|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డింపుల్ హయతి పెళ్లిపై సంచలన ప్రకటన! అసలు నిజం చెప్పేసిన హీరోయిన్!

Published: 20-01-2026, 12:30 AM
డింపుల్ హయతి పెళ్లిపై సంచలన ప్రకటన! అసలు నిజం చెప్పేసిన హీరోయిన్!
  • డింపుల్ హయతికి డేవిడ్‌తో రహస్య వివాహం జరిగిందనే వార్తలు వైరల్.
  • పెళ్లి రూమర్లపై స్పందిస్తూ ఖండించిన డింపుల్ హయతి.
  • ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని తెలిపిన డింపుల్.
  • వ్యక్తిగత విషయాలుంటే స్వయంగా ప్రకటిస్తానన్న డింపుల్ హయతి.

హీరోయిన్ డింపుల్ హయతికి రహస్యంగా పెళ్లయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై డింపుల్ హయతి స్వయంగా స్పందిస్తూ తాను పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశారు. తప్పుడు కథనాలను నమ్మవద్దని కోరారు.

డింపుల్ హయతి పెళ్లిపై వస్తున్న రూమర్స్

Dimple Hayati: డింపుల్ హయతి (Dimple Hayathi).. ఈపేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ (Varun tej) నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత రవితేజ (Raviteja)హీరోగా నటించిన ‘ఖిలాడి’ సినిమాలో హీరోయిన్గా నటించి తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. చివరిగా ‘రామబాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమెకు ఈ సినిమా కూడా నిరాశే మిగిల్చింది. దాంతో 2 ఏళ్ల పాటూ ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. ఈ ఏడాది మళ్లీ రవితేజ తో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న ఈమె.. ఎన్నో విషయాలను పంచుకుంది. అటు వ్యక్తిగత జీవితంతో పాటు ఇటు వృత్తిపరమైన జీవితంపై కూడా పలు కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ ప్రమోషన్ కార్యక్రమంలోనే భాగంగా డేవిడ్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా రహస్యంగా వివాహం జరిగిందని , వీరిద్దరూ చాలా కాలంగా భార్యాభర్తలుగా కలిసి ఉంటున్నారనే వార్త జోరుగా సాగుతోంది. దీనికి తోడు వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే తన పెళ్లిపై వస్తున్న వరుస కథనాలకు చెక్ పెడుతూ స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.

రూమర్లపై స్పందించిన డింపుల్ హయతి

డింపుల్ హయతి మాట్లాడుతూ..” గత కొంతకాలంగా కొంతమంది కావాలనే నాపై తప్పుడు కథనాలు వల్లిస్తున్నారు. ముఖ్యంగా నాకు పెళ్లయిపోయిందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. నాకు ఇప్పటివరకు వివాహం కాలేదు .ముఖ్యంగా నా వ్యక్తిగత జీవితం గురించి ఏదైనా విషయం ఉంటే నేనే స్వయంగా ప్రకటిస్తాను. దాచుకోవాల్సిన పనిలేదు. దయచేసి ఇకపై ఇలాంటి రూమర్లను ఎవరు సృష్టించవద్దు. ఒకవేళ వచ్చినా.. నా నుంచి క్లారిటీ వచ్చేవరకు ఎవరు నమ్మకండి” అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే డేవిడ్ తో సన్నిహితంగా ఉండడం వల్లే ఇలాంటి కథనాలు వచ్చాయని ఆమె సన్నిహిత వర్గాలు కూడా చెబుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉందని.. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన ఆమె చేయట్లేదని సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.

వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న డింపుల్

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. గత ఏడాది కన్నడలో తన తొలి సినిమాలో నటించే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎం చంద్రమౌళి దర్శకత్వం వహించిన దిల్మార్ అనే కన్నడ సినిమాలో నటించి తన తొలి కన్నడ రంగ ప్రవేశం చేసి అభిమానులను మెప్పించింది. అలాగే మిస్కిన్ దర్శకత్వం వహించిన ట్రైన్ అనే తమిళ చిత్రంలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ ..ఇక ప్రస్తుతం ఈమె చేతిలో మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. ఆ సినిమాలతో మరింత సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

డింపుల్ హయతి తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లను ఖండించారు. ప్రస్తుతం ఆమె తన కెరీర్‌పై దృష్టి సారించానని, వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే స్వయంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.