
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘డైస్ ఈరే’ తెలుగులో విడుదలైంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగా భయపెట్టిందో, ఎలా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.
Key Points
ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ 'డైస్ ఈరే'.
రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో రూ. 50 కోట్లు రాబట్టింది.
సినిమా కథనం అంచనా వేయగలిగినప్పటికీ, సంఘటనలు ఫ్రెష్‌గా ఉంటాయి.
సినిమాటోగ్రఫీ, ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ చిత్రానికి అతిపెద్ద ప్లస్ పాయింట్స్.
డైస్ ఈరే: కథనం & విశ్లేషణ
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సినిమా డైస్ ఈరే. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అందుకుంది. తాజాగా నవంబర్ 7న థియేటర్లలో తెలుగులో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి డైస్ ఈరే రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: డైస్ ఈరే (Dies Irae Movie)
నటీనటులు: ప్రణవ్ మోహన్ లాల్, గిబిన్ గోపీనాథ్, సుష్మిత భట్, షైన్ టామ్ చాకూ, జయ కురుప్, అరుణ్ అజికుమార్, శ్రీధాన్య తదితరులు
దర్శకత్వం: రాహుల్ సదాశివన్
సినిమాటోగ్రఫీ: షెహనాద్ జలాల్
ప్రణవ్ మోహన్ లాల్ నటన, ఇతర తారాగణం
ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ
నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్
తెలుగు రిలీజ్ డేట్: నవంబర్ 7, 2025
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా డైస్ ఈరే. భూతకాలం, భ్రమయుగం వంటి హారర్ థ్రిల్లర్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఈ సినిమాను తెరకెక్కించారు. అక్టోబర్ 31న మలయాళం రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. దాదాపుగా రూ. 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ముందుకు తెలుగులో వచ్చేసింది డైస్ ఈరే. నవంబర్ 7న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో డైస్ ఈరే రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి డైస్ ఈరే రివ్యూ లో తెలుసుకుందాం.
సాంకేతిక అంశాలు & ప్లస్ పాయింట్స్
అక్కడి నుంచి తన ఇంటికి వచ్చిన రోహన్‌కు విచిత్ర సంఘటనలు ఎదరవుతుంటాయి. పరిస్థితి అంత ఇబ్బందికరంగా మారుతుంది. తనను ఏదో ఆత్మ వెంటాడుతుందని భావిస్తాడు. ఇదే విషయాన్ని కని పక్కింట్లో ఉండే మధు (గిబిన్ గోపీనాథ్) చెప్పి సాయం అడుగుతాడు.
అందులో డైస్ ఈరే సూపర్ హిట్ కొట్టిందని చెప్పాలి. అయితే, సినిమా స్టోరీ, జరిగే సంఘటనలను ముందుగానే గెస్ చేసేలా ఉంటాయి. కానీ, అవి మలిచిన తీరు మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సూసైడ్ నుంచి భయపెట్టిన తీరు వరకు చాలా డిఫరెంట్‌గా ప్రజంట్ చేశారు.
ఫస్టాఫ్ అంతా కని సూసైడ్, రోహన్‌ను దెయ్యం వెంటాడం, కని, రిలేషన్‌తో సాగుతుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుంది. అప్పటివరకు ఆడియెన్స్ అనుకున్న పాయింట్ మారిపోతుంది. ఇక సెకండాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ మోడ్‌లోకి వెళ్తుంది. ఇలా జరుగుతుందని ప్రేక్షకుడు ముందుగానే గెస్ చేసేలా ఉంటుంది.
క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. రెండో పార్ట్‌కు ఇచ్చే లీడ్ ఫన్నీగా ఉంటూ భయపెట్టేలా ఉంది. సినిమాలో సినిమాటోగ్రఫీ అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. విజువల్స్ అదిరపోయాయి. కొన్ని సీన్స్ సీట్‌లో జర్క్ ఇచ్చేలా ఉంటాయి. ఎడిటింగ్ బాగుంది. బీజీఎమ్ అదిరిపోయింది. ఆర్గానిక్‌గా సౌండింగ్స్ ఉన్నాయి.
మొత్తంగా, ‘డైస్ ఈరే’ భయపెట్టే సన్నివేశాలు, మంచి సినిమాటోగ్రఫీతో కూడిన ఓ హారర్ థ్రిల్లర్. మలుపులు ఆకట్టుకున్నా, కథనం కొంతవరకు అంచనాకు తగ్గట్టే సాగుతుంది. హారర్ ప్రియులకు ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది.


