|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Divi : మంగ్లీ మంచిదని వెళ్లా.. బర్త్ డే పార్టీ ఇష్యూపై దివి షాకింగ్ కామెంట్స్

Published: 11-06-2025, 10:12 AM
Divi : మంగ్లీ మంచిదని వెళ్లా.. బర్త్ డే పార్టీ ఇష్యూపై దివి షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ వివాదం తెలిసిందే. ఈ పార్టీకి హాజరైన నటి దివి, తన స్పందనను వెల్లడించారు. మంగ్లీ తన మంచి స్నేహితురాలు అని, పార్టీకి ఆమె పిలుపు మేరకు వెళ్లారని చెప్పారు.

Key Points

1

మంగ్లీ బర్త్‌డే పార్టీలో దివి హాజరు

2

పార్టీలో లిక్కర్, గంజాయి విషయం

4

తన ఫోటోలను కేసుకు సంబంధించి వేయకూడదని దివి కోరింది

మంగ్లీ బర్త్‌డే పార్టీ వివాదం

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ సింగర్ మంగ్లీ బర్త్ డే వేడుక దుమారంగా మారిన సంగతి తెలిసిందే. చేవెళ్లలోని ఓ ఫార్మ్‌హౌస్‌లో మంగ్లీ పుట్టినరోజు వేడుకలు జరగ్గా ఆ పార్టీకి మొత్తం 50 మంది హాజరయ్యారు.పోలీసులు ఫార్మ్‌హౌస్ పై దాడి చేసి అనుమతి లేకుండా విదేశీ లిక్కర్ సప్లై చేశారని కేసు నమోదు చేశారు. అంతే కాకుండా పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి గంజాయి తీసుకున్నట్టు నిర్దారించారు. ఈ పార్టీలో మంగ్లీ సన్నిహితులతో పాటూ కొందరు సెలబ్రెటీలు కూడా ఉన్నారు. నటి దివి కూడా బర్త్ డే పార్టీకి హాజరయ్యారు.

దీంతో దివి ఫోటోలు మీడియాలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె బర్త్ డే పార్టీపై స్పందించారు. మంగ్లీ తన స్నేహితురాలు అని అమె మంచిది అని అన్నారు. మంగ్లీ పిలవడంతోనే పార్టీకి వెళ్లానని చెప్పారు. స్నేహితురాలు బర్త్ డే పార్టీ అని వెళితే అక్కడ తప్పు చేసినట్టు కాదని అన్నారు. తను ఎంతో కష్టపడి పైకి వచ్చానని కానీ ఫోటోలు వేస్తే తన కెరీర్ పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బర్త్ డే పార్టీకి వెళ్లినంత మాత్రాన అక్కడ జరిగిన తప్పులకు కారణం కాదు కదా అని వ్యాఖ్యానించారు. తన ఫోటోలను ఈ కేసుకు సంబంధించి వేయకూడదని దివి కోరారు.

దివి పార్టీలో హాజరు

ఫోక్ సింగర్ మంగ్లీ లిక్కర్ పార్టీ.. భారీగా విదేశీ మద్యం సీజ్

దివి స్పందన

Singer Mangli: లిక్క‌ర్ పార్టీలో దురుసు ప్ర‌వ‌ర్త‌న‌..మంగ్లీకి తెలంగాణ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్

మంగ్లీ బర్త్‌డే పార్టీ వివాదంపై దివి స్పష్టతనిచ్చారు. స్నేహితురాలి పిలుపు మేరకు పార్టీకి వెళ్లారని, జరిగిన తప్పులకు తాను బాధ్యత వహించరని తెలిపారు. ఈ విషయంలో తన ఫోటోలను వాడకూడదని కోరారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.