వహిస్తోందని కొందరు అంటున్నారు.
  • దీపికా, రణ్‌వీర్ మధ్య గ్యాప్ ఉందా అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

‘ధురంధర్ 2’ సక్సెస్ అయినప్పటికీ, దీపికా పదుకొణె స్పందించకపోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సినిమా పొలిటికల్ ఐడియాలజీకి సపోర్ట్ చేస్తుండటంతోనే ఆమె సైలెన్స్ వహిస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు.

‘ధురంధర్ 2’ సక్సెస్‌లో దీపికా సైలెన్స్

Dhurandhar vs Deepika: ప్రస్తుతం సోషల్ మీడియా టైమ్‌లైన్ మొత్తం ఒక్కటే పేరుతో షేక్ అయిపోతోంది.. అదే ‘ధురంధర్ 2’ . గతేడాది పార్ట్-1తో రూ. 1300 కోట్ల వసూళ్లు రాబట్టి అందరి మైండ్ బ్లాక్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు సీక్వెల్‌తో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రికార్డులను సెట్ చేస్తోంది. తొలిరోజే ఏకంగా రూ. 200 కోట్లతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే ‘ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్’ ట్యాగ్ వైపు దూసుకుపోతోంది. కానీ, ఇంతటి భారీ సక్సెస్ సెలబ్రేషన్స్ మధ్య ఒక విషయం మాత్రం నెటిజన్లకి ‘సమ్ థింగ్ ఫిషీ’ అనిపిస్తోంది. అదే రణవీర్ సింగ్ బెటర్ హాఫ్, క్వీన్ దీపికా పదుకొణే మెయింటైన్ చేస్తున్న డెడ్లీ సైలెన్స్!

సినిమాలో రణవీర్ విషయానికి వస్తే.. దర్శకుడు ఆదిత్య ధర్ క్రియేట్ చేసిన ‘జస్కీరత్ సింగ్ రంగి’ అలియాస్ ‘హంజా అలీ మజారి’ క్యారెక్టర్‌లో రణవీర్ జీవించేశాడు. ఆ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, ఆ ఇంటెన్స్ లుక్స్ చూస్తుంటే “హి అండర్ అండ్‌స్టడ్ ద అసైన్మెంట్” అని చెప్పక తప్పదు.ఇక  టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకు అందరూ సోషల్ మీడియాలో రణవీర్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు కూడా .

నెటిజన్ల అనుమానాలు, విశ్లేషణలు

కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది.. ఇంతమంది విష్ చేస్తున్నా, సొంత భార్య దీపికా నుంచి మాత్రం కనీసం ఒక్క ఇన్స్టా స్టోరీ కూడా లేకపోవడం ఇప్పుడు బాలీవుడ్ లో ‘హాట్ టాపిక్’ అయిపోయింది. దీపికా ఎందుకు స్పందించడం లేదనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల థియరీస్ నడుస్తున్నాయి. ‘ధురంధర్’ సినిమాను ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ‘ప్రాపగండా ఫిలిం’ అని పిలుస్తున్నారు. ఇది ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి (BJP) సపోర్ట్ చేసేలా ఉందనే విమర్శలు ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, దీపికా గతంలో జేఎన్‌యు (JNU) ఇష్యూలో తన స్టాండ్ ఏంటో క్లియర్ గా చెప్పింది. సో, ఈ సినిమా థీమ్ తన పొలిటికల్ ఐడియాలజీకి ఆపోజిట్‌గా ఉండటమే ఈ సైలెన్స్‌కి కారణమా? అనే చర్చ గట్టిగా నడుస్తోంది.

మరోవైపు “షీ ఈజ్ టూ బిజీ విత్ హర్ ఓన్ కింగ్డమ్” అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం పార్ట్-1 కి స్టోరీ లెవల్లో ఇన్వాల్వ్ అయిన దీపికా, పార్ట్-2 విషయంలో ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోందని ఆశ్చర్యపోతున్నారు. నెటిజన్లు ఊరుకుంటారా? “వీరిద్దరి మధ్య అంతా ఓకేనా?” అంటూ అప్పుడే గాసిప్స్ మొదలుపెట్టేశారు. రణవీర్ సక్సెస్‌ని ఎంజాయ్ చేయలేనంతగా వీరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అని కౌంటర్ క్వశ్చన్లు వేస్తున్నారు. ట్విట్టర్ (X) లో అయితే మీమ్స్ మామూలుగా లేవు. “అందరూ విష్ చేశారు కానీ దీపికా మాత్రం ఇంకా నిద్రపోతోందా?” అని కొందరు, “షీ డోంట్ కేర్ అబౌట్ ప్రాపగండా” అని ఇంకొందరు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఏదేమైనా, బాక్సాఫీస్ దగ్గర రణవీర్ తడాకా చూపిస్తుంటే, దీపికా మౌనం మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఈ సైలెన్స్ వెనుక ఉన్న అసలు మ్యాటర్ తెలియాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే!

దీపికా స్పందించకపోవడానికి కారణాలేంటి?

మొత్తానికి, దీపికా సైలెన్స్ వెనుక అసలు కారణం ఏమిటనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ విషయంపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.