|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినీ హీరోలపై సత్యరాజ్‌ సంచలన కామెంట్‌కు దర్శకుడి రియాక్షన్‌

Published: 04-10-2025, 10:59 PM
సినీ హీరోలపై సత్యరాజ్‌ సంచలన కామెంట్‌కు దర్శకుడి రియాక్షన్‌

తమిళ సినీ రంగంలో రాజకీయాల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. తాజాగా నటుడు సత్యరాజ్ సినీ హీరోలపై చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నటులను దేవుళ్లుగా చూడొద్దని ఆయన అనగా, దర్శకుడు పేరరసు తీవ్రంగా స్పందించారు. ఈ వివాదం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

నటుడు సత్యరాజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సినీ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

2

నటులను ఐన్‌స్టీన్‌ రేంజ్‌లో చూడవద్దని, కేవలం నటించడం మాత్రమే వారికి తెలుసని సత్యరాజ్‌ పేర్కొన్నారు.

4

మీరు కూడా నటులే కదా, ఎంజీఆర్ ఉన్నప్పుడు ఇలా అనే ధైర్యం ఉండేదా అని పేరరసు ప్రశ్నించారు.

సత్యరాజ్‌ సంచలన వ్యాఖ్యలు: అసలేం జరిగింది?

తమిళనాడులో సినిమాలను, రాజకీయాలను వేరుచేసి చూడలేం. ఈ రెండింటి మధ్య అంత అవినాభావ సంబంధం ఉంది. ప్రఖ్యాత దివంగత రాజకీయ నాయకులు కామరాజర్‌, అన్నాదురై నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్‌ వరకు సినిమాలతో చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్లే. ఇప్పుడు కూడా చాలా మంది నటీనటుల దృష్టి రాజకీయాలపైనే ఉందని చెప్పవచ్చు. తాజాగా విజయ్‌ రాజకీయ రంగప్రవేశం ప్రకంపనలు పుట్టిస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన ప్రచారంలో జరిగిన దురదృష్టకర సంఘటన అనేక చర్చలకు దారి తీస్తోంది. సినీ రంగంలోనూ విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పుట్టిస్తోంది.

దర్శకుడు పేరరసు స్ట్రాంగ్ కౌంటర్

ఉదాహరణకు సత్యరాజ్‌(Satyaraj ), విజయ్‌ను విమర్శించే విధంగా తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ చేశారు. అందులో నటులను తలపై పెట్టుకొని ఊరేగకండి.., వాళ్లకు చాలా తెలుసని మీరు భావించకండి, నటించడం మాత్రమే తెలుసు. ఈ సమాజంలో జరుగుతున్న పెద్ద తప్పు నటులను ఐన్‌ స్టిన్‌ రేంజ్‌లో భావిస్తుండడమే. మమ్మల్ని నెత్తినెక్కించుకోకండి. మేము జస్ట్‌ పాటిస్తాం అంతే. మేము పెరియార్‌, అంబేడ్కర్‌ కాదని గుర్తుంచుకోవాలంటూ పేర్కొన్నారు.

కోలీవుడ్‌లో పొలిటికల్, సినీ చర్చ

ఈ కామెంట్‌పై దర్శకుడు పేరరసు తీవ్రంగా స్పందించారు. ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటులకు ఏమీ తెలియదు. ఒట్టి మట్టే అంటే ఎలా.. మీరూ నటుడే కదా.. మీరెందుకు సందేశం ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఎంజీఆర్‌ ఉన్నప్పుడు మీకు ఇలా అనే ధైర్యం ఉండేదా ? కమలహాసన్‌కు ఎంపీ పదవి ఇచ్చారని, మీరు డీఎంకేను అడగాల్సింది. పార్టీ కోసం శ్రమించిన వాళ్లు ఎందరో ఉండగా వారి కూతుళ్లకు పదవి ఇవ్వకుండా సత్యరాజ్‌ కూతురికి పదవి ఎందుకు ఇచ్చారని మీరు డీఎంకే పార్టీని అడగాలి. నటన అనేది ఒక వృత్తే. అందులోనూ ప్రపంచ జ్ఞానం కలవారు ఎందరో ఉన్నారు. వారిని అరకొర తెలిసిన వాళ్లు అని కించపరచరాదు అని దర్శకుడు పేరరసు సత్యరాజ్‌పై ఫైర్‌ అయ్యారు.

సత్యరాజ్‌ వ్యాఖ్యలు, పేరరసు కౌంటర్ తమిళ సినీ పరిశ్రమలో మరోసారి రాజకీయ సంబంధాలపై చర్చకు దారితీసింది. నటుల పాత్ర, వారి సామాజిక బాధ్యతలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం మరిన్ని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.