|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దిల్ రాజు: ‘ప్రతి ఒక్కరిని ఆహ్వానించాం.. ఉత్తమ చిత్రానికి నాలుగు అవార్డులు’

Published: 12-06-2025, 11:07 AM
దిల్ రాజు: 'ప్రతి ఒక్కరిని ఆహ్వానించాం.. ఉత్తమ చిత్రానికి నాలుగు అవార్డులు'

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దిల్ రాజు విచారం వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డుల వేడుక సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఉత్తమ చిత్రానికి నాలుగు అవార్డులు ఇస్తామని ప్రకటించారు. ఈ వేడుక ఈనెల 14న హైదరాబాద్‌లో జరుగుతుంది.

Key Points

1

గద్దర్ అవార్డుల వేడుక ఈనెల 14న హైదరాబాద్‌లో జరుగుతుంది.

2

ప్రతి ఉత్తమ చిత్రానికి నాలుగు అవార్డులు అందజేస్తారు.

4

టాలీవుడ్ ప్రముఖులందరినీ ఆహ్వానించారు.

గద్దర్ అవార్డుల వేడుక వివరాలు

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన దురదృష్టకరమని టాలీవుడ్ నిర్మాత దిల్‌ రాజు విచారం వ్యక్తం చేశారు. లండన్ బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కుప్పకూలడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. గద్దర్ అవార్డుల వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడారు. విమాన ప్రమాదం జరగటం మంత్రి కోమటిరెడ్డి  ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు.

ఇప్పటికే గద్దర్ అవార్డు గ్రహీతలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించామని  ఇవాళ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలిపారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ వేడుకను లైవ్ టెలికాస్ట్ చేస్తామని ప్రకటించారు. అందరూ తప్పకుండా హాజరైన ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ చేయాలని దిల్ రాజు కోరారు. ప్రతి ఉత్తమ చిత్రానికి హీరో, హీరోయిన్, దర్శక, నిర్మాతలకు కలిసి నాలుగు అవార్డులు అందజేస్తామని తెలిపారు. ఇలా ప్రతి ఏడాదిలో మూడు సినిమాలకు ఇస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కాగా.. ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుల వేడుక ఈనెల 14న హైదరాబాద్‌లో జరగనుంది.

ఉత్తమ చిత్ర అవార్డులు

దిల్ రాజు ప్రకటన

గద్దర్ అవార్డుల వేడుక ఘనంగా జరుగుతుందని దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. టాలీవుడ్ ప్రముఖులందరూ హాజరై ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.