|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దివి వాడ్త్యా సంచలనం: నేను కత్తిలా ఉంటా.. ఛాన్స్ ఇవ్వండి! గ్లామర్ షోకి కారణం అదేనా?

Published: 25-01-2026, 6:35 AM
దివి వాడ్త్యా సంచలనం: నేను కత్తిలా ఉంటా.. ఛాన్స్ ఇవ్వండి! గ్లామర్ షోకి కారణం అదేనా?
  • దివి వాడ్త్యా: బిగ్ బాస్ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి!
  • సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్న దివి వాడ్త్యా!!
  • సినిమాల్లో అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తున్నానని దివి కామెంట్స్!
  • ట్రెడిషినల్ గా కనిపించాలనే ఉంది కానీ అవకాశాలు రావట్లేదన్న దివి!

బిగ్ బాస్ బ్యూటీ దివి వాడ్త్యా మరోసారి వార్తల్లో నిలిచింది. తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలేంటో చూద్దాం.

గ్లామర్ షో వెనుక అసలు కారణం చెప్పిన దివి!

Divi Vadthya : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న దివి ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగానే ఉంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది దివి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను పెట్టె పోస్టుల గురించి, వుమెన్ డ్రెస్సింగ్ గురించి కామెంట్స్ చేసింది.(Divi Vadthya)

సినిమా అవకాశాలపై దివి వాడ్త్యా కామెంట్స్ వైరల్!

సోషల్ మీడియాలో తను పెట్టే పోస్టుల గురించి స్పందిస్తూ.. నాకు ట్రెడిషినల్ గా ఉండటం చాలా ఇష్టం. కానీ ఇప్పుడున్న సినిమాల్లో ఇలాగే చూపిస్తున్నారు. నేను కూడా బాగుంటాను, నాకు కూడా అవకాశం ఇవ్వండి, నేను కూడా కత్తిలా ఉంటాను అని చూపించుకోడానికి సోషల్ మీడియానే ప్లాట్ ఫామ్. నేను అక్కడే నా బాడీ, నా స్కిల్స్, నా ఫోటోలు చూపెడతాను. ఇక్కడ సినిమా వాళ్లకు ఫస్ట్ లుక్స్ ఇంపార్టెంట్, ఆ తర్వాతే యాక్టింగ్ వచ్చారాదా అని చూస్తున్నారు. యాక్టింగ్ ఇంపార్టెంట్ కానీ మనవాళ్ళు అది చూడట్లేదు. లుక్స్ చూస్తున్నారు. అందుకే నేను అలా ఫోటోలు పోస్ట్ చేస్తున్నాను. అయినా ఆ బట్టలు ఫోటోల వరకే బయట అవి వేసుకొని తిరగను అని తెలిపింది.

డ్రెస్సింగ్ పై దివి చేసిన వ్యాఖ్యలు దుమారం!

అలాగే ఇటీవల వుమెన్ డ్రెస్సింగ్ గురించి జరిగిన ఇష్యూ పై స్పందిస్తూ.. అతను(శివాజీ) చెప్పింది కరెక్ట్ అవ్వొచ్చు కానీ లూజ్ టాంగ్ ఉండకూడదు. మనం వేసే బట్టలు పేరెంట్స్ కి అగ్లీ గా ఉండకూడదు. మనం డ్రెస్ సరిచేసుకుంటూ ఉంటే వాళ్ళు చూస్తుంటే అన్ కంఫర్ట్ ఫీల్ అవడం ఎందుకు. కానీ సెక్సీగా రెడీ అవ్వండి, సూపర్ గా రెడీ అవ్వండి. నీకు ఏది నచ్చితే అది వేసుకో అది పక్కనోళ్ళకు ఇబ్బంది కలగనంతవరకు. జనాలు నిన్ను అగ్లీగా చూసేంతలా వేసుకోకు. నేను సోషల్ మీడియాలో కేవలం ఫోటోల కోసం మాత్రమే వేసుకుంటాను. అవి బయటకు వేసుకొని వెళ్ళను. నీకు కావాల్సినవి వేసుకో. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటారు కానీ వేరేవాళ్లకు ఇబ్బంది కలగకూడదు. ఎక్కడికి వేసుకెళ్ళేవి అక్కడికి వేసుకెళ్ళాలి. టెంపుల్, బీచ్, పబ్.. ప్లేస్ ని బట్టి బట్టలు వేసుకోవాలి అని చెప్పుకొచ్చింది దివి.

దివి వాడ్త్యా చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.