|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రికార్డులు బద్దలు కొడుతున్న ధురంధర్: 1000 కోట్లు దాటినా తగ్గని ప్రభంజనం!

Published: 29-12-2025, 8:39 AM
రికార్డులు బద్దలు కొడుతున్న ధురంధర్: 1000 కోట్లు దాటినా తగ్గని ప్రభంజనం!
  • రణ్ వీర్ సింగ్ ‘ధురంధర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు.
  • కేవలం 25 రోజుల్లో రూ.1100.23 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం.
  • ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన A రేటెడ్ చిత్రంగా ‘యానిమల్’ రికార్డు బద్దలు.
  • నెట్‌ఫ్లిక్స్ రూ.285 కోట్లకు ఓటీటీ హక్కులు, ‘పుష్ప 2’ రికార్డును బ్రేక్.

రణ్ వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వెయ్యి కోట్ల మార్క్ దాటినా దూకుడు తగ్గకుండా, 25 రోజుల్లో రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాకుండా, ఓటీటీ హక్కుల విషయంలోనూ ‘పుష్ప 2’ రికార్డును బద్దలు కొట్టి సంచలనం రేపింది.

బాక్సాఫీస్ వద్ద ధురంధర్ దూకుడు: రూ.1000 కోట్లు దాటినా ఆగని ప్రభంజనం

Dhurandhar Collections : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్యథర్ దర్శకత్వంలో ప్రముఖ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ధురంధర్. మొదటి రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ ఊహించని రికార్డులను క్రియేట్ చేస్తూ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన మూడు వారాల్లోనే ఏకంగా 1000 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా.. అంతటా హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మొదటి రోజు నుంచి ఈ చిత్రానికి హిట్ టాక్ రావడమే కాకుండా అటు హిందీలో విడుదలైనా.. ఇటు సౌత్ లో కూడా భారీ వసూలు రాబడుతూ సంచలనం సృష్టిస్తోంది.

భాషతో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ ఆకట్టుకుంటున్న ఈ సినిమా 1000 కోట్లు దాటినా దూకుడు మాత్రం తగ్గలేదు. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 25 రోజుల్లోనే ఏకంగా రూ.1100.23 కోట్లు రాబట్టి మరో సంచలనం క్రియేట్ చేసింది. ఈ సినిమా ఏది ఏమైనా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేస్తున్న చిత్రంగా నిలవడమే కాకుండా రికార్డుల వేటలో పడింది. 21 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 1000కోట్ల మార్కును దాటిన వేగవంతమైన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఇండియాలో అత్యధిక వసూళ్ల సాధించిన A రేటెడ్ చిత్రంగా యానిమల్ రికార్డును కూడా బ్రేక్ చేసింది. అంతేకాదు దేశీయంగా సుమారు 700 కోట్ల నెట్ కలెక్షన్స్ తో ఈ ఏడాదిలోని బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.

రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న ధురంధర్ చిత్రం

ఇకపోతే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతూ ప్రభంజనం సృష్టిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీ డిజిటల్ దునియాలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కనీవిని ఎరుగని రేంజ్ లో ధర చెల్లించి హక్కులు సొంతం చేసుకున్నట్లు సమాచారం. గతంలో పుష్ప2 డిజిటల్ హక్కులను రూ.275 కోట్లకు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు ధురంధర్ సినిమా హక్కులకు ఏకంగా రూ.285 కోట్లు వెచ్చించింది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయంలో కూడా పుష్ప2 రికార్డును బ్రేక్ చేసిందని చెప్పవచ్చు.

ఓటీటీలోనూ పుష్ప2 రికార్డు బ్రేక్ చేసిన ధురంధర్

ఇందులో సారా అర్జున్ కీలక పాత్ర పోషించగా.. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్.మాధవన్ ,రాకేష్ బేడి , మానవ్ గోహ్లీ , ఆయేషా ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే ఈ చిత్రానికి శశ్వత్ సత్యదేవ్ సంగీతాన్ని అందించగా.. శివకుమార్ ఎడిటర్ గా పనిచేశారు. జ్యోతి దేశ్ పాండే , లోకేష్ థర్ , ఆదిత్యథర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. మొత్తానికైతే ఊహించని రికార్డులు క్రియేట్ చేస్తూ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతోంది ఈ సినిమా.

మొత్తంగా, ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్దనే కాకుండా ఓటీటీ డీల్స్‌లోనూ రికార్డులు నెలకొల్పుతూ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా దూకుడు ఇంకా కొనసాగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.