
📌 Key Points
- కలర్ ఫోటో చిత్రంతో జాతీయ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్.
- సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మోగ్లీ’ చిత్రం డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉంది.
- ‘అఖండ 2’ అదే తేదీన విడుదల కానుండటంతో ‘మోగ్లీ’ వాయిదా పడింది.
- మోగ్లీ వాయిదాపై సందీప్ రాజ్ తన ఎక్స్ (ట్విట్టర్)లో తీవ్ర భావోద్వేగ పోస్ట్ చేశారు.
కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ‘మోగ్లీ’ సినిమా వాయిదా పడటంపై భావోద్వేగానికి గురయ్యారు. డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం, ‘అఖండ 2’ వల్ల థియేటర్లు దొరకక వాయిదా పడింది. తన కలలు కలగానే మిగిలిపోతున్నాయని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
మోగ్లీ విడుదల వాయిదా: కారణమేమిటి?
Director Sandeep Raj Emotional: డైరెక్టర్ సందీప్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . కలర్ ఫోటో సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టాడు . అంతేకాదు తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు . ఏ స్టార్స్ సాధ్యం కానీ , జాతీయ అవార్డు డెబ్యూ మూవీతోనే అందుకున్న ఈ డైరెక్టర్ తాజాగా తీవ్ర నిరాశకు గురయ్యాడు . సిల్వర్ స్క్రీన్ పై డైరెక్టర్ సందీప్ రాజ్ అనే పేరు చూసుకోవాలనే తన కల కలగానే మిగిలిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు .
ఇంతకి సందీప్ రాజ్ అంతగా డిసప్పాయింట్ అవ్వడానికి కారణమేంటి ? అసలేం జరిగింది చూద్దాం . డిసెంబర్ 12 న దాదాపు 16 చిన్న సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి . అందులో సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ మోగ్లీ ‘ ఒకటి . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 12 న ఈ మూవీ విడుదలకు రెడీ అవుతుంది . అయితే డిసెంబర్ 5 న వాయిదా పడ్డ పాన్ ఇండియా చిత్రం అఖండ 2 ని డిసెంబర్ 12 న విడుదల చేసేందుకు మేకర్స్ గట్టి ప్లాన్ చేస్తున్నారు . ఈ తేదీకే అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు గట్టి సమాచారం . డిసెంబర్ 12 న అఖండ వస్తుండటంతో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకండ కష్టం అవుతుంది .
దీంతో ఆయా చిత్రాలు వరుసగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి . ఇప్పటికే మోగ్లీ , ఈషా చిత్రాలను వాయిదా వేసుకున్నారు . మోగ్లీ మూవీ వాయిదా పడుతుండటంతో దీనిపై డైరెక్టర్ సందీప్ రాజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఈ మేరకు తన ఎక్స్ లో భావోద్వేగాపూరితమైన నోట్ రాసుకున్నాడు . ‘కలర్ ఫొటో’, ‘మౌగ్లీ’ సినిమాలు నాకు బదులుగా మరొక డైరెక్టర్ తీయాల్సింది . ఎందుకంటే ఈ రెండు.. సినిమా అంటే ప్యాషన్ .. సినిమా, తను నమ్మిన ప్రొఫెషన్ కోసం ఏదైనా చేయడానికి సిద్దపడే నిబద్ధత, అభిరుచి ఉన్న వ్యక్తుల బృందంచే రూపొందించబడ్డాయి. ఈ రెండు సినిమాల్లో రెండు కామన్ పాయింట్స్ ఉన్నాయి .
సందీప్ రాజ్ భావోద్వేగ పోస్ట్
Maybe Colour Photo and Mowgli deserved another DIRECTOR instead of me. These movies were made by a group of passionate people who can do anything for their profession. The common points between both films are: 1. Facing bad luck with their release, just when everything seemed to…
— Sandeep Raj (@SandeepRaaaj) December 9, 2025
చిన్న సినిమాలపై ‘అఖండ 2’ ప్రభావం
అవి .. 1 సినిమా రిలీజ్ కి అంత సిద్దమై అంత సాపీగా వెళుతుంటే ఏదోక అడ్డంకులు ఏదురవడం .. 2 మరోకటి నేను . బహుశా నేనే దురదృష్టవంతుడినేమో . ఇవన్ని చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది . సిల్వర్ స్క్రిన్ పై “ దర్శకత్వం: సందీప్ రాజ్ “ అనే టైటిల్‌ను చూసుకోవాలని నా కల రోజురోజుకూ కష్టమవుతోంది. సిల్వర్‌స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందేమో అనిపిస్తోంది. ‘మౌగ్లీ’ సినిమా రోషన్, సరోజ్ గారు, సాక్షి, హర్ష, డీవోపీ మారుతి, భైరవ వంటి ఎంతో మంది అంకితభావం ఉన్న వ్యక్తుల కష్టం, చెమట, రక్తంతో తయారైంది. కనీసం వారి కోసమైనా ‘మోగ్లీ’కి అన్ని మంచి జరగాలని నేను నిజంగా ఆశిస్తున్నాను ” అంటూ సందీప్ రాజ్ ఎమోషనల్ అయ్యాడు . దీంతో మోగ్లీ సినిమా వాయిదా పడ్డనట్టే అని స్పష్టం అవుతుంది . పెద్ద సినిమా కారణంగా చిన్న సినిమాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు రావడం బాధగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు .
సందీప్ రాజ్ లాంటి ప్రతిభావంతులకు ఎదురవుతున్న ఈ పరిస్థితి చిన్న సినిమాల భవిష్యత్తుకు ఆందోళన కలిగిస్తోంది. పెద్ద సినిమాల పోటీ, థియేటర్ల కొరత చిన్న చిత్రాలకు సవాల్‌గా మారాయి. ఈ సమస్యకు సత్వర పరిష్కారం అవసరం.


