|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Director Prem Kumar: ఫహాద్‌తో ’96’ దర్శకుడి మూవీ.. పాత్రలు చాలా తక్కువ

Published: 10-09-2025, 4:19 AM
Director Prem Kumar: ఫహాద్‌తో '96' దర్శకుడి మూవీ.. పాత్రలు చాలా తక్కువ

’96’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ప్రేమ్ కుమార్, తన తదుపరి చిత్రం కోసం ఫహాద్ ఫాజిల్‌ను ఎంచుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పాత్రల సంఖ్య చాలా తక్కువ అని తెలిపారు.

Key Points

1

ప్రేమ్ కుమార్ తన తదుపరి చిత్రం కోసం ఫహాద్ ఫాజిల్‌ను ఎంచుకున్నారు.

2

ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో పాత్రల సంఖ్య చాలా తక్కువ.

4

ఈ చిత్రం తర్వాత విక్రమ్ తో ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు.

ఫహాద్ ఫాజిల్ తో ప్రేమ్ కుమార్ సినిమా

’96’.. ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ప్రేమకథలు ఇ‍ప్పటివరకు చాలా వచ్చాయి గానీ ఈ చిత్రంలో ఎమోషన్స్, స్టోరీ.. అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చాయి. ఓ రకంగా చెప్పాలంటే విజయ్ సేతుపతి, త్రిషకు ఓ రేంజు గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉందని కొన్నాళ్ల క్రితం చెప్పిన దర్శకుడు ప్రేమ్ కుమార్.. ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు అనిపిస్తుంది. డిఫరెంట్ చిత్రాలతో రాబోతున్నట్లు ప్రకటించాడు.

యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న చిత్రం

చివరగా ప్రేమ్ కుమార్.. ‘సత్యం సుందరం’ సినిమాతో వచ్చాడు. గతేడాది ఇది రిలీజైంది. దీని తర్వాత తమిళ హీరో విక్రమ్‌తో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. అయితే ఇది ఇంకా ఆలస్యం కానుంది. ఇంతలో ఫహాద్ ఫాజిల్‌తో ప్రేమ్ కుమార్ ఓ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు. 45 నిమిషాల స్క్రిప్ట్ చెప్పానని, అది ఫహాద్‌కి చాలా నచ్చేసిందని చెప్పాడు. ఇదో యాక్షన్ థ్రిల్లర్ అని పేర్కొన్నాడు. అయితే 96, సత్యం సుందరం చిత్రాలతో పోలిస్తే ఇందులో చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు.

ఫహాద్ ఫాజిల్‌కి హీరోగా ఇది తొలి తమిళ సినిమా కానుంది. జనవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇదివరకే తమిళంలో ఫహాద్ పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. వాటిలో సహాయ పాత్రలు చేశాడు. ఇప్పుడు ప్రేమ్ కుమార్‌తో మూవీ అనగానే కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత విక్రమ్‪‌తో ప్రేమ్ కుమార్ మూవీ చేస్తారు. అయితే ఈ విషయాన్ని చెప్పిన ఈ దర్శకుడు.. 96 సీక్వెల్ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే ఇది లేనట్లే అనిపిస్తుంది.

’96’ సీక్వెల్ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు

చివరగా, ప్రేమ్ కుమార్ తన తదుపరి చిత్రం వివరాలను వెల్లడించాడు. ’96’ సీక్వెల్ గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.