
📌 Key Points
- ఫిబ్రవరి 6న ‘ఎర్రచీర’ విడుదల, యూత్‌కి బంపర్ ఆఫర్ ప్రకటించిన చిత్ర యూనిట్!
- సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా థియేటర్లలో చీరలు గెలుచుకునే అవకాశం!
- రాజేంద్రప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని కీలక పాత్రలో నటిస్తోంది.
- హారర్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ కలగలిసిన కథతో ‘ఎర్రచీర’!
క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు దర్శకత్వంలో వస్తున్న ‘ఎర్రచీర’ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. యూత్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలో 36 ముద్దు సీన్లు పెట్టామని డైరెక్టర్ చెప్పడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
యూత్‌ని ఆకట్టుకునేందుకు 36 ముద్దు సీన్లు!
‘ఎర్రచీర – ది బిగినింగ్’ సినిమా ఫిబ్రవరి 6న రిలీజ్ కాబోతున్నది. ఈ సందర్భంగా ఆడియన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించారు చిత్ర బృందం. దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. రిలీజ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ‘ఎర్రచీర – ది బిగినింగ్ ఒక విలక్షణమైన కథాంశంతో రూపొందిన సినిమా. మదర్ సెంటిమెంట్‌కు హారర్, యాక్షన్ అంశాలు బలంగా మిళితమయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షించిన డిస్ట్రిబ్యూటర్లు, సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా కంటెంట్‌పై ప్రశంసలు కురిపించారు. ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం అయినప్పటికీ కుటుంబమంతా కలిసి చూసేలా రూపొందించం’ అని తెలిపారు..
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘‘ఎర్రచీర’ అనేది ఒక హారర్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ చిత్రం. చింతల్ ప్రాంతంలో నా స్నేహితుడి ఇంటి పక్కన జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ కథను తీసుకున్నా. ఇది రెగ్యులర్ హారర్ సినిమా కాదు. అందుకే పోటీ గురించి భయం లేదు. సినిమా ప్రమోషన్స్ కోసం బి, సి సెంటర్ల థియేటర్లలో ప్రతి షోకి లక్కీ డ్రా తీసి 10 మందికి చీరలను బహుమతిగా ఇవ్వబోతున్నాం. యూత్ కోసం, కమర్షియల్ హంగుల కోసం 36 ముద్దుల కాన్సెప్ట్‌తో ఒక పాటను పెట్టాం. అది కథ డిమాండ్ మేరకే పెట్టాం. ఎర్రచీరకు సీక్వెల్‌గా అరకులో జరిగిన గిరిజన యదార్థ గాధతో ‘అంబిక (ఎర్రచీర-2)’ సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. కాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు, జీవా తదితరులు ప్రదాన పాత్రల్లో నటిస్తున్నారు.
థియేటర్లలో చీరలు గెలుచుకునే అవకాశం!
ఫిబ్రవరి 6న గ్రాండ్ రిలీజ్!
‘ఎర్రచీర’ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. యూత్ కోసం 36 ముద్దు సీన్లు ఉండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


