|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Divvala Madhuri Bigg Boss 9: రెండేళ్లు నరకం చూశా.. మొదటి భర్తని వదిలేయడంపై దివ్వెల మాధురీ ఓపెన్‌ కామెంట్‌

Published: 12-10-2025, 12:54 PM
Divvala Madhuri Bigg Boss 9: రెండేళ్లు నరకం చూశా.. మొదటి భర్తని వదిలేయడంపై దివ్వెల మాధురీ ఓపెన్‌ కామెంట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9లోకి వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్‌ దివ్వెల మాధురీ తన గతం గురించి షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. మొదటి భర్తతో విడిపోయాక రెండేళ్లు నరకం చూశానని, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్‌ తనకు అండగా నిలిచాడని తెలిపింది. ఆమె వ్యక్తిగత జీవితంలోని ఈ విషయాలు చర్చనీయాంశంగా మారాయి.

Key Points

1

దివ్వెల మాధురీ బిగ్‌ బాస్‌ తెలుగు 9లోకి వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.

2

తనకు ఇంటర్‌లోనే పెళ్లయ్యి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని దివ్వెల మాధురీ వెల్లడించింది.

4

కష్టాల్లో ఉన్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్‌ తనకు అండగా నిలిచారని దివ్వెల మాధురీ పేర్కొంది.

బిగ్‌ బాస్‌లోకి దివ్వెల మాధురీ ఎంట్రీ

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఐదో వారం ఒక ఎలిమినేషన్‌తోపాటు ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ జరిగాయి. ఇందులో సెన్సేషనల్‌ కంటెస్టెంట్స్ బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చారు. అలేఖ్య చిట్టి పికిల్స్ గర్ల్ రమ్య మోక్ష ఎంట్రీ ఇచ్చింది. ఆమెతోపాటు నటుడు శ్రీనివాసా సాయి, అలాగే నిఖిల్‌ నాయర్‌, అలాగే సోషల్‌ మీడియా, పొలిటికల్‌ సెన్సేషన్‌గా మారిన దివ్వెల మాధురీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీకి సంబంధించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఆదివారం వైల్డ్ కార్డ్స్ ద్వారా దివ్వెల మాధురీ బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే తాను ఫైర్‌ బ్రాండ్‌ అనే విషయాన్ని చాటి చెప్పింది. అంతేకాదు తన గతాన్ని తలుచుకుంది. ఎంతటి బాధని అనుభవించిందో తెలిపింది. ఎలాంటి పరిస్థితుల్లో తాను దువ్వాడ శ్రీనివాస్‌కి దగ్గరయ్యిందో, మొదటి భర్తని వదిలేసిందో వెల్లడించింది.

హౌజ్‌లోకి వచ్చిన దివ్వెల మాధురీ తన అంతరంగాన్ని మొత్తం బయటపెట్టింది. వస్తూ రావడంతోనే తనని తాను ఫైర్‌ బ్రాండ్‌గా ప్రకటించుకుంది. అయితే తనకు ఇంటర్‌లోనే పెళ్లి చేశారట. ఇద్దరు ఆడపిల్లలు ఆరాధ్య, అఖిల జన్మించారని తెలిపింది. అయితే తన మొదటి భర్తతో అండర్‌ స్టాండింగ్‌కి సంబంధించిన సమస్యలు తలెత్తాయని తెలిపింది. కలిసి ఉండేందుకు చాలా ప్రయత్నించిందట. ఎన్నో ప్రయత్నాలు చేసినా వర్కౌట్‌ కాలేదని, దీంతో విడిపోవాల్సి వచ్చిందని తెలిపింది మాధురీ. కుటుంబం వదిలేశాక, ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో తనలాగే కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌ దగ్గరయ్యాడని, తనలాగే ఆయన బాధపడుతున్నాడని చెప్పింది. ఇద్దరి బాధలు కలిశాయి. తనకు తోడుగా ఉండేందుకు దువ్వాడ సిద్ధమయ్యాడని తెలిపింది. ఇద్దరం కష్టాల నుంచి కలుసుకున్నామని వెల్లడించింది. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్‌ అంటే మాధురీ, మాధురీ అంటే శ్రీనివాస్‌ అనేలా ఇద్దరం కలిసిపోయామని, కలిసి ఉంటున్నామని, ఒకరికొకరం అండగా ఉంటున్నామని తెలిపింది.

