
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు, కంటికి నాలుగు కుట్లు పడ్డాయి.
- గాయంతో బాధపడుతున్నా, అభిమానుల కోసం షూటింగ్ లోకేషన్లో సెల్ఫీ వీడియో దిగారు.
- మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు షూటింగ్ సెట్‌కు భారీగా తరలివచ్చారు.
- ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదలయ్యే అవకాశం ఉంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. కంటికి గాయమైనప్పటికీ, ఆయన అభిమానుల కోసం షూటింగ్ సెట్‌కు వచ్చి వారితో సెల్ఫీ వీడియో దిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
షూటింగ్లో రామ్ చరణ్‌కు గాయం
Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan tej)ఇటీవల షూటింగ్ లొకేషన్లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. పెద్ది సినిమా షూటింగ్లో భాగంగా ఈయన ఈ ప్రమాదానికి గురి కావడంతో కంటి పై భాగంలో చిన్నపాటి గాయం తగిలింది అయితే ఈ గాయం కారణంగా నాలుగు కుట్లు పడ్డాయని చిత్ర బృందం తెలిపారు. ఇక కంటి పై భాగంలో దెబ్బ తగలడంతో కంటికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వైద్యులు చెప్పడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇలా కంటికి గాయం అయినప్పటికీ రామ్ చరణ్ మాత్రం సినిమా షూటింగుకు విరామం ఇవ్వకుండా షూటింగ్లో పాల్గొన్నారు.
రామ్ చరణ్ కేవలం నిన్న మాత్రమే విశ్రాంతి తీసుకున్నారు . నేడు గచ్చిబౌలిలో జరుగుతున్న పెద్ది సినిమా షూటింగ్లో ఈయన పాల్గొన్నారు.. ఇక మార్చి 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఈయన కోసం అభిమానులు పెద్ద ఎత్తున పెద్ది సినిమా షూటింగ్ లోకేషన్ కి చేరుకున్నారు. ఇలా అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున తరలి రావడంతో రామ్ చరణ్ వారిని కలిసి అభిమానులతో ప్రత్యేకంగా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కంటికి గాయమైన తర్వాత మొదటిసారి బయటకు వచ్చిన రామ్ చరణ్ నొప్పితో బాధపడుతున్నప్పటికీ అభిమానులను కలిసి వారి కోసం సెల్ఫీ వీడియో దిగడంతో రామ్ చరణ్ మంచి మనసు పై అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఎడమ కంటి పై భాగంలో దెబ్బ తగిలిందని స్పష్టమవుతుంది . రామ్ చరణ్ గాయం పై ఇప్పటికీ బ్యాండేజ్ వేసి ఉంది. ఇలా కంటి పై భాగంలో నాలుగు కుట్లు పడినప్పటికీ చరణ్ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్ కోసం రావడంతో సినిమా పట్ల ఈయనకు ఉన్నటువంటి నిబద్ధత ఏంటో స్పష్టమవుతుంది. ఇక పెద్ది సినిమా చివరి దశ షూటింగ్లో ఉన్న సంగతి తెలిసినదే. ఒక వారం రోజులలో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది.
అభిమానులతో చరణ్ సెల్ఫీ వీడియో
#Peddi సెట్ లో తనను wish చేయడానికి వచ్చిన అభిమానులతో సెల్ఫీ వీడియో తీసుకున్న @AlwaysRamCharan #RamCharan https://t.co/4eLgCUFZKd pic.twitter.com/GM8cOxJdH2
— Rajesh Manne (@rajeshmanne1) March 26, 2026
ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల?
ఇలా వారం రోజులలో షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సినిమా అనుకున్న విధంగానే ఏప్రిల్ 30వ తేదీ విడుదలవుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక రామ్ చరణ్ మార్చి 27వ తేదీ తన పుట్టిన రోజు కావడంతో పెద్ది సినిమా నుంచి ఒక ప్రత్యేకమైన గ్లింప్ విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపు ఉదయం ఈ సినిమా నుంచి కుస్తీ పోటీలకు సంబంధించిన గ్లింప్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే క్రికెట్ కి సంబంధించిన గ్లింప్ విడుదల చేయగా ఎంతో మంచి ఆదరణ లభించింది. అలాగే సినిమా నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా మంచి ఆదరణను సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి.
కంటికి గాయమైనప్పటికీ రామ్ చరణ్ షూటింగ్‌లో పాల్గొనడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. ‘పెద్ది’ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందో లేదో వేచి చూడాలి.


