
📌 Key Points
- ‘దురంధర్’ సినిమా 700 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ విజయం సాధించింది.
- ఆదిత్య ధర్ ‘ఉరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై 4 నేషనల్ అవార్డులు గెలుచుకున్నారు.
- 2021లో నటి యామి గౌతమ్‌ను ఆదిత్య ధర్ వివాహం చేసుకున్నారు.
- యామి గౌతమ్ కెరీర్ ఆరంభంలో విజయ్ దేవరకొండతో ‘నువ్విలా’ సినిమాలో నటించారు.
బాలీవుడ్ లో ‘దురంధర్’ సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు ఆదిత్య ధర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. తొలి సినిమా ‘ఉరి’ తోనే 4 నేషనల్ అవార్డులు గెలిచి సంచలనం సృష్టించిన ఆయన కెరీర్ విశేషాలతో పాటు, అతని భార్య, స్టార్ హీరోయిన్ యామి గౌతమ్‌కు విజయ్ దేవరకొండతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం.
ఆదిత్య ధర్: ఎవరు ఈ ‘దురంధర్’ డైరెక్టర్?
Aditya Dhar : బాలీవుడ్ లో ఇటీవల రిలీజయిన స్పై థ్రిల్లర్ సినిమా ‘దురంధర్’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 700 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పాకిస్థాన్ కి వెళ్లి అక్కడ పనిచేసిన ఓ ఏజెంట్ కథతో, రియల్ లైఫ్ లో జరిగిన పాకిస్థాన్ – భారత్ కి చెందిన కొన్ని సంఘటనల నేపథ్యంలో దురంధర్ సినిమాని తెరకెక్కించారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, మాధవన్.. కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.(Aditya Dhar)
ధురంధర్ సినిమాతో దర్శకుడు ఆదిత్య ధర్ మరోసారి వైరల్ గా మారాడు. దీంతో బాలీవుడ్ ని ఊపేస్తున్న ఈ డైరెక్టర్ ఎవరా అని చర్చిస్తున్నారు. ఆదిత్య ధర్ ఒక కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన వాడు. లిరిక్ రైటర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆదిత్య ధర్ ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తన అన్నతో కలిసి నిర్మాతగా మారాడు.
‘ఉరి’ తో సంచలనం: 4 నేషనల్ అవార్డులు
దర్శకుడిగా మారి ‘ఉరి’ సినిమాని తెరకెక్కించాడు. పాకిస్థాన్ పై భారతదేశం చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించి మొదటి సినిమాతోనే భారీ విజయం సాధించాడు. ఈ సినిమాతో ఏకంగా నాలుగు నేషనల్ అవార్డులతో పాటు మరిన్ని ప్రైవేట్ అవార్డులు గెలుచుకున్నాడు. 2019 లో ఉరి సినిమా తీసిన ఆదిత్య ధర్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ధురంధర్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమా కూడా జాతీయభావంతో రియల్ గా జరిగిన సంఘటనలతో ఈ సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టాడు. ధురంధర్ సినిమాకు పార్ట్ 2 కూడా ప్రకటించారు. ధురంధర్ పార్ట్ 2 సినిమా 2026 లో రిలీజ్ కానుంది.
యామి గౌతమ్ & విజయ్ దేవరకొండ బంధం
ఇక ఆదిత్య ధర్ హీరోయిన్ యామి గౌతమ్ ని 2021లో పెళ్లి చేసుకున్నాడు. ఉరి సినిమా సమయంలో ఈ ఇద్దరూ ప్రేమలో పడి సింపుల్ గా పెళ్ళి చేసుకున్నారు. ఈ జంటకు ఒక బాబు ఉన్నాడు. ఆదిత్య ధర్ భార్య యామి గౌతమ్ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. యామి గౌతమ్ కెరీర్ ఆరంభంలో తెలుగులో నువ్విలా సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించింది. ఆ తర్వాత తెలుగులో గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు, సిరీస్ లతో, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతుంది.
ఆదిత్య ధర్ తన రెండు చిత్రాలతోనే దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన భార్య యామి గౌతమ్ కెరీర్ కూడా విజయవంతంగా సాగుతోంది. ఈ జంట భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిద్దాం.


