
📌 Key Points
- ప్రముఖ దర్శకుడు భారతీరాజా తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక.
- మలేషియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురైన భారతీరాజా.
- గత కొద్దిరోజులుగా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
- ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం లేదని కుటుంబ సభ్యుల వెల్లడి, అభిమానులకు ఊరట.
ప్రముఖ దర్శకుడు భారతీరాజా తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారు. మలేషియా నుండి రాగానే అనారోగ్యానికి గురైన ఆయనను చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని కుటుంబ సభ్యులు తెలియజేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
భారతీరాజాకు అస్వస్థత: కారణం ఏమిటి?
Bharathiraja: దక్షిణాది చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ దర్శకులు భారతీరాజా (Bharathiraja)ఒకరు. ఈయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్న ఈయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురి అయ్యి హాస్పిటల్ పాలయ్యారని తెలుస్తోంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం.. ఇటీవల మలేషియాలో ఉన్న తన కూతురి వద్దకు భారతీ రాజా వెళ్లి అక్కడే కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకొని తిరిగి చెన్నై చేరుకున్నారు. ఇలా మలేషియా నుంచి చెన్నై చేరుకున్న ఈయన ఉన్నఫలంగా అనారోగ్యానికి గురి కావడంతో గత మూడు రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్న భారతి రాజా ఆరోగ్యం కుదుటపడుతోందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈయన వయసు 80 సంవత్సరాలు కావడంతో తరచూ అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు. గతంలో కూడా భారతీరాజా పలు సందర్భాలలో అనారోగ్యానికి గురి అయ్యి హాస్పిటల్ పాలయ్యారు. తాజాగా మరోసారి హాస్పిటల్ లో అడ్మిట్ కావడంతో అభిమానులు ఈయన ఆరోగ్య విషయంలో కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈయన క్షేమంగా ఆరోగ్యంగా బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఈయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా లేదని ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా దర్శకుడు ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఇక భారతీ రాజా సినిమా విషయానికి వస్తే ఈయన 16 ఏళ్ల వయసుతో అనే సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో అనంతరం సీతాకోకచిలుక జమదగ్ని, ఆరాధన వంటి సినిమాలతో దర్శకుడుగా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.
దర్శకుడిగా సత్తా చాటుకున్న భారతీ రాజా..
దిగ్గజ దర్శకుడి సినీ ప్రస్థానం
ఇలా ఇండస్ట్రీలో దర్శకుడుగా సత్తా చాటుకున్న భారతీ రాజా నటుడిగా కూడా ప్రేక్షకులను మెప్పించారు. ఈ విధంగా ఇండస్ట్రీలో నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా చెరగని ముద్ర సంపాదించుకున్న ఈయన ఆరోగ్యానికి సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కంగారు వ్యక్తం చేశారు. అయితే ఈయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని ఎవరు కంగారు పడాల్సిన పనిలేదని తెలియడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారతీ రాజా అనారోగ్య సమస్యలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మొత్తంగా, దర్శకుడు భారతీరాజా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఎటువంటి ప్రమాదం లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.


