
📌 Key Points
- సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన ‘మోగ్లీ’ సినిమా నేడు థియేటర్లలో విడుదల.
- ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ ‘మోగ్లీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
- కలర్ ఫోటోలో విలన్ పాత్రను మొదట తాను చేయాలని అనుకున్నానని డైరెక్టర్ సందీప్ రాజ్ వెల్లడించారు.
- పానిక్ అటాక్ రావడంతో ఆ పాత్రను సునీల్ చేశారని, అది వేరే లెవెల్‌కి వెళ్లిపోయిందని సందీప్ వివరణ.
సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన ‘మోగ్లీ’ సినిమా నేడు విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘కలర్ ఫోటో’లో తాను విలన్ పాత్ర చేయాలనుకున్నానని, కానీ కొన్ని కారణాల వల్ల సునీల్ చేశారని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
మోగ్లీ సినిమా: వివరాలు, విడుదల
స్టార్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా నటిస్తున్న సినిమా ‘మోగ్లీ'(Mowgli). కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్(Sandeep Raj) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ సాక్షి(Sakshi) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Viswaprasd), కృతి ప్రసాద్(Kruthi Prasad) ఈ సినిమాను నిర్మించారు. అయితే… ఈ మూవీ డిసెంబర్ 13న అనగా ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయింది.
రోషన్ కనకాల ఎంపికపై సందీప్ రాజ్ కామెంట్స్
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సందీప్ రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఫస్ట్ నేను ఈ మూవీ ఆ హీరో ఈ హీరో కోసం కాకుండా ఒక స్క్రిప్ట్ రాద్దాము. తర్వాత దీనికి తగ్గట్టు ఏ హీరో మ్యాచ్ అయితే అతన్ని తీసుకుందామనుకున్నాను. ఆ క్రమంలోనే యంగ్ అండ్ డైనమిక్ హీరో అయితే బెటర్ అనుకున్నాను. అలా బబుల్ గమ్ సినిమాలో నటించిన రోషన్ కనకాల అయితే కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అని అతన్ని తీసుకున్నాను’ అని చెప్పారు.
కలర్ ఫోటో విలన్ పాత్ర వెనుక ఆసక్తికర నిజాలు
అలాగే కలర్ ఫోటో సినిమా గురించి మాట్లాడుతూ.. ‘మొదట ‘కలర్ ఫోటో’(Colour Photo)లో విలన్ క్యారెక్టర్ నేను చేయాలని అనుకున్నాను. ఆ క్యారెక్టర్ కోసం ఫిట్ అయ్యే ప్రక్రియలో నాకు పానిక్ ఎట్టాక్ వచ్చింది. అందుకే సునీల్(Sunil) అన్నను తీసుకున్నాం. సునీల్ అన్న వచ్చాక ఆ క్యారెక్టర్ పూర్తిగా వేరే లెవెల్‌కి వెళ్లిపోయింది’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
సందీప్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆయన నిజాయితీగా చెప్పిన ఈ విషయాలపై సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. మోగ్లీ సినిమాతో పాటు కలర్ ఫోటో వెనుకటి కబుర్లు అభిమానులకు ఆకట్టుకుంటున్నాయి.


