|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పైరసీ చేసి 400, వెయ్యి డాలర్స్‌కు సినిమాలను అమ్ముతున్నారు.. నిర్మాతలకు కోట్లల్లో నష్టాలు.. దిల్ రాజు కామెంట్స్

Published: 03-07-2025, 1:20 AM
పైరసీ చేసి 400, వెయ్యి డాలర్స్‌కు సినిమాలను అమ్ముతున్నారు.. నిర్మాతలకు కోట్లల్లో నష్టాలు.. దిల్ రాజు కామెంట్స్

తాజా ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు, సినిమా పైరసీ వల్ల నిర్మాతలకు వస్తున్న కోట్ల రూపాయల నష్టం గురించి మాట్లాడారు. పైరసీ కాపీలను అమ్ముతున్న వారి గురించి కూడా ఆయన వివరించారు.

Key Points

1

సినిమా పైరసీతో నిర్మాతలకు కోట్లల్లో నష్టం

2

చిన్న సినిమాకు 400 డాలర్లు, పెద్ద సినిమాకు 1000 డాలర్లకు పైరసీ కాపీలు అమ్ముతున్నారు

4

దిల్ రాజు తన నిర్మాణ సంస్థలోని డైరెక్టర్లతో ఉన్న బంధం గురించి మాట్లాడారు

పైరసీతో నిర్మాతలకు భారీ నష్టాలు

“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. నితిన్ హీరోగా వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

– పైరసీ అరికట్టేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తోంది. థియేటర్స్‌లో కూర్చుని సినిమా రికార్డ్ చేస్తున్న నలుగురిని ఈ మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు.

-ఇలా రికార్డ్ చేసిన సినిమాలను చిన్న సినిమాకు 400 డాలర్స్, పెద్ద సినిమాకు వెయ్యి డాలర్స్ చొప్పున అమ్ముతున్నారు. వాళ్లకు అదే పెద్ద అమౌంట్. కానీ, నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. పైరసీని అరికట్టే చర్యలు క్రమంగా కట్టుదిట్టం అవుతాయని ఆశిస్తున్నాం.

పోలీసుల చర్యలు, దిల్ రాజు అభిప్రాయాలు

-శ్రీరామ్ వేణు మా సంస్థలో ఆర్య నుంచి వర్క్ చేస్తున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా మాతోనే ట్రావెల్ చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు మా దగ్గరనే ఉన్నాడంటే అందుకు మా మధ్య ఉన్న రిలేషన్, వేవ్ వెంగ్త్ కారణం.

-ఇండస్ట్రీలో డబ్బుతోనే పనులు జరుగుతుంటాయి. నాది భిన్నమైన పద్ధతి. నేను వేవ్ లెంగ్త్ కలిసిన వాళ్లతోనే జర్నీ చేస్తుంటాను. అనిల్ రావిపూడి , శ్రీకాంత్ అడ్డాల, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, దశరథ్.. ఇలా డైరెక్టర్స్ మా సంస్థలో వర్క్ చేసి హిట్ చిత్రాలు ఇచ్చారు.

దిల్ రాజు – డైరెక్టర్లతో బంధం

-శ్రీరామ్ వేణు మా సంస్థలోనే ట్రావెల్ అవుతున్నాడంటే అతనికి భారీగా డబ్బు ఇవ్వడం వల్ల కాదు. మాతో ఆయనకు ఒక కంఫర్ట్ ఉంటుంది. అనిల్ రావిపూడితో నాకొక బాండింగ్ ఉంది. ఆ బాండింగ్‌లో ఒక కంఫర్ట్ ఉంటుంది.

-ఈ డైరెక్టర్స్ టాలెంట్ నాకు తెలుసు. కాబట్టి కథ టైమ్‌లో, ఎడిటింగ్ టేబుల్ దగ్గర నాకు అనిపించినవి అడుగుతా. నేను క్వశ్చన్ అడిగితే ఎందుకు అడిగాడు అని ఆలోచిస్తారు. అంతే గానీ వారి పనిలో ఇంటర్ ఫియర్ కాను.

పైరసీని అరికట్టడానికి ప్రభుత్వం మరియు ఇండస్ట్రీ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. నిర్మాతలకు వస్తున్న భారీ నష్టాలను తగ్గించడానికి గట్టి చర్యలు తీసుకోవాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.