
కొత్త సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’ లో నటిస్తున్న వశిష్ట సింహా, సినిమా విశేషాలు, సహనటుల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో సత్యరాజ్, ఉదయభాను ముఖ్యపాత్రలు పోషించారు.
Key Points
వశిష్ట సింహా తన కొత్త సినిమా 'త్రిబాణధారి బార్బరిక్' గురించి మాట్లాడారు.
సినిమాలో సత్యరాజ్, ఉదయభాను వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించారు.
వశిష్ట సింహా సినిమాలోని తన పాత్ర గురించి వివరించారు.
సత్యరాజ్ గారి నటనను వశిష్ట సింహా ప్రశంసించారు.
త్రిబాణధారి బార్బరిక్ సినిమా గురించి వశిష్ట సింహా విశేషాలు
కేజీఎఫ్, ఓదెల, ఓదెల 2 సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు వశిష్ట ఎన్ సింహా నటించిన లేటెస్ట్ మూవీ త్రిబాణధారి బార్బరిక్. ఈ సినిమాలో సత్యరాజ్, ఉదయభాను, సత్యం రాజేష్ , సాంచీ రాయ్ సైతం ముఖ్య పాత్రలు పోషించారు.
డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబాణధారి బార్బరిక్ మూవీ ఆగస్ట్ 29న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను నటుడు వశిష్ట ఎన్ సింహా పంచుకున్నారు.
-ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ వల్ల మోహన్ గారు నాకు ఈ కథను వినిపించారు. ఏవమ్ షూటింగ్‌లో ఉన్నప్పుడు మోహన్ గారు, నరేంద్ర గారు ఈ పాయింట్‌ను చెప్పారు. సోషియో, థ్రిల్లర్ అని చెప్పి ఈ టైటిల్‌ను చెప్పారు. త్రిబాణధారి బార్బరిక్ అనే టైటిల్ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఈ పాత్ర గురించి బయట చాలా మందికి తెలియదు. టైటిల్ చెప్పిన వెంటనే కథను వినాలని అనిపించింది. నెరేషన్ చేసిన దాని కంటే విజువల్‌గా అద్భుతంగా వచ్చింది.
సత్యరాజ్ గారి నటనపై వశిష్ట సింహా అభిప్రాయాలు
– త్రిబాణధారి బార్బరిక్ కథ మన చుట్టూనే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతీ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతీ పాత్రతో అందరూ కనెక్ట్ అవుతారు. ఇప్పటి వరకు నేను నెగెటివ్ రోల్స్ పోషించాను. కానీ ఇందులో నా కారెక్టర్ సరికొత్తగా ఉంటుంది. ఈ సమాజాన్ని ప్రతిబింబించేలా మా చిత్రం, నా పాత్ర ఉంటుంది. ఇందులోని స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది.
-మిడిల్ క్లాస్‌కు చెందిన ఓ అబ్బాయి పాత్రను పోషించాను. పెద్ద కలలతో ఉండే ఈ వ్యక్తి ఏం చేస్తాడు? అన్నది చాలా బాగా చూపించారు. బార్బరిక్ కథలో నా ట్రాక్ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులోని ప్రతీ పాత్రకు బార్బరికుడి థీమ్‌కు లింక్ ఉంటుంది. త్రిబాణంలో ఎవరు ఏ బాణం అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ చిత్రంలో బార్బరికుడు కనిపించడు.. అతని శక్తిని చూస్తారు.
సినిమాలోని ఇతర నటుల గురించి వశిష్ట సింహా వ్యాఖ్యలు
-జవాబుదారితనం, బాధ్యతల గురించి ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సత్య రాజ్ గారు, ఉదయభాను గారు, క్రాంతి కిరణ్, నా పాత్ర, సాంచీ రాయ్ ఇలా అన్ని కారెక్టర్స్ చక్కగా కుదిరాయి.
– సత్యరాజ్ గారు ఇప్పటికే 170కి పైగా సినిమాలు చేశారు. శ్యామ్ కతు అనే పాత్రలో ఆయన చాలా అద్భుతంగా నటించారు. మనకి కూడా ఇలాంటి ఓ తాత ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఉదయ భాను గారు చాలా ఏళ్ల తరువాత ఓ శక్తివంతమైన పాత్రను పోషించారు. సత్యం రాజేష్ గారు, సాంచీ రాయ్, క్రాంతి కిరణ్, మేఘన ఇలా అందరి పాత్రలు ఆకట్టుకుంటాయి.
మొత్తంగా, వశిష్ట సింహా ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాపై తన ఆనందాన్ని, సహనటుల నటనపై ప్రశంసలను వ్యక్తం చేశారు. సినిమా విడుదల కోసం ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు.