మొదటి వివాహం, పడిన బాధలు

ఈ సందర్భంగా పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించింది మాధురీ. భర్త నుంచి విడిపోయి, దువ్వాడ శ్రీనివాస్‌కి దగ్గరయ్యే క్రమంలో చాలా మనోవేదనకు గురయ్యిందట. చాలా మంది సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారట. రెండేళ్లపాటు ప్రతి రోజూ నరకం చూశానని తెలిపింది మాధురీ. తనకు వ్యతిరేకంగా చాలా రకాలుగా కామెంట్లు చేశారని, వ్యక్తిత్వ హననం చేశారని తెలిపింది. అలాంటి సమయంలో లైఫ్‌ సెకండ్‌ ఛాన్స్ ఇస్తుందంటారు. తన విషయంలో అదే జరిగిందని, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మాధురీ 2.0ని చూస్తారని తెలిపింది.

బయట తనపై వంద శాతం నెగటివిటీ చూపించేవారని, తనకు అండగా నిలిచేవారే లేరని, వారిని ఒంటరిగా ఎదుర్కొన్నానని, ఒంటరిగా పోరాడానని తెలిపింది. ఈ క్రమంలో 80శాతం ప్రజలు తనని అర్థం చేసుకున్నారు, తన వద్దకు వస్తున్నారు, కలుస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. దీంతో తన రియాలిటీ ఏంటో వాళ్లు తెలుసుకున్నారు. ప్రేమిస్తున్నారు. కానీ ఇంకా 20శాతం మంది తనని హేట్‌ చేస్తున్నారు, వాళ్లకి కూడా దగ్గర కావాలి, వాళ్లల్లో కూడా నెగటివిటీ పోగొట్టాలని, అందుకు బిగ్‌ బాస్‌ షో మంచి వేదికగా భావించినట్టు తెలిపింది మాధురీ. ఇందులో తన రియాలిటీ ఏంటో చూపిస్తానని చెప్పింది. మిగిలిన ఆ 20శాతం ప్రజలు కూడా తన రియాలిటీని అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఈ జర్నీలో తనని తాను తెలుసుకున్నానని, తనకు నచ్చినట్టు ఉండాలని నేర్చుకున్నట్టు చెప్పింది.

దువ్వాడ శ్రీనివాస్‌తో బంధం

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఇమ్మాన్యుయెల్‌ తప్ప, ఫేవరేట్‌ ఎవరూ లేరని, తాను వెళ్లాక ఆట వేరే లెవల్‌లో ఉంటుందని తెలిపింది మాధురీ. హౌజ్‌లో ఇమ్మూ తప్ప మిగిలిన వారి రియాలిటీ బయటకు రావడం లేదని, మాస్క్ తో ఆడుతున్నారని, వాళ్ల రియాలిటీ బయటపెడతానని తెలిపింది. శ్రీనివాస్‌ కోసం ఏదైనా చేస్తానని తెలిపింది. ఆయన సపోర్ట్ తోనే బిగ్‌ బాస్‌ షోకి వస్తున్నట్టు వెల్లడించింది. ఇక బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వెళ్లే ముందు ఆమెకి కన్నడ బిగ్‌ బాస్‌ హోస్ట్ సుదీప్‌ ద్వారా ఒక సూపర్‌ పవర్‌ ఇచ్చారు. గోల్డెన్‌ బజర్‌ని ఇచ్చారు. దీని ద్వారా ఈ వారం డేంజర్‌లో ఉన్నవారిలో ఒకరిని సేవ్‌ చేసే అవకాశం కలిగి ఉంటుంది. మరి ఆమె ఎవరికి ఉపయోగిస్తుందో చూడాలి. దివ్వెల మాధురీ తన మొదటి భర్తని వదిలేసి ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కి దగ్గరయ్యింది. ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఇంకా పెళ్లి చేసుకోలేదుగానీ, ఇద్దరు భార్యాభర్తలుగానే చెలామణి అవుతున్నారు. వీరి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో, సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఫైర్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని కలిగిన మాధురీ బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఏ మేరకు రచ్చ చేస్తుందో చూడాలి.

దివ్వెల మాధురీ తన గతాన్ని ధైర్యంగా పంచుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. జీవితంలో ఎదురైన కష్టాలను తట్టుకుని నిలబడిన ఆమె, బిగ్‌ బాస్ హౌస్‌లో ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. ఆమె ప్రయాణంపై ఉత్కంఠ నెలకొంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.