
అగ్ర దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ నటించిన ‘నేసిప్పాయా’ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం.
Key Points
డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ నటించిన 'నేసిప్పాయా' ఓటీటీలోకి రాబోతోంది.
సన్ నెక్స్ట్ ఓటీటీలో త్వరలోనే 'నేసిప్పాయా' తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
రొమాంటిక్ యాక్షన్ కథాంశంతో ఆకట్టుకునే ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది.
ఆకాష్ మురళి, శరత్ కుమార్, ఖుష్బూ వంటి ప్రముఖ कलाకారులు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
నేసిప్పాయా ఓటీటీ విడుదల తేదీ ప్రకటన
అగ్ర దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ నేసిప్పాయా థియేటర్లలో రిలీజై మూడు నెలలు దాటినా ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఇన్నాళ్లు మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావడం అనుమానమే అంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఎట్టకేలకు నేసిప్పాయా ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేస్తామని సన్ నెక్స్ట్ ప్రకటించింది. నేసిప్పాయా మూవీ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగులోనూ ఒకే రోజు రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నేసిప్పాయా
నేసిప్పాయా మూవీ ద్వారా కోలీవుడ్ సీనియర్ హీరో మురళి తనయుడు ఆకాష్ మురళి హీరోగా పరిచయమయ్యాడు. ఈ మూవీకి పంజా ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వం వహించాడు. తెలుగులోనూ ప్రేమిస్తావా పేరుతో ఈ మూవీ డబ్ అయ్యింది. తెలుగు వెర్షన్‌ను థియేటర్లలో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. నేసిప్పాయా మూవీలో శరత్‌కుమార్, ఖుష్బూ, దగ్గుబాటి రాజా, కల్కి కొచ్లిన్ కీలక పాత్రల్లో నటించారు.తమిళం, తెలుగు…రెండు భాషల్లో ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
దియాతో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు అర్జున్. దియా ప్రేమను దక్కించుకోవడం కోసమే ఆమె చదువుతున్న కాలేజీలో చేరుతాడు. తొలుత అర్జున్ ప్రేమను రిజెక్ట్ చేసిన దియా…అతడి మంచితనం చూసి ఇష్టపడటం మొదలుపెడుతుంది.
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల
జాబ్ విషయంలో దియా పోర్చుగల్ వెళ్లాల్సివస్తుంది. ఈ విషయంలో అర్జున్, దియా మధ్య మనస్పర్థలు మొదలవుతాయి. అర్జున్‌ను వదిలేసి ఒంటరిగా పోర్చుగల్ వెళ్లిన దియా ఓ మర్డర్ కేసులో చిక్కుకుంటుంది. ప్రియురాలిని కాపాడేందుకు పోర్చుగల్ వస్తాడు అర్జున్. ఈ మర్డర్ కేసు గురించి అర్జున్ తెలుసుకున్న నిజాలేమిటి? దియా చంపింది ఎవరిని? అర్జున్, దియా తిరిగి ఒక్కటయ్యారా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
కార్తి విరుమన్ మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదితి శంకర్. ఆ తర్వాత శివకార్తికేయన్ మావీరన్‌లో నటించింది. భైరవం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తోన్న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
నేసిప్పాయా సినిమా ఓటీటీ విడుదలతో, అదితి శంకర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా అందుబాటులో ఉండటం సంతోషదాయకం.


