|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్

Published: 06-12-2025, 7:08 AM
Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
  • రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ‘ధురంధర్‌’ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయింది.
  • ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో రూ. 27.00 కోట్ల భారీ కలెక్షన్లు సాధించింది.
  • 2025లో బాలీవుడ్‌లో మూడో అతిపెద్ద ఓపెనర్‌గా ‘ధురంధర్‌’ నిలిచింది.
  • ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూ.280 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించబడింది.

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ‘ధురంధర్‌’ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీసు వద్ద రూ. 27 కోట్లు కలెక్ట్ చేసి రచ్చ చేసింది. మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, 2025లో మూడో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది.

ధురంధర్‌ ఫస్ట్‌ డే వసూళ్లు: బాక్సాఫీస్ షేక్

రణ్‌ వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన మూవీ `ధురంధర్‌`. డైరెక్టర్ ఆదిత్య ధర్‌ రూపొందించిన ఈ మూవీ శుక్రవారం డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయింది.  ఈ సినిమా ఫుల్ యాక్షన్-థ్రిల్లర్‌తో నిండి ఉంది. ఈ సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంటోంది.

రణ్‌ వీర్ సింగ్ సినిమా `ధురంధర్‌` ఓపెనింగ్ డే కలెక్షన్ల వివరాలు బయటకొచ్చాయి. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ ఏడాదికి అదిరిపోయే ముగింపుని ఇవ్వబోతుంది.

టాప్ ఓపెనర్స్‌లో ధురంధర్‌ స్థానం

sacnilk.com రిపోర్ట్ ప్రకారం, రణ్‌వీర్‌ సింగ్ సినిమా మొదటి రోజు ఇండియాలో రూ. 27.00 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. హిందీలో సినిమా ఓవరాల్ ఆక్యుపెన్సీ 26.44 శాతంగా ఉంది.

`ధురంధర్‌` సినిమా ఆక్యుపెన్సీ విషయానికొస్తే, ఉదయం షోలకు 15.49 శాతం, మధ్యాహ్నం షోలకు 28.24 శాతం, సాయంత్రం షోలకు 35.59 శాతంగా ఉంది. మార్నింగ్‌ తో పోల్చితే సాయంత్రానికి బాగా పెరిగింది. ఇది సినిమాపై పాజిటివ్‌ టాక్‌ కి కారణమని చెప్పొచ్చు. క్రమంగా ఇది పుంజుకుంటోంది. సాయంత్రానికి బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది.

నటీనటులు, బడ్జెట్ వివరాలు

రిపోర్ట్స్ ప్రకారం, రణవీర్ సింగ్ సినిమా `ధురంధర్‌` 2025లో బాలీవుడ్‌లో మూడో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. మొదటి స్థానంలో వార్ 2 (రూ.52.5 కోట్లు), రెండో స్థానంలో ఛావా (రూ.31 కోట్లు) ఉన్నాయి.

డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన `ధురంధర్‌` రణ్‌ వీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు మానవ్ గోహిల్, సౌమ్య టాండన్, నవీన్ కౌశిక్, రాజ్ జుత్షీ, బిమల్ ఒబెరాయ్, గీతికా గంజు ధర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ సినిమాను రూ.280 కోట్ల బడ్జెట్‌తో తీశారు. దీన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ నిర్మించారు.

ధురంధర్‌ మూవీ మొదటి రోజు కలెక్షన్లు అద్భుతంగా ఉన్నాయి. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్‌ షేక్ అవ్వగా, రాబోయే రోజుల్లో ఈ సినిమా మరింత భారీ వసూళ్లను సాధించి, రికార్డులు సృష్టించడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.