
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె ఇండస్ట్రీల్లో వివక్ష గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. హాలీవుడ్‌లో రంగు, యాస ఆధారంగా వివక్షను తాను ఎదుర్కొన్నానని, ఆ బాధను మర్చిపోలేదని చెప్పింది. ఆమె అల్లు అర్జున్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేస్తోంది.
Key Points
పనివేళలపై గొడవలతో దీపికా పదుకొణె భారీ ప్రాజెక్ట్స్ కోల్పోతోంది.
సినీ ఇండస్ట్రీల్లో రంగు, యాస ఆధారిత వివక్ష ఉందని దీపికా సంచలన వ్యాఖ్యలు.
హాలీవుడ్‌లో తను ఎదుర్కొన్న వివక్షను, ఆ బాధను ఇప్పటికీ మర్చిపోలేదని వెల్లడించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో AA-22లో నటిస్తోంది.
దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)గత కొద్ది కాలంగా విమర్శలు ఎదుర్కొంటుంది. 8 గంటల పని దినాలు కావాలని కోరడంతో దీపికాను భారీ ప్రాజెక్ట్స్ నుంచి తొలగించేశారు. దర్శకనిర్మాతలతో గొడవలు కావడంతో అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. అయినప్పటికీ ఏమాత్రం భయపడిపోకుండా దీపికా ఒంటరి పోరాటం చేస్తోంది. నిత్యం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటే వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, ఇండస్ట్రీలో వివక్ష చూపిస్తున్నట్లు తెలుపుతూ దీపికా సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘నేను విదేశాలకు వెళ్లిన ప్రతిసారి నన్ను బాధపెట్టిన అంశం రంగు, యాస, వివక్ష.
ఇండస్ట్రీల్లో వివక్ష అనుభవాలు
అందరూ అనుకుంటున్నట్లుగా హాలీవుడ్‌లో ప్రతీదీ నిజాయితీగా, సక్రమంగా ఏమీ జరగదు. భారతీయ నటీనటులు అక్కడ వివక్షను ఎదుర్కొంటున్నారు. శరీర రంగు ఆధారంగా వివక్ష చూపిస్తుంటారు. స్కిన్ కలర్‌తో పాటు మన ఇంగ్లీష్ యాసపై కూడా అక్కడ చిన్న చూపు ఉంటుంది. ఆ వివక్షలన్నింటినీ కూడా నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఆ బాధను ఇప్పటికీ మర్చిపోలేదు. బాలీవుడ్, టాలీవుడ్ హాలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీల్లో వివక్ష ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది.
అల్లు అర్జున్‌తో దీపికా భారీ ప్రాజెక్ట్
ఇక దీపికా సినిమాల విషయానికొస్తే.. త్వరలో ఈ అమ్మడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)తో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తోంది. ‘AA-22’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ అట్లీ(Atlee) దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఎదురుచూడటం మొదలెట్టారు.
దీపికా పదుకొణె వివక్షపై గళమెత్తి వ్యక్తిగత పోరాటం చేస్తోంది. కెరీర్‌లోనూ దూసుకుపోతూ, అల్లు అర్జున్‌తో ఆమె రాబోయే చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

