
ఇటీవల జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుకలో దిల్ రాజు పాత్రపై వివాదం చెలరేగింది. అవార్డుల ఎంపిక విధానంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో దిల్ రాజు తన స్పష్టీకరణ ఇచ్చారు.
Key Points
తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుకలో దిల్ రాజు పాత్రపై విమర్శలు.
దిల్ రాజు తన సినిమాలకు, తాను డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలకు అవార్డులు ఇచ్చారనే ఆరోపణలు.
రాహుల్ సిప్లిగంజ్ కు అవార్డు ఇవ్వకపోవడంపై దిల్ రాజు స్పందన.
సీఎం సూచనల ప్రకారం అవార్డులు ఇవ్వలేదని దిల్ రాజు వివరణ.
గద్దర్ అవార్డుల వేడుకపై విమర్శలు
Dil Raju : ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకను FDC చైర్మన్ గా దిల్ రాజు ముందు ఉండి నడిపించారు. 2024 సంవత్సరం సినిమాలతో పాటు గత పదేళ్లలో ప్రతి సంవత్సరం మూడేసి సినిమాలకు బెస్ట్ అవార్డులు ఇచ్చారు. అయితే దిల్ రాజు తనకు కావాల్సిన వాళ్లకు, తన సినిమాలకు, తాను డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలకు అవార్డులు ఇచ్చుకున్నారు, కొన్ని మంచి సినిమాలను పక్కన పెట్టేసారు, అందర్నీ ఈవెంట్ కి పిలవలేదు అని పలువురు కామెంట్స్ చేసారు.
అలాగే సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ బిడ్డ హైదరాబాద్ గల్లీల నుంచి ఆస్కార్ దాకా వెళ్ళాడు, అతనికి ఏం అవార్డు ఇవ్వలేదు, ఇవ్వండి అని అవార్డుల వేడుకలో స్టేజిపైనే చెప్పారు. తాజాగా దిల్ రాజు ఈ విషయాలపై స్పందించారు. తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ గద్దర్ అవార్డుల విషయం గురించి మాట్లాడారు.
దిల్ రాజు వివరణ మరియు స్పందన
దిల్ రాజు ఇన్విటేషన్స్ గురించి మాట్లాడుతూ.. నేను మ్యాగ్జిమమ్ అందర్నీ పిలిచాను. ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ లేట్ గా అయింది. దాని వల్ల కొంతమందికి మిస్ అయిందేమో. అయినా నేను FDC చైర్మన్ గా పైపైనే ఉంటాను. MD, ED లు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు మెయిన్. వాళ్ళు నాకు ఒక లిస్ట్ తెచ్చి వీళ్ళని పిలుస్తున్నాం అంటే నేను ఓకే చెప్పాను అని అన్నారు.
అవార్డులపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ.. నేను, గవర్నమెంట్ ఎవరూ అవార్డుల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. జ్యురి ఏది ఇస్తే అదే ఫైనల్ చేసాము. జ్యురి ఇచ్చిన లిస్ట్ నేను రేవంత్ రెడ్డి గారి ముందు పెట్టాను. ఆయన ఓకే అన్నారు. అంతేకాని నా సినిమాలకు అని నేనేమి అవార్డులు ఇచ్చుకోలేదు. అలా జరగదు కూడా. ఒకవేళ జరిగితే నాని దసరా సినిమా నేనే డిస్ట్రిబ్యూషన్ చేశాను కదా, అది తెలంగాణ సినిమా పైగా మరి దానికి ఎందుకు ఇవ్వలేదు అవార్డు. సీఎం గారు పాత సంవత్సరాలకు ఒకటే అవార్డు ఇస్తామన్నారు. జ్యురి వాళ్ళే అన్ని సినిమాలు చూసి ఒకటే అంటే కష్టం, కనీసం మూడు సినిమాలు ఇద్దాం అంటే నేను సీఎం, డిప్యూటీ సీఎం తో మాట్లాడి ఒకే చేపించాను అని తెలిపారు.
రాహుల్ సిప్లిగంజ్ అవార్డు విషయం
ఇక సీఎం రాహుల్ సిప్లిగంజ్ కి అవార్డు అడిగారు అనే దానిపై స్పందిస్తూ.. సీఎం గారు చెప్పారని అవార్డు ఎలా ఇస్తాం. ఆయన ఏదో ఫ్లోలో మాట్లాడారు. సీఎం అడిగారని ఇవ్వలేం కదా. జ్యురి ఫైనల్ చేసిందే ఫైనల్ అని అన్నారు దిల్ రాజు. దీంతో దిల్ రాజు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
చివరగా, దిల్ రాజు తన స్పందనలో అవార్డుల ఎంపికలో తన జోక్యం లేదని, జ్యూరీ నిర్ణయం ప్రకారమే అవార్డులు ఇవ్వబడ్డాయని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇంకా చర్చ జరుగుతోంది.


