
📌 Key Points
- చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో నయనతార కథానాయిక.
- ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయనతార ఈ సినిమాకు తొలిసారి చేసింది.
- అనిల్ రావిపూడి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ‘బాస్’ సినిమా గుర్తు చేశాడు.
- ఈ విషయం నయనతారకు తెలియకపోవడంతో ఆమె ఆశ్చర్యపోయారని డైరెక్టర్ వెల్లడించారు.
చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా కోసం నయనతార ప్రమోషన్స్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. నాగార్జునతో నయనతార పాత సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర సర్ప్రైజ్ వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
నయనతార ప్రమోషన్స్‌లో ఎందుకు?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్ర ప్రారంభోత్సవం నుంచి బజ్ మొదలయింది. టైటిల్, టీజర్, ఇటీవల విడుదలైన 2 పాటలు అభిమానులని ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటారు. అది ఆమె రూల్. ఎంత పెద్ద సినిమా అయినా సరే షూటింగ్ పూర్తయ్యాక నయనతార కనిపించరు. ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆమె హాజరు కారు. కానీ మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి నయనతార ప్రారంభం నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
అనిల్ రావిపూడి అసలు నిజం
షూటింగ్ లో హాజరైన రోజే నయనతార ఈ మూవీ కోసం స్పెషల్ వీడియో చేసింది. నయనతార తన రూల్ పక్కన పెట్టి ఈ మూవీ కోసం ఎందుకు ప్రమోషన్స్ చేస్తోంది అని అంతా ఆశ్చర్యపోయారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. నయనతార అసలు ప్రమోషన్స్ కి రాదు.. వీడు ఎలా ప్రమోషన్స్ చేయించాడు అనేది టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. కనై నేను చేసింది ఏమీ లేదు.. నయనతార గారి దగ్గరకు పాజిటివ్ అప్రోచ్ తో వెళ్ళాను. ఆమె చేశారు అంతే. ఇందులో ఇక సీక్రెట్స్ ఏమీ లేవు అని అనిల్ రావిపూడి అన్నారు.
మనం అడిగే విధానం బట్టి వేరేవాళ్ళ రియాక్షన్ ఉంటుంది. నేను అడిగిన విధానం నయనతార గారికి నచ్చి ఉండొచ్చు. ఆమె చేస్తే బావుంటుంది అని బలంగా కోరుకున్నా. అదే జరిగింది అని అనిల్ రావిపూడి అన్నారు. అనిల్ రావిపూడి నయనతారకి మరో స్వీట్ షాక్ కూడా ఇచ్చారట. మన శంకర వరప్రసాద్ గారు కథ మొత్తం చెప్పారట. ఆమెకి కథ నచ్చి సినిమా చేయడానికి అంగీకరించారు.
నయనతారకు బాస్ మూవీ సర్ప్రైజ్
ఇక్కడ నయనతారకి సర్ప్రైజ్ ఏంటి అంటే.. అనిల్ రావిపూడి నయనతార, నాగార్జున నటించిన బాస్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. కానీ ఆ విషయం ఆమెకి గుర్తు లేదు. ప్రతిసారి నయనతారని లొకేషన్ కి పిలిచేది నేనే. కథ చెప్పిన తర్వాత ఆ విషయం నయనతారకి చెప్పాను. ఆమె థ్రిల్ అయ్యారు అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. నాగార్జునతో నయనతార నటించిన బాస్ మూవీ నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.
అనిల్ రావిపూడి వెల్లడించిన ఈ విషయం నయనతారను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ఆమె చిరంజీవి సినిమా ఒప్పుకోవడానికి ఓ కారణమా అనేది ఆసక్తికర చర్చకు దారితీసింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


