
అంతర్జాతీయ సినిమా రంగంలో ప్రకాశిస్తున్న ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్ జో శర్మకు ప్రతిష్టాత్మకమైన వేవ్స్ సమ్మిట్ 2025కు ఆహ్వానం అందింది. USA డెలిగేట్‌గా ఆమె పాల్గొననున్నారు. ఈ సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
Key Points
ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్ జో శర్మకు వేవ్స్ సమ్మిట్ 2025కు ఆహ్వానం.
USA డెలిగేట్‌గా పాల్గొనే అవకాశం లభించింది.
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ప్రముఖులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు.
జో శర్మ సినీ ప్రయాణంలో ఇది మరో మైలురాయి.
జో శర్మకు గౌరవ ఆహ్వానం
అంతర్జాతీయ సినిమా రంగంలో దూసుకెళ్తున్న ఎమ్4ఎమ్ (M4M) చిత్ర హీరోయిన్ జో శర్మకు మరో గౌరవం లభించింది. ఆమెకు ‘వేవ్స్ సమ్మిట్ 2025’ (WAVES Summit 2025)లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) డెలిగేట్‌గా పాల్గొనాలని గౌరవ ఆహ్వానం అందింది. కళ, సాంస్కృతికం, సినిమాను ఘనంగా ఆవిష్కరించే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్‌లో జో శర్మ పాల్గొనడం సినిమా రంగంలో ఆమె ఎదుగుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.
వేవ్స్ సమ్మిట్ 2025 విశేషాలు
కాగా.. మోటివ్ ఫర్ మర్డర్ (M4M) అనే థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతో జో శర్మ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. మోహన్ మీడియా క్రియేషన్స్ సంస్థ, జో శర్మ మెక్‌విన్ గ్రూప్ యూఎస్ఏ సంయుక్తంగా నిర్మించాయి.
సినిమా రంగంలో జో శర్మ ఎదుగుదల
కాగా.. జో శర్మకు ప్రతిష్టాత్మక వేవ్ల్ సమ్మిట్ -2025కు ఆహ్వానం రావడం ఇండియన్-అమెరికన్ ప్రతిభ ప్రపంచ సినీ రంగంలో ఎలా విస్తరిస్తున్నదనేదానికీ నిదర్శనంగా నిలుస్తోంది. మరోవైపు ముంబయి లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘వేవ్స్ సమ్మిట్ 2025 ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మే 4, 2025 వరకు జరిగే ఈ సమ్మిట్‌లో 90కి పైగా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటున్నారు.
జో శర్మకు వేవ్స్ సమ్మిట్ 2025కు ఆహ్వానం రావడం ఆమె సినీ ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయి. ఇండియన్-అమెరికన్ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నదానికి ఇది నిదర్శనం.


