
📌 Key Points
- దిల్ రాజు బ్యానర్ నుండి ఈ సంక్రాంతికి మూడు సినిమాలు విడుదల కానున్నాయి.
- చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ జనవరి 12న థియేటర్లలోకి రానుంది.
- నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న విడుదల కానుంది.
- శర్వానంద్, సంయుక్తల ‘నారి నారి నడుమ మురారి’ కూడా జనవరి 14నే విడుదల.
ఈ సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల గురించి ఆసక్తికరమైన వివరాలు వెలువడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ వంటి స్టార్ హీరోల చిత్రాలు పండగ సందడిని పెంచనున్నాయి. ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో చూద్దాం.
చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదల
Sankranthi Movies 2026: ప్రతి ఏడాది సంక్రాంతికి కొత్త సినిమాలు బోలెడు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంటాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మాత్రం బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉండటంతో జనాలు వాటిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు.. ఇక ఈ సంక్రాంతికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఎన్ని సినిమాలు రానున్నయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.. ఈ ఏడాది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్ని సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, బ్యూటిఫుల్ హీరోయిన్ నయనతార కలిసి జంటగా నటిస్తున్న తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా తెరకెక్కుతుంది.. భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతుంది.. ఇప్పటికే ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.. ఈ సినిమా జనవరి 12న థియేటర్లోకి రాబోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలు చాలావరకు దిల్ రాజు బ్యానర్ లోనే రిలీజ్ అవుతుంటాయి.
నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ అప్డేట్
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి కథానాయికగా కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.. కోనసీమ జిల్లాలో ఓ యువకుడి లవ్ ట్రాక్, సంక్రాంతి సంబరాలతో, ఫ్యామిలీ ఎమోషన్ అన్నీ కలిపి మూవీలో చూపించబోతున్నట్లు గ్లింప్స్, లుక్స్ బట్టి అర్థమవుతోంది.. రావు రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కూడా దిల్ డిస్ట్రిబ్యూటర్ వ్యవహారిస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా, సంయుక్త, సాక్షి వైద్య కీలక పాత్రల్లో నటించిన ‘నారి నారి నడుమ మురారి’ కూడా అదే రోజు విడుదల కానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తోంది.. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 న థియేటర్లలోకి రాబోతుంది. ఈ మూవీ కూడా దిల్ రాజు బ్యానర్ పై థియేటర్లలో రిలీజ్ కాబోతుంది…
శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ రిలీజ్
జనవరి 9న మరో భారీ డబ్బింగ్ సినిమా కూడా థియేటర్లలోకి రానుంది. అదే దళపతి విజయ్ నటించిన ‘జన నాయకుడు’.. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది… ఈ సినిమాకి కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఈ సినిమాను తాను రిలీజ్ చేయలేదని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఈ సంక్రాంతికి మూడు సినిమాలు దిల్ రాజు బ్యానర్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి..
ఈ సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమాలు ప్రేక్షకులకు పండగ ట్రీట్ ఇవ్వనున్నాయి. స్టార్ హీరోలతో పాటు యువ హీరోల చిత్రాలు కూడా పోటీలో ఉండటంతో, బాక్సాఫీస్ వద్ద మంచి సందడి నెలకొననుంది.


