
ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు మారుతి తన అనుభవాలను పంచుకున్నారు. మచిలీపట్నంలో తన బాల్యం గురించి, తన తండ్రి అరటిపండ్లు అమ్మేవాడని గుర్తు చేసుకున్నారు.
Key Points
రాజాసాబ్ టీజర్ రిలీజ్ సందర్భంగా మారుతి ఎమోషనల్ పోస్ట్
మచిలీపట్నంలో తన తండ్రి అరటిపండ్లు అమ్మేవాడని గుర్తు చేసుకున్నారు
ఇప్పుడు ప్రభాస్ తో కలిసి కటౌట్ పెట్టడంపై ఆనందం వ్యక్తం చేశారు
తన కష్టాలను, విజయాన్ని గుర్తు చేసుకుంటూ తండ్రిని గుర్తు చేసుకున్నారు
మారుతి ఎమోషనల్ పోస్ట్
Director Maruthi : నేడు ప్రభాస్ రాజాసాబ్ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. పలు థియేటర్స్ లో కూడా టీజర్ స్క్రీనింగ్ వేస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కటౌట్స్ కూడా భారీగా పెట్టారు. ఈ క్రమంలో రాజాసాబ్ డైరెక్టర్ మారుతీ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసారు.
మారుతిది మచిలీపట్టణం అని తెలిసిందే. మచిలీపట్నంలో సిరి కాంప్లెక్స్ థియేటర్ వద్ద ప్రభాస్ – మారుతీ కటౌట్ పెట్టారు.
బాల్య జ్ఞాపకాలు
డైరెక్టర్ మారుతీ ఈ కటౌట్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఈ ప్లేస్ లో మా నాన్న ఒక చిన్న స్టాల్ లో అరటిపండ్లు అమ్మేవాడు. నేను ఇక్కడ కట్టే బ్యానర్స్ రాసేవాడిని. ఆ బ్యానర్స్ పై ఒక్కసారైనా మన పేరు చూడాలి అని కలలు కనేవాడిని. ఎక్కడ మొదలుపెట్టానో అని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ ఒక సైకిల్ లాంటిది. నేను మొదలుపెట్టిన చోటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు నా కటౌట్ పెట్టారు. ఇది చాలదా. మా నాన్న ఇది చూసి ఉంటే గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. మిస్ యు నాన్న. నేను ఇప్పుడు మోస్తున్న కృతజ్ఞతకు ధన్యవాదాలు అనేది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. టీజర్ చెప్పిన టైం కి వస్తుంది అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
రాజాసాబ్ సినిమా విజయం
దర్శకుడు మారుతి తన విజయానికి తన తండ్రిని గుర్తు చేసుకుని, కష్టపడి పనిచేయడం ద్వారా విజయం సాధించవచ్చని చూపించారు. రాజాసాబ్ సినిమా విజయవంతం కావాలని ఆయన కోరుకుంటున్నారు.


