|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దివి వడ్త్యా స్ట్రీట్ షాపింగ్: హైదరాబాద్ వీధుల్లో సందడి! ఇంతకీ ఏం కొన్నారో?

Published: 25-02-2026, 7:05 AM
దివి వడ్త్యా స్ట్రీట్ షాపింగ్: హైదరాబాద్ వీధుల్లో సందడి! ఇంతకీ ఏం కొన్నారో?
  • దివి స్ట్రీట్ షాపింగ్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచింది.
  • హైదరాబాద్‌లో రాత్రిపూట షాపింగ్ అంటే దివికి చాలా ఇష్టం.
  • గాజులు చూస్తూ దివి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
  • దివి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ నటి దివి వడ్త్యా హైదరాబాద్‌లో స్ట్రీట్ షాపింగ్ చేస్తూ కనిపించారు. ఆమె సాధారణంగా సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి వీధుల్లో షాపింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దివి స్ట్రీట్ షాపింగ్ విశేషాలు

Divi Vadthya: సినిమాల ద్వారా కోట్ల రూపాయలు గడిస్తున్నా.. స్ట్రీట్ షాపింగ్ అంటేనే తమకు ఇష్టం అంటూ.. అభిమానులకు షాక్ ఇస్తున్నారు సెలబ్రిటీలు.. ముఖ్యంగా పబ్లిక్ లోకి వస్తే తమకు జనాల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనే విషయాలను కూడా పక్కనపెట్టి.. స్వేచ్ఛగా వీధుల వెంట తిరుగుతూ స్ట్రీట్ షాపింగ్ చేసేస్తూ తమ ఆనందాన్ని పొందుతున్నారు కొంతమంది సెలబ్రిటీలు. సాధారణంగా విదేశాలలో స్ట్రీట్ షాపింగ్ అంటే పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడ ప్రత్యేకించి మన హైదరాబాదులో స్ట్రీట్ షాపింగ్ అంటే ఇక సామాన్యులు ఊరుకుంటారా? సెలబ్రిటీలు కనిపిస్తే వారితో కరచాలనం చేయాలని, ఫోటోలు దిగాలని ఎగబడిపోతూ ఉంటారు. అందుకే చాలామంది హీరోయిన్స్ హైదరాబాదులో స్ట్రీట్ షాపింగ్ చేయాలి అంటే కాస్త భయపడతారు. కానీ తాను మాత్రం నిస్సందేహంగా సంతోషంగా స్ట్రీట్ షాపింగ్ చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ ని పొందుతున్నాను అంటోంది దివి. ఈ మేరకు దివి షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ అభిమానులలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సెలబ్రిటీ అయినప్పటికీ ఇలా హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్ తో అందరిని మెస్మరైజ్ చేసేసింది ఈ ముద్దుగుమ్మ.

అసలు విషయంలోకి వెళ్తే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఒకవైపు చీరకట్టులో నడుము , నాభి అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసే దివి.. మరొకవైపు గ్లామర్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా తన సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అభిమానులకు చేరు అవ్వడానికి నేను ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్గానే ఉంటుంది. ఇక అందులో భాగంగానే తాజాగా తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన విషయాలను కూడా పంచుకునే ఈమె..తాజాగా హైదరాబాద్ వస్తువులు అంటే తనకు చాలా ఇష్టం అని .. అది కూడా రాత్రివేళలో స్ట్రీట్ షాపింగ్ చేయడం అంటే మహా ఇష్టమని ఇంస్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చింది.

షాపింగ్‌లో దివి ఎక్స్‌ప్రెషన్స్ వైరల్

అందులో భాగంగానే ఇలా వీధిలో షాపింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఆమె ఇలా షాపింగ్ లో భాగంగా గాజులను చూస్తూ ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ స్ట్రీట్ షాపింగ్ అంటే ఆమెకు ఎంత ఇష్టమో ఆమె కళ్ళల్లో మెరుపును చూస్తే అర్థమవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే హైదరాబాదులో ఇలా తనకు నచ్చిన వస్తువులను నచ్చిన ప్రదేశంలో స్వేచ్ఛగా కొనుగోలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం దివి షేర్ చేసిన ఈ ఇంస్టాగ్రామ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సోషల్ మీడియాలో ఫోటోలు హల్ చల్

మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి.. మహర్షి సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దివి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ టైమ్స్ 2020 లో టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా అవార్డు అందుకుంది.. హైదరాబాద్ లోనే పుట్టి అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసి తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. లంబసింగి, సింబా , పుష్ప 2, డాకు మహారాజ్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇటీవల హనీ అనే చిత్రంలో నటించి అందర్నీ మెస్మరైజ్ చేసింది . ఫిబ్రవరి 6 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది .ఇక ప్రస్తుతం కర్మస్థలం అనే ఒక చిత్రంలో నటిస్తోంది.

Tags bigg boss Divi Vadthya Share

మొత్తానికి దివి తన అభిమానుల కోసం హైదరాబాద్ వీధుల్లో షాపింగ్ చేస్తూ సందడి చేసింది. ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.