|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దురంధర్ 2 విధ్వంసం: రెండు రోజుల్లోనే షాకింగ్ కలెక్షన్స్! రికార్డులు బద్దలు!

Published: 20-03-2026, 11:35 PM
దురంధర్ 2 విధ్వంసం: రెండు రోజుల్లోనే షాకింగ్ కలెక్షన్స్! రికార్డులు బద్దలు!
  • దురంధర్ 2: మొదటి రోజు రూ. 172 కోట్ల గ్రాస్ వసూళ్లు – రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్!
  • హిందీలో మొదటి రోజు రూ. 100 కోట్లు, తెలుగులో హిందీ వెర్షన్ ద్వారా రూ. 3 కోట్ల వసూళ్లు!
  • రెండో రోజు కూడా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ – దూసుకుపోతున్న రణవీర్ సింగ్ సినిమా.
  • తెలుగులో మార్చి 21న విడుదల – కలెక్షన్ల సునామీ ఖాయం!

రణవీర్ సింగ్ నటించిన దురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్తో దుమ్మురేపింది. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.

దురంధర్ 2 మొదటి రోజు కలెక్షన్ల సునామీ!

Dhurandhar 2 Collections : రణవీర్ సింగ్ దురంధర్ కు సీక్వెల్ గా ‘దురంధర్ ది రివెంజ్’ మార్చ్ 19న రిలీజ్ అయింది. ఫస్ట్ పార్ట్ 1300 కోట్లు వసూలు చేసి భారీ హిట్ అయింది. ఈ సీక్వెల్ పై జనాల్లో ఫుల్ హైప్ ఉండటంతో పార్ట్ 2కి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. ప్రీమియర్స్ నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ తో దురంధర్ 2 దూసుకుపోతుంది.

దేశవ్యాప్తంగా ధురంధర్ 2 సినిమాని చూడటానికి ప్రేక్షకులు, సెలబ్రిటీలు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. బాలీవుడ్ సమాచారం ప్రకారం ధురంధర్ 2 సినిమా ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి దాదాపు 172 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. కేవలం ప్రీమియర్స్ నుంచే 43 కోట్లకు పైగా గ్రాస్ దేశవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. హిందీలోనే ఫస్ట్ డే ఈ సినిమా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయగా తెలుగులో దాదాపు 3 కోట్ల వరకు కేవలం హిందీ లాంగ్వేజ్ తోనే కలెక్ట్ చేసింది.

హిందీలోనే వంద కోట్లు – తెలుగులోనూ రికార్డులు!

ఇక రెండో రోజు దేశవ్యాప్తంగా ధురంధర్ సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. కేవలం హిందీలోనే 80 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, రెస్ట్ ఆఫ్ ఇండియా 20 కోట్లు వసూలు చేసిందని సమాచారం. మొత్తంగా రెండు రోజుల్లో ధురంధర్ 2 సినిమా దాదాపు 270 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

ముందు పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు రావడంతో కేవలం హిందీలోనే రిలీజ్ చేసారు. అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమాకు భారీగానే బుకింగ్స్ అయ్యాయి. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమా ప్రీమియర్స్ నుంచే పడి ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగేవి. తెలుగు భాషలో నేడు మార్చ్ 21 నుంచి ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి కలెక్షన్స్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉన్నాయి. ఇంకో రెండు రోజులు వీకెండ్ సెలవులు ఉండటంతో అన్ని చోట్ల బుకింగ్స్ భారీగా అవుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని మించి 1500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

వీకెండ్ లో దురంధర్ 2 కలెక్షన్లు మరింత జోరు!

గమనిక : ఈ కలెక్షన్స్ సమాచారం పలు బాలీవుడ్ వెబ్ సైట్స్, బాలీవుడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తీసుకున్నది.

దురంధర్ 2 కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.